ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రూ.7453 కోట్ల పెట్టుబడితో ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) పథకానికి ఆమోదముద్ర వేసింది. ఇందులో రూ.6853 కోట్లు 1 గిగావాట్ సామర్థ్యం గల ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపన, ప్రారంభం (గుజరాత్, తమిళనాడు కోస్తాల్లో ఒక్కోటి 500 మెగావాట్ల సామర్థ్యం గలవి) కోసం ఉద్దేశించగా రూ.600 కోట్లు ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరం అయిన లాజిస్టిక్స్ సమకూర్చుకోవడానికి వీలుగా రెండు పోర్టుల అప్ గ్రేడేషన్ కు కేటాయించారు.
భారతదేశానికి చెందిన ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో విస్తారంగా అందబాటులో ఉన్న ఆఫ్ షోర్ విండ్ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లక్ష్యంగా 2015 సంవత్సరంలో నోటిఫై చేసిన జాతీయ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ పాలసీ అమలు దిశగా విజిఎఫ్ స్కీమ్ ప్రకటన ఒక పెద్ద ముందడుగు. ప్రభుత్వం విజిఎఫ్ ద్వారా అందిస్తున్న మద్దతు వల్ల ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధర తగ్గి డిస్కమ్ లు దాన్ని కొనుగోలు చేయడానికి అందుబాటు ధరలోకి వస్తుంది. పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రైవేట్ డెవలపర్లను ఎంపిక చేస్తారు. ఆఫ్ షోర్ సబ్ స్టేషన్లు సహా ఇతర మౌలిక వసతులను భారత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. పథకం విజయవంతంగా అమలు జరగడానికి నోడల్ మంత్రివర్గం అయిన నవ్య, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలను సమన్వయపరుస్తుంది.
ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకు ప్రత్యేకమైన పోర్టు మౌలిక వసతులు అవసరం అవుతాయి. భారీ పరిమాణం గల పరికరాలు తరలించేందుకు, విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ తరహా మౌలిక వసతులు కీలకం. ఈ స్కీమ్ కింద ఆఫ్ షోర్ విండ్ డెవలప్ మెంట్ అవసరాలు తీర్చడానికి రెండు పోర్టులకు అవసరమైన మద్దతు పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ అందిస్తుంది.
ఆన్ షోర్ విండ్, సోలార్ ప్రాజెక్టులతో పోల్చితే ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధనానికి చక్కని సోర్స్ గా నిలుస్తాయి. ఆధారనీయత అధికంగా ఉండడంతో పాటు నిల్వ వసతుల అవసరం తక్కువగా ఉంటుంది. అధిక ఉపాధి సామర్థ్యం కూడా కలిగి ఉంది. ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ విభాగం అభివృద్ధి వల్ల ఆర్థిక రంగానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. భారీగా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు దేశీయ తయారీ సామర్థ్యాలు బలపడి విలువ ఆధారిత వ్యవస్థ, టెక్నాలజీ అభివృద్ధి విభాగం అంతటిలోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దేశం ఇంధన పరివర్తన లక్ష్యాలు చేరుకునేందుకు ఇవి సహాయకారిగా ఉంటాయి.
1 గిగావాట్ సామర్థ్యం గల ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించినట్టయితే ప్రతీ ఏటా 372 లక్షల యూనిట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా 25 సంవత్సరాల పాటు ఏటా 29.8 లక్షల టన్నుల కర్బన వ్యర్థాలతో సమానమైన కాలుష్యాలను నిర్మూలించడం సాధ్యమవుతుంది. ఈ స్కీమ్ దేశంలో ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టడంతో పాటు సముద్ర ఆధారిన ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా రూ.4,50,000 కోట్ల పెట్టుబడులతో ప్రాథమికంగా 37 గిగావాట్ల ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
The Cabinet decision to approve a funding scheme for 1 GW offshore wind projects off the coasts of Gujarat & Tamil Nadu will enhance our renewable energy capacity, reduce CO2 emissions and create numerous jobs. https://t.co/3Z2QWiUEfE
— Narendra Modi (@narendramodi) June 19, 2024