States given flexibility to reallocate funds from one component to another based on their specific requirement

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలయ్యే అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను (సిఎస్ఎస్) రెండు సాముదాయక పథకాలుగా హేతుబద్ధీకరించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు ఐచ్ఛిక అనుసరణీయ (కెఫెటేరియా) ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై), ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకా’ల (కెవై)కు ఆమోదముద్ర వేసింది. వీటిలో ‘పిఎం-ఆర్‌కెవివై’ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేది కాగా, ఆహార భద్రత-వ్యవసాయ స్వయం సమృద్ధికి ‘కెవై’ దోహదం చేస్తుంది. ఈ సాముదాయ పథకాల కింద వివిధ పథకాలు-కార్యక్రమాలను సాంకేతికత సద్వియోగంతో ప్రభావవంతంగా, సమర్థంగా అమలు చేస్తారు.

   ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై), వ్యవసాయ దిగుబడుల పెంపు పథకాల (కెవై) పథకాల మొత్తం అంచనా వ్యయం రూ.1,01,321.61 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇవి అమలవుతాయి.

   ఈ కృషితో ఇప్పటికే అమలులోగల పథకాలన్నీ కొనసాగేందుకు భరోసా లభిస్తుంది. రైతు సంక్షేమానికి ఊతమిచ్చే దిశగా ఏ అంశానికి అవసరమో దానికోసం ఈ పథకం లక్ష్యనిర్దేశిత విధానంలో అమలవుతుంది. వంటనూనెలు-ఆయిల్ పామ్ జాతీయ కార్యక్రమం (ఎన్ఎంఇఒ-ఒపి), ఆరోగ్యకర మొక్కల కార్యక్రమం (క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్), డిజిటల్ వ్యవసాయం/ ఖాద్యతైలాలు-నూనెగింజల జాతీయ కార్యక్రమం (ఎన్ఎంఇఒ-ఒఎస్) ఇందుకు ఉదాహరణలు.

   ఇక ‘కెవై’ పథకంలో ‘మిష‌న్ ఆర్గానిక్ వాల్యూ చెయిన్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫ‌ర్ నార్త్ ఈస్ట‌ర్న్ రీజియ‌న్’ (ఎంఒవిసిడిఎన్ఇఆర్‌) ఒక భాగం కాగా, ‘డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్’ (డిపిఆర్) పేరిట మరొకదాన్ని జోడించి దీన్ని ‘ఎంఒవిసిడిఎన్ఇఆర్‌-డిపిఆర్’గా మారుస్తారు. ఈశాన్య రాష్ట్రాలు సంక్లిష్ట సవాళ్లను అధిగమించడంలో ఇది తోడ్పడుతుంది.

   ఈ పథకాల హేతుబద్ధీకరణ వల్ల రాష్ట్రాలు తమ పరిధిలో వ్యవసాయ రంగ సంబంధిత సమగ్ర వ్యూహాత్మక పత్రాన్ని సంపూర్ణ పద్ధతిలో రూపొందించుకోగలవు. పంటల దిగుబడి- ఉత్పాదకతను మాత్రమేగాక వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయం-వ్యవసాయోత్పత్తులకు తగిన విలువ శ్రేణి విధాన రూపకల్పనలో సమస్యల పరిష్కారానికి ఈ పత్రం దోహదం చేస్తుంది. వ్యూహాత్మక చట్రం కింద నిర్దేశిత లక్ష్యాలతో ముడిపడిన పథకాలు/కార్యక్రమాలతోపాటు  మొత్తం వ్యూహాన్ని స్పష్టం చేసే దిశగా ఈ ప్రణాళికలు రూపొందాయి.

వివిధ పథకాల హేతుబద్ధీకరణ లక్ష్యాలు కిందివిధంగా ఉన్నాయి:

·         పునరావృతి నివారణ, సమన్వయానికి భరోసా, రాష్ట్రాలకు సౌలభ్య కల్పన.

·         వ్యవసారంగంలో భవిష్యత్ సవాళ్లపై దృష్టి- పోషకాహార భద్రత, సుస్థిరత, వాతావరణ మార్పు నిరోధకత, విలువ శ్రేణి అభివృద్ధి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం.

·         అవసరాలకు తగినట్లు వ్యవసాయ రంగ సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు.

·         రాష్ట్రాల వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఎఎపి)లకు విడివిడిగా కాకుండా ఏకకాలంలో ఆమోదం.

   రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్దిష్ట అవసరాల ప్రాతిపదికన ఈ పథకం నిధులను ఇతర అంశాలకు మళ్లించుకునే వెసులుబాటు కల్పించడాన్ని ‘పిఎం-ఆర్‌కెవివై’లో కీలక మార్పుగా పేర్కొనవచ్చు.

   ఈ రెండు పథకాలకు మొత్తం అంచనా వ్యయం రూ.1,01,321.61 కోట్లు కాగా, ఇందులో కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వాటా రూ.69,088.98 కోట్లుగా ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద రూ.32,232.63 కోట్లు సమకూర్చాలి. కాగా, మొత్తం వ్యయంలో ‘ఆర్‌కెవివై’కి రూ.57,074.72 కోట్లు, ‘కెవై’కి రూ.44,246.89 కోట్లుగా నిర్దేశించారు.

‘పిఎం-ఆర్‌కెవివై’ అంతర్భాగ పథకాలివే:

     i.        భూసార నిర్వహణ

    ii.        వర్షాధార ప్రాంత అభివృద్ధి

   iii.        వ్యవసాయ అటవీకరణ

  iv.        సంప్రదాయ వ్యవసాయాభివృద్ధి పథకం

    v.        పంట వ్యర్థాల నిర్వహణ-వ్యవసాయ యాంత్రీకరణ

  vi.        ప్రతి నీటిచుక్కకూ మరింత పంట

 vii.        పంటల వైవిధ్యీకరణ కార్యక్రమం

viii.        ‘ఆర్‌కెవివై’ డిపిఆర్ భాగం

  ix.        వ్యవసాయ అంకుర సంస్థల కోసం ‘యాక్సిలరేటర్ ఫండ్’

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage