కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం లో పరివర్తనాత్మక సంస్కరణల కు మార్గాన్ని సుగమం చేస్తూ నేశనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎ) ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన మంత్రిమండలి సమావేశం తన ఆమోదాన్ని తెలిపింది.
నియామక సంబంధిత సంస్కరణలు- యువత కు ఓ ప్రధాన వరం:
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకొనే అభ్యర్థులు ఒకే అర్హత నిబంధన లు ఉన్నప్పటికీ , వివిధ పోస్టుల కు బహుళ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ లు నిర్వహించే వేర్వేరు పరీక్షల కు హాజరు కావలసి ఉండేది. అభ్యర్థులు పలు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల కు రుసుము ను చెల్లించవలసి వచ్చేది. వీరు ఈ పరీక్షల కు హాజరు కావడం కోసం దూరప్రాంతాల కు వెళ్లవలసి ఉండేది. ఇలా పలు రిక్రూట్‌మెంట్ పరీక్షల కు హాజరు కావడం అభ్యర్థుల కు, అటు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల కు భారం గా ఉండేది. నివారింపదగిన, పదేపదే పెట్టే ఖర్చులు, శాంతి భద్రత లు, సెక్యూరిటీ సంబంధిత సమస్య లు, పరీక్ష కేంద్రాల విషయం లో సమస్య లు ఉండేవి. సగటు న ప్రతి పరీక్షకు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు హాజరు అయ్యే వారు. ఈ ఉమ్మడి అర్హత పరీక్ష తో అభ్యర్థులు ఒకసారి ఈ పరీక్షకు హాజరై, ఈ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ లు నిర్వహించే ఏదైనా ఒక లేదా అన్ని ఉన్నత స్థాయి పరీక్షల కు హాజరు కావడానికి వీలు ఉంటుంది. ఇది అభ్యర్థులందరికీ ఒక వరం వంటిది.
నేశనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎ)
బహుళ ఏజెన్సీ సంస్థ అయిన నేశనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎ) గ్రూప్ బి, గ్రూప్- సి (నాన్ టెక్నికల్) పోస్టుల కు సంబంధించి అభ్యర్థుల ను వడపోయడానికి లేదా షార్ట్‌లిస్ట్ చేయడానికి ఉమ్మడి అర్హత పరీక్షను నిర్వహిస్తుంది. ఎన్‌ఆర్‌ఎ లో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్శియల్ సర్వీసెస్ విభాగం, ఎస్ఎస్ సి, ఆర్ ఆర్‌బి, ఇంకా ఐబిపిఎస్ ల ప్రతినిధులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కు సంబంధించి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, అత్యుత్తమ పద్ధతుల కు ఎన్‌ఆర్‌ఎ ఒక స్పెషలిస్టు సంస్థ గా ఉంటుంది.
అందుబాటు లో పరీక్ష కేంద్రాలు:
దేశం లోని ప్రతి జిల్లా లో పరీక్ష కేంద్రాల ను ఏర్పాటు చేయడం వల్ల దూర ప్రాంతాల లో నివసించే అభ్యర్ధుల కు పరీక్ష కేంద్రాలు బాగా అందుబాటు లోకి వస్తాయి. దేశం లోని 117 ఆకాంక్ష భరిత జిల్లాల లో పరీక్షల ను నిర్వహించేందుకు తగిన మౌలిక సదుపాయాల ను కల్పించడం పై ప్రత్యేక దృష్టి పెట్టనుండడం వల్ల , అభ్యర్థులు వారు నివసించే ప్రాంతాని కి దగ్గర లో పరీక్ష రాయడానికి వీలు కలగనుండడం కీలక మలుపు. దీనివల్ల లభించే ప్రయోజనాల లో ఖర్చు, శ్రమ, భద్రత ల వంటివి ముఖ్యమైనవి. ఈ ప్రతిపాదన వల్ల పరీక్ష కేంద్రాలు గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కు అందుబాటు లో ఉండడమే కాక, దూర ప్రాంతాల లో ఉన్న అభ్యర్థులు కూడా కేంద్ర ప్రభుత్వ పరీక్షల లో పాలుపంచుకోవడానికి, తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల లో వారి ప్రాతినిధ్యాన్నిపెంచుకోవడానికి వీలు ఏర్పడుతుంది. ఉపాధి అవకాశాల ను ప్రజల వద్దకు తీసుకుపోవడం అనేది విప్లవాత్మకమైన చర్య. ఇది యువత సులభతర జీవనాని కి ఎంతగానో ఉపకరిస్తుంది.
పేద అభ్యర్థుల కు ఎంతో ఊరట:
ప్రస్తుతం బహుళ ఏజెన్సీ లు నిర్వహిస్తున్న పలు పరీక్షల కు అభ్యర్థులు హాజరు కావలసి వస్తోంది. పరీక్ష రుసుము తో పాటు, అభ్యర్థులు ప్రయాణం, భోజనం, లాడ్జింగ్ వంటి ఇతర ఖర్చుల ను కూడా భరించవలసి వస్తోంది. ఇకనుంచి ఒకే ఒకే ఒక పరీక్షవల్ల అభ్యర్థుల కు చాలా వరకు ఆర్ధిక భారం తగ్గుతుంది.
మహిళా అభ్యర్థుల కు ఎంతో ప్రయోజనం:
మహిళా అభ్యర్థులు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల కు చెందిన వారు, వేరువేరు పరీక్షల కు హాజరు కావాలంటే వారు రవాణా సదుపాయాల ను ఏర్పాటు చేసుకోవడం, ఎంతో దూరం లో ఉన్న ప్రాంతం లో ఉండడానికి ఏర్పాట్లు చేసుకోవడం అవసరమయ్యేది. దూరం గా ఉన్న పరీక్ష కేంద్రాల కు వెళ్లడానికి మహిళా అభ్యర్థులు ఒక్కోసారి తోడు తీసుకువెళ్లవలసి వచ్చేది. ప్రతి జిల్లా లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనుండడం, గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కు, ప్రత్యేకించి మహిళా అభ్యర్ధుల కు, ఎంతో ప్రయోజనకరం గా ఉంటుంది.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు వరం:
గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థుల ఆర్ధిక ఇతర పరిమితుల రీత్యా ఇంతకు ముందు, అభ్యర్థులు తాము ఏ పరీక్షరాయాలో ఎంచుకోవలసి ఉండేది. కానీ ప్రస్తుత ఎన్‌ఆర్‌ఎ లో భాగం గా అభ్యర్థులు ఒక పరీక్ష ను రాసి చాలా ఉద్యోగాల కు పోటీ పడవచ్చు. ఎన్‌ఆర్‌ఎ తొలి దశ/టైర్ -1 పరీక్ష ను నిర్వహిస్తుంది. ఇది ఎన్నో ఇతర ఎంపికల కు పునాది గా పనికివస్తుంది.
సిఇటి స్కోరు మూడేళ్ల వరకు పనికివస్తుంది, ఎన్ని సార్లు అయినా ప్రయత్నించవచ్చు:
అభ్యర్థుల సిఇటి స్కోరు , ఫలితాలు వెల్లడి అయినప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు అయిన స్కోరు లో ఉత్తమమైనదానిని అభ్యర్థి ప్రస్తుత స్కోరు గా పరిగణిస్తారు. అభ్యర్థి సిఇటి పరీక్ష ను ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. దీనిపై పరిమితులు లేవు. అయితే గరిష్ఠ వయోపరిమితి నిబంధనల కు లోబడి ఇది ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి ఇతర కేటగిరీ ల అభ్యర్థుల కు ప్రభుత్వ విధానం ప్రకారం గరిష్ఠ వయోపరిమితి లో రాయితీ ఉంటుంది. ఇది ఈ పరీక్షల ను రాయడానికి ప్రతి సంవత్సరం పెట్టే కృషి, సమయం, డబ్బు ల వంటి ఇబ్బందులన్నిటి ని తొలగించడం లో ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రమాణీకరించబడ్డ పరీక్షావిధానం:
గ్రాడ్యుయేట్, హయ్యర్ సెకండరీ (12 పాస్), మెట్రిక్యులేట్ (10 పాస్) స్థాయి అభ్యర్థుల కు, నాన్ టెక్నికల్ పోస్టుల కు ప్రస్తుతం స్టాఫ్ సెలక్శన్ కమిశన్ (ఎస్ఎస్‌సి), రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు లు (ఆర్‌ఆర్‌బి లు), ఇన్స్ టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ (ఐబిపిఎస్) నిర్వహించే నియామకాని కి మూడు స్థాయిల లో వేరు వేరు గా ఉమ్మడి అర్హత పరీక్ష ను నిర్వహిస్తారు. సిఇటి స్కోరు స్థాయి లో వడపోత విధానం ఆధారం గా ప్రత్యేక టైర్ -2, టైర్ -3 తదితర ప్రత్యేక స్థాయిల లో సంబంధిత రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ లు పరీక్షల ను నిర్వహిస్తాయి. ఈ పరీక్షకు పాఠ్యాంశాలు ప్రమాణాల ప్రకారం ఉమ్మడి గా ఉంటాయి. ఇది అభ్యర్ధుల పై భారాన్ని తగ్గిస్తుంది. ఇప్పటి వరకు ప్రతి పరీక్ష కు వేరు వేరుగా, విభిన్న పాఠ్యాంశాల తో పరీక్షల కు హాజరుకావలసి ఉండేది.
పరీక్షల షెడ్యూలు, కేంద్రాల ఎంపిక:
అభ్యర్థులు కామన్ పోర్టల్ లో వారి పేరుల ను నమోదు చేసుకొనే సదుపాయాన్ని, పరీక్ష కేంద్రాల ను ఎంపిక చేసుకొనే సదుపాయాన్ని కల్పిస్తారు. అందుబాటు ను బట్టి వారికి పరీక్ష కేంద్రాల ను కేటాయిస్తారు. అంతిమం గా, అభ్యర్థులు వారి పరీక్షలను వారు ఎంచుకొనే పరీక్షా కేంద్రం లో షెడ్యూలు చేసుకొనే సదుపాయం కల్పించే స్థాయి కి చేరేలా చూడడం దీని లక్ష్యం.
ఎన్‌ఆర్‌ఎ ద్వారా ఔట్ రీచ్ కార్యకలాపాలు:
బహుళ భాష లు
ఉమ్మడి అర్హత పరీక్ష (సిఇటి) ని చాలా భాషల లో నిర్వహిస్తారు. దేశం లోని వివిధ ప్రాంతాల వారు పరీక్షలు రాయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఎంపిక కావడానికి సమాన అవకాశాల ను కల్పిస్తుంది.
స్కోర్ లు- బహుళ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల కు అందుబాటు
ముందుగా ఈ స్కోర్‌ల ను మూడు ప్రధాన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ లు ఉపయోగించుకొంటాయి. అయితే, కొంత కాలానికి కేంద్ర ప్రభుత్వం లోని ఇతర నియామక సంస్థ లు కూడా దీనిని అవలంబిస్తాయని భావిస్తున్నారు. అలాగే, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల లోని ఇతర ఏజెన్సీ లు కూడా వారు ఎంపిక చేసుకొనేటట్లయితే వీటిని వినియోగించుకోవచ్చు. ఆ రకంగా ముందు ముందు సిఇటి స్కోరు ను కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ సంస్థ లు, ప్రైవేటు రంగాని కి సంబంధించిన రిక్రూటింగ్ ఏజెన్సీల కు అందుబాటు లో ఉంచడం జరుగుతుంది. ఇది నియామకాల కు కాలం వృథా కాకుండా ఆయా సంస్థల కు తోడ్పడుతుంది.
రిక్రూట్‌మెంట్ సైకిల్ కుదింపు
ఒకే ఒక అర్హత పరీక్ష వల్ల రిక్రూట్‌మెంట్ సైకిల్ వ్యవధి చెప్పుకోదగిన స్థాయి లో తగ్గుతుంది. కొన్ని విభాగాలు ద్వితీయ స్థాయి పరీక్ష ను తీసివేసే ఆలోచన ను సూచనప్రాయం గా తెలిపాయి. సిఇటి స్కోరు, ఫిజికల్ టెస్టు లు, మెడికల్ టెస్టు ల ఆధారంగానే నియామకాన్ని నిర్వహించే ఆలోచన లో ఉన్నాయి. ఇది రిక్రూట్‌మెంట్ సైకిల్ ను బాగా తగ్గించడానికి, తద్వారా పెద్ద ఎత్తున యువత కు ప్రయోజనం కలిగించడానికి ఉపకరిస్తుంది.
ఆర్థిక వ్యయం
నేశనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటు కు ప్రభుత్వం 1517. 57 కోట్ల రూపాయల ను మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల వ్యవధి లో వినియోగించనున్నారు. ఎన్‌ఆర్‌ఎ స్థాపన కు తోడు, 117 ఆకాంక్షభరిత జిల్లాల లో పరీక్ష సంబంధిత మౌలిక సదుపాయాల ఏర్పాటు కై వ్యయాల ను భరించడం జరుగుతుంది.