ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నవోదయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకం) కింద దేశంలోని 28 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను (ఎన్‌వి) ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. 28 పాఠశాలల జాబితాను దిగువన చూడవచ్చు.

కొత్తగా ఏర్పాటయ్యే 28 విద్యాలయాల స్థాపన కోసం  2024-25 నుంచి 2028-29 మధ్యగల 5 సంవత్సరాల వ్యవధిలో రూ. 2359.82 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. ఇందులో మూలధన వ్యయం కింద రూ. 1944.19 కోట్లు, నిర్వహణ వ్యయం కింద రూ. 415.63 కోట్లను ఖర్చు చేస్తారు.

560 మంది విద్యార్థులతో పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచే ఒక్కో నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం సమితి నిర్ణయించిన నిబంధనలకనుగుణంగా వివిధ పోస్టులుఅవసరమవుతాయి. అందువల్ల కొత్తగా 560 x 28 = 15,680 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, పూర్తి స్థాయి ఎన్‌విలు 47 మందికి ఉపాధిని అందిస్తాయి. దరిమిలా ఆమోదించిన 28 నవోదయ విద్యాలయాలు 1316 మందికి నేరుగా శాశ్వత ఉపాధిని కల్పిస్తాయి. పాఠశాల మౌలిక సదుపాయాల నిమిత్తం నిర్మాణ పనులు సహా అనుబంధ కార్యకలాపాల కోసం నైపుణ్యం కలిగిన, నైపుణ్యం అవసరం లేని అనేకమంది కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. నవోదయ విద్యాలయాల్లో అమలయ్యే  గురుకుల పద్ధతి వల్ల ఆహారం, వినియోగ వస్తువులు వంటి నిత్యావసర వస్తువులు,  బెంచీలు, కుర్చీల వంటి బోధనా సామగ్రి తదితరాలను అందించేందుకు స్థానిక వ్యాపారులకు అనేక అవకాశాలు దక్కుతాయి. క్షురకులు, దర్జీలు, చెప్పులు కుట్టేవారు, భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది వంటి వారికి కొత్త పాఠశాలల ఏర్పాటు ఉపాధి అవకాశాలను అందిస్తాయి.

ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ బాలబాలికలు ఉమ్మడిగా, పూర్తి రెసిడెన్షియల్ పద్ధతిలో చదువుకొనే వీలుని  నవోదయ విద్యాలయాలు కల్పిస్తాయి. కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన బాలబాలికలకు ఈ పాఠశాలలు నాణ్యమైన ఆధునిక విద్యను అందిస్తున్నాయి. ఎంపిక పరీక్ష ఆధారంగా ఈ పాఠశాలల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఏటా సుమారు 49,640 మంది విద్యార్థులు ఆరో తరగతిలో ప్రవేశం పొందుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 661  నవోదయ విద్యాలయాలు మంజూరవగా (షెడ్యూల్డు కులాలు, తెగల వారు అధికంగా నివసించే 20 జిల్లాల్లో రెండు ఎన్‌విలు, 3 ప్రత్యేక ఎన్‌విలు సహా) 653 పాఠశాలలు క్రియాశీలంగా ఉన్నాయి.

2020 నూతన విద్యా విధానం అమలవుతున్న పాఠశాలుగా, దాదాపు అన్ని నవోదయ విద్యాలయాలు ‘పీఎంశ్రీ’ పాఠశాలలుగా గుర్తింపు పొందాయి. ఉత్తమ విద్యా ప్రమాణాలతో ఇతర బడులకు తలమానికంగా నిలుస్తున్నాయి. ప్రజాదరణ చూరగొన్న ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఆదరణ పెరుగుతూ, ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి సంవత్సరాలలో నవోదయ విద్యాలయాల్లో బాలికలు (42%), షెడ్యూల్డు కులాల వారు (24%), షెడ్యూల్డు తెగల వారు (20%) ఓబీసీలు (39%) ప్రవేశం పొందుతుండడంతో అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తోంది.

సీబీఎస్సీ నిర్వహించే బోర్డు పరీక్షలలో నవోదయ విద్యాలయాల విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ, ఇతర బోర్డుల విద్యార్థులకు సరిసమానంగా నిలుస్తున్నారు. ఇంజనీరింగ్, వైద్యవిద్య, సాయుధ దళాలు, సివిల్స్ వంటి వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని చూపుతూ నగర విద్యార్థులతో సమానంగా రాణిస్తున్నారు.

S.No.

Name of the State

Name of the District in which NV is sanctioned

 

 

 

 

Arunachal Pradesh

Upper Subansiri

 

Kradadi

 

Lepa Rada

 

Lower Siang

 

Lohit

 

Pakke-Kessang

 

Shi-Yomi

 

Siang

 

 

 

Assam

Sonitpur

 

Charaideo

 

Hojai

 

Majuli

 

South Salmara Manacachar

 

West Karbianglong

 

 

 

Manipur

Thoubal

 

Kangpoki

 

Noney

 

Karnataka

Bellary

 

Maharashtra

Thane

 

 

 

 

 

 

 

Telangana

Jagityal

 

Nizamabad

 

Kothagudem Bhadradri

 

Medchal Malkajgiri

 

Mahabubnagar

 

Sangareddy

 

Suryapet

 

 

West Bengal

Purba Bardhaman

 

Jhargram

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi