-
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం దాదాపు ₹10,000 కోట్ల పెట్టుబడితో 3 ప్రధాన రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి కోసం భారతీయ రైల్వే చేసిన ప్రతిపాదనను ఆమోదించింది.
ఎ) న్యూఢిల్లీ రైల్వే స్టేషన్;
బి) అహ్మదాబాద్ రైల్వే స్టేషన్
c) ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సిఎస్ఎంటీ) ముంబై
ఏ నగరానికైనా రైల్వే స్టేషన్ ఒక ముఖ్యమైన మరియు ప్రధానమైన ప్రదేశం. అందుకే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టేషన్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందులో భాగంగా తీసుకున్న ఇవాళ్టి క్యాబినెట్ నిర్ణయం స్టేషన్ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుంది. ప్రస్తుతం 199 స్టేషన్ల పునరాభివృద్ధికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. వీటిలో 47 స్టేషన్లకు టెండర్లు వేశారు. మిగిలిన వాటి కోసం మాస్టర్ ప్లానింగ్ మరియు రూపకల్పన జరుగుతోంది. 32 స్టేషన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.10,000 కోట్ల పెట్టుబడితో న్యూ ఢిల్లీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సిఎస్ఎంటీ), ముంబై మరియు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
స్టేషన్ డిజైన్ యొక్క ప్రామాణిక అంశాలు:- ప్రతి స్టేషన్‌లో విశాలమైన రూఫ్ ప్లాజా (36/72/108 మీ)లో ప్రయాణీకులకు అవసరమైన సౌకర్యాలతో పాటు రిటైల్, ఫలహారశాలలు, వినోద కేంద్రాల ఏర్పాటు.
- నగరం రెండు వైపులా స్టేషన్‌తో అనుసంధానించబడి రైల్వే ట్రాక్‌లకు ఇరువైపులా స్టేషన్ భవనం ఉంటుంది.
- ఫుడ్ కోర్ట్, వెయిటింగ్ లాంజ్, పిల్లలు ఆడుకునే ప్రదేశం, స్థానిక ఉత్పత్తుల కోసం ప్లేస్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
- నగరంలో ఉన్న స్టేషన్లలో సిటీ సెంటర్ లాంటి ప్లేస్ ఉంటుంది.
- స్టేషన్‌లను మరింత సౌకర్యవంతంగా మార్చడానికి సరైన వెలుతురు, అవసరమైన సూచిక బోర్డులు, అనౌన్స్‌మెంట్‌లు,లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు/ట్రావెలేటర్‌లు ఉంటాయి.
- తగినన్ని పార్కింగ్ సౌకర్యాలతో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
- మెట్రో, బస్సు మొదలైన ఇతర రవాణా మార్గాలతో అనుసంధానించబడి ఉంటుంది.
- సౌరశక్తి, నీటి సంరక్షణ/రీసైక్లింగ్ మరియు మెరుగైన ట్రీ కవర్‌తో గ్రీన్ బిల్డింగ్ టెక్నిక్స్ ఉపయోగించబడతాయి.
- దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
- ఇంటెలిజెంట్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.
- రైళ్ల రాకపోకల విభజన, అయోమయం లేకుండా ఉండే అర్ధవంతమైన ఫ్లాట్‌ఫారమ్‌లు, మెరుగైన ఉపరితలాలు, పూర్తిగా కవర్ చేయబడిన ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి.
- సిసిటివి మరియు యాక్సెస్ నియంత్రణతో స్టేషన్లు సురక్షితంగా ఉంటాయి.
- ఇవి ఐకానిక్ స్టేషన్ భవనాలు.
India's infrastructure has to be futuristic. Today's Cabinet decision on redevelopment of New Delhi, Ahmedabad and Chhatrapati Shivaji Maharaj Terminus reflects this vision of the Government. These stations will be modernised and further 'Ease of Living,' https://t.co/hCKryKlob2
— Narendra Modi (@narendramodi) September 28, 2022