భారతదేశ ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించడం మరియు ఎగుమతులను మెరుగుపరచడం – "ఆత్మ నిర్భర్ భారత్" కోసం కింది 10 ముఖ్య రంగాలలో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పి.ఎల్.ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, అనుమతి ఇచ్చింది.
Priority |
Sectors |
Implementing Ministry/Department |
Approved financial outlay over a five-year period Rs.crore |
|
Advance Chemistry Cell (ACC) Battery |
NITI Aayog and Department of Heavy Industries |
18100 |
|
Electronic/Technology Products |
Ministry of Electronics and Information Technology |
5000 |
|
Automobiles |
Department of Heavy Industries |
57042 |
|
Pharmaceuticals drugs |
Department of Pharmaceuticals |
15000 |
|
Telecom & Networking Products |
Department of Telecom |
12195 |
|
Textile Products: MMF segment and technical textiles |
Ministry of Textiles |
10683 |
|
Food Products |
Ministry of Food Processing Industries |
10900 |
|
High Efficiency Solar PV Modules |
Ministry of New and Renewable Energy |
4500 |
|
White Goods (ACs & LED) |
Department for Promotion of Industry and Internal Trade |
6238 |
|
Speciality Steel |
Ministry of Steel |
6322 |
Total |
145980 |
సంబంధిత మంత్రిత్వ శాఖలు / విభాగాలు, తమకు సూచించిన మొత్తం ఆర్థిక పరిమితులకు లోబడి, ఈ పి.ఎల్.ఐ. పథకాన్ని, అమలు చేస్తాయి. ఆయా రంగాలకు చెందిన పి.ఎల్.ఐ. తుది ప్రతిపాదనలను వ్యయ ఆర్ధిక కమిటీ (ఈ.ఎఫ్.సి) అంచనా వేస్తుంది, కేంద్ర మంత్రి మండలి ఆమోదిస్తుంది. ఆమోదించబడిన రంగానికి చెందిన ఒక పి.ఎల్.ఐ. పథకం నుండి పొదుపు మొత్తాలు ఏమైనా ఉంటే, ఆ నిధులను, కార్యదర్శుల సాధికార బృందం, మరొక ఆమోదించబడిన రంగానికి ఈ నిధులు సమకూర్చవచ్చు. ఏదైనా కొత్త రంగానికి పి.ఎల్.ఐ. వర్తింపజేయాలంటే, కేంద్ర మంత్రి మండలి అనుమతి అవసరం.
ఈ 10 కీలక నిర్దిష్ట రంగాలలో పి.ఎల్.ఐ. పథకం అమలుచేయడం వల్ల – భారతీయ తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా పోటీకి నిలుస్తారు; ప్రధాన సామర్థ్యం ఉన్న రంగాలలో, అత్యాధునిక సాంకేతిక రంగాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయి; సామర్థ్యాలు నిర్ధారించబడతాయి; ఆర్థిక వ్యవస్థల స్థాయి పెరుగుతుంది; ఎగుమతులు పెరుగుతాయి; ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారతదేశం అంతర్భాగమవుతుంది.
* ఏ.సి.సి. బ్యాటరీ తయారీ – వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహనాలు మరియు పునరుత్పాదక శక్తి వంటి అనేక ప్రపంచ వృద్ధి రంగాలకు ఇరవై ఒకటవ శతాబ్దంలో అతిపెద్ద ఆర్థిక అవకాశాలలో ఒకటి. ఏ.సి.సి. బ్యాటరీ కోసం పి.ఎల్.ఐ. పథకం దేశంలో పోటీ ఏ.సి.సి బ్యాటరీ తయారీ సంస్థలను స్థాపించడంలో, భారీ దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ప్రోత్సహిస్తుంది.
* 2025 నాటికి భారతదేశంలో ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్ధికవ్యవస్థ ఉంటుందని అంచనా. అదనంగా, డేటా లోకలైజేషన్, భారతదేశంలో ఇంటర్నెట్ మార్కెట్, స్మార్ట్ సిటీ, డిజిటల్ ఇండియా వంటి ప్రాజెక్టులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుతాయని భావిస్తున్నారు. ఈ రంగంలో పి.ఎల్.ఐ. పథకం అమలుచేయడం వల్ల, భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఉత్పత్తి పెరుగుతుంది.
* భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ ప్రధాన ఆర్థిక సహాయకారిగా ఉంది. ఈ రంగంలో పి.ఎల్.ఐ. పథకం అమలు చేయడం వల్ల, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ మరింత పోటీగా అభివృద్ధి చెందుతుంది. భారత ఆటోమోటివ్ రంగం యొక్క ప్రపంచీకరణ మెరుగుపడుతుంది.
* భారతీయ ఔషధ పరిశ్రమ పరిమాణం ప్రకారం ప్రపంచంలో మూడవ అతి పెద్ద దేశంగా, విలువ పరంగా 14వ అతి పెద్ద దేశంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మందులలోనూ, ఎగుమతి చేసిన మొత్తం మందులలోనూ, ఇది 3.5 శాతంగా ఉంది. భారతదేశంలో ఔషధాల అభివృద్ధి మరియు తయారీకి పూర్తి పర్యావరణ వ్యవస్థతో పాటు అనుబంధ పరిశ్రమల యొక్క బలమైన పర్యావరణ వ్యవస్థ కూడా ఉంది. ఈ రంగంలో పి.ఎల్.ఐ. పథకం అమలుచేయడం వల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా పారిశ్రామికవేత్తలు అధిక ఉత్పత్తి సాధించడానికి ముందుకు వస్తారు.
* టెలికాం పరికరాలు, సురక్షితమైన టెలికాం మౌలిక సదుపాయాలను నిర్మించడంలో కీలకమైన, వ్యూహాత్మక అంశాన్ని ఏర్పరుస్తాయి. టెలికాం మరియు నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల యొక్క ప్రధాన పరికరాల తయారీదారుగా నిలవాలని భారతదేశం కోరుకుంటోంది. ఈ రంగంలో పి.ఎల్.ఐ. పథకం అమలుచేయడంవల్ల, అంతర్జాతీయ సంస్థల నుండి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడానికీ, అభివృద్ధి చెందుతున్న అవకాశాలను స్వాధీనం చేసుకోవడానికీ, ఎగుమతి మార్కెట్లో పెద్ద భాగస్వామిగా నిల్వదానికీ, ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు.
* భారతీయ వస్త్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ. వస్త్రాలు, దుస్తుల ప్రపంచ ఎగుమతుల్లో దాదాపు 5 శాతం వాటాను కలిగి ఉంది. కానీ ప్రపంచ వినియోగ విధానానికి భిన్నంగా మ్యాన్ మేడ్ ఫైబర్ (ఎం.ఎం.ఎఫ్) విభాగంలో భారతదేశం వాటా చాలా తక్కువగా ఉంది. దేశీయ తయారీని మరింత పెంచడానికి పి.ఎల్.ఐ. పథకం ఈ రంగంలో, ముఖ్యంగా ఎం.ఎం.ఎఫ్. విభాగం మరియు సాంకేతిక వస్త్రాలలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది.
* ప్రాసెస్ చేసిన ఆహార పరిశ్రమ వృద్ధి రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభించడానికి దారితీస్తుంది, అధిక స్థాయిలో వ్యర్థాలను తగ్గిస్తుంది. ఈ రంగంలో పి.ఎల్.ఐ. పథకం అమలు చేయడం ద్వారా సహాయాన్ని అందించడం వల్ల, అధిక వృద్ధి సామర్థ్యంతో పాటు మధ్యస్థం నుండి పెద్ద ఎత్తున ఉపాధిని అందించగల సామర్థ్యాలు కలిగిన నిర్దిష్ట ఉత్పత్తి మార్గాలు గుర్తించబడతాయి.
* పెద్ద ఎత్తున సౌర విద్యుత్తు పి.వి. ప్యానెళ్ల దిగుమతులు సరఫరా వ్యవస్థ స్థితిస్థాపకతలో ప్రమాదాలను కలిగిస్తాయి. అదేవిధంగా, ఈ ఉత్పత్తులు, విలువ వ్యవస్థ యొక్క ఎలక్ట్రానిక్ (హ్యాక్ చేయదగిన) స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యూహాత్మక భద్రతా సవాళ్లను కలిగి ఉంటాయి. సౌర పి.వి.మాడ్యూళ్ళ కోసం కేంద్రీకృత పి.ఎల్.ఐ. పథకం అమలుచేసినట్లైతే, భారతదేశంలో పెద్ద ఎత్తున సౌర పి.వి. సామర్థ్యాన్ని పెంపొందించడానికి దేశీయ, విదేశీ ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తుంది. సౌర పివి తయారీ కోసం ప్రపంచ విలువ వ్యవస్థలను సంగ్రహించే భారతదేశానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
* ఎయిర్ కండీషనర్లు, ఎల్.ఈ.డి. ల వంటి "వైట్ గూడ్సు" దేశీయ విలువలను పెంచే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే విధంగా చేస్తాయి. ఈ రంగంలో పి.ఎల్.ఐ. పథకం అమలుచేస్తే, మరింతగా దేశీయ తయారీ పెరగడానికీ, ఉపాధి కల్పనతో పాటు, ఎగుమతులను పెంచడానికీ దోహదపడుతుంది.
* ఉక్కు పరిశ్రమ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. భారతదేశం ఉక్కు ఎగుమతిదారుగా ఉంది. కొన్ని రకాల ఉక్కు తయారీలో ఛాంపియన్‌గా నిలిచే సామర్ధ్యం భారతదేశానికి ఉంది. ప్రత్యేక రకమైన ఉక్కు తయారీ రంగంలో పి.ఎల్.ఐ. పథకం అమలుచేస్తే, మొత్తం ఎగుమతుల పెరుగుదలకు దారితీసే విలువ ఆధారిత ఉక్కు కోసం ఉత్పాదక సామర్థ్యాలను పెంచడంలో సహాయపడుతుంది.
పైన పేర్కొన్నవి ఈ క్రింది రంగాలలో ఇప్పటికే తెలియజేయబడిన పి.ఎల్.ఐ. పథకాలకు అదనంగా ఉంటాయి:
No. |
Sectors |
Implementing Ministry/Department |
Financial outlays Rs. crore |
|
Mobile Manufacturing and Specified Electronic Components |
MEITY |
40951 |
|
Critical Key Starting materials/Drug Intermediaries and Active Pharmaceutical Ingredients |
Department of Pharmaceuticals |
6940 |
|
Manufacturing of Medical Devices. |
3420 |
|
Total |
51311 |
'ఆత్మ నిర్భర్ భారత్' కోసం ప్రధానమంత్రి ఇచ్చిన స్పష్టమైన పిలుపు దేశంలో సమర్థవంతమైన, సమానమైన మరియు స్థితిస్థాపక ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన విధానాలను ఊహించింది. పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి మరియు ఎగుమతుల పెరుగుదల భారత పరిశ్రమను విదేశీ పోటీ మరియు ఆలోచనలకు అనుగుణంగా బాగా బహిర్గతం చేస్తుంది, ఇది మరిన్ని ఆవిష్కరణలకు అవసరమైన సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడం మరియు అనుకూలమైన ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ప్రపంచ సరఫరా వ్యవస్థతో అనుసంధానం చేయడమే కాకుండా దేశంలోని ఎం.ఎస్.ఎం.ఈ. రంగంతో సంబంధాలను ఏర్పరుస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దారితీయడంతో పాటు, భారీ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
రంగాల వారీగా ఉత్పత్తుల వివరాలు
Sector |
|
Product Lines |
Advance Chemistry Cell (ACC) Battery Manufacturing |
|
ACC Batteries |
Electronic/Technology Products |
|
|
Automobile and Auto Components |
|
Automobile and Auto Components |
Pharmaceuticals |
Category 1
|
|
|
Category 2
Category 3
|
|
Telecom Products |
|
|
Textiles |
|
|
Food Processing |
|
|
Solar PV manufacturing |
Solar PVs |
|
White Goods |
|
|
Steel Products |
|