ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకానికి ఆమోదం తెలిపింది. నిపుణుల పరిశోధన వ్యాసాలు, పత్రికల్లో ప్రచురణలను ఈ కేంద్ర ప్రభుత్వ పథకం (సెంట్రల్ సెక్టార్ స్కీమ్) దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తుంది. సరళమైన, వినియోగదారీ అనుకూల, పూర్తి సాంకేతిక ప్రక్రియ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధన-అభివృద్ధి సంస్థలకు ‘వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్’ సదుపాయం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకమైన వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ కోసం 2025, 2026, 2027 సంవత్సరాలకు మొత్తం రూ.6,000 కోట్లు కేటాయించారు. దశాబ్ద కాలంగా విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల పరిధిని పెంచి, మరింత మెరుగుపరచడంతోపాటు.. దేశ యువతకు ఉన్నత విద్యను ఈ పథకం గరిష్టంగా అందుబాటులోకి తెస్తుంది. ఇది ఏఎన్ఆర్ఎఫ్ కార్యక్రమానికి అనుబంధంగా ఉంటూ పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు, పరిశోధన-అభివృద్ధి ప్రయోగశాలల్లో పరిశోధన-అభివృద్ధి సంస్కృతిని పెంపొందిస్తుంది.
వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకం ప్రయోజనాలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ పరిశోధన-అభివృద్ధి సంస్థలకు అందుతాయి. సమాచార-గ్రంథాలయ వ్యవస్థ (ఐఎన్ఎఫ్ఎల్ఐబీఎన్ఈటీ) అనే కేంద్ర సంస్థ సమన్వయం చేసే జాతీయ స్థాయి సబ్ స్క్రిప్షన్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి కలిగిన అంతర్విశ్వవిద్యాలయ కేంద్రం. 6,300కు పైగా సంస్థలు, దాదాపు 1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ పరిధిలో ఉన్నారు. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ ప్రయోజనాలను వారు పొందుతారు.
ఇది వికసిత భారత్@2047, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020, అనుసంధాన్ జాతీయ పరిశోధన సంస్థ (ఏఎన్ఆర్ఎఫ్) లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు సహా దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో పెద్దసంఖ్యలో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు పరిశోధన ప్రచురణలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తెస్తుంది. తద్వారా దేశంలో ప్రధానమైన, బహుశాస్త్రాంతర పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ వినియోగం, ఆయా సంస్థల్లో భారతీయ రచయితల ప్రచురణలను ఏఎన్ఆర్ఎఫ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.
‘వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్’ ఏకీకృత పోర్టల్ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. దాని ద్వారా ఆ సంస్థలకు ప్రచురణలు అందుబాటులో ఉంటాయి. తద్వారా దేశంలో ప్రధానమైన, బహుశాస్త్రాంతర పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ వినియోగం, ఆయా సంస్థల్లో భారతీయ రచయితల ప్రచురణలను ఏఎన్ఆర్ఎఫ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ లభ్యత, వినియోగంపై- ఉన్నత విద్యా శాఖ, ఇతర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థలు, వాటి నిర్వహణలో ఉన్న పరిశోధన-అభివృద్ధి సంస్థలు తమ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం సమాచారం, విద్య, సమాచార ప్రసరణ/కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించాలి. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మెరుగవుతుంది. అన్ని ప్రభుత్వ సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ విశిష్ట సదుపాయాన్ని గరిష్టంగా ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో ప్రచారం చేయాలని కోరుతున్నారు.
Game-changer for Indian academia and for youth empowerment!
— Narendra Modi (@narendramodi) November 26, 2024
The Cabinet has approved ‘One Nation One Subscription’, which will strengthen our efforts to become a hub for research, learning and knowledge. It will also encourage interdisciplinary studies.…