ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈశాన్య ప్రాంత పారిశ్రామికాభివృద్ధి పథకం-2017 కి (నీడ్స్) ఆమోదముద్ర వేసింది. 2020 మార్చి నాటికి దీనిపై మూడు వేలకోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడతారు. గతంలో అమలు జరుగుతున్న రెండు స్కీమ్ ల కింద ఉన్న ప్రోత్సాహకాలను మరింత మెరుగైన పెట్టుబడితో అమలుపరిచే పథకం ఇది.
వివరాలు…
ఈశాన్య రాష్ర్టాల్లో ఉపాధికల్పనను ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ ద్వారా ఎంఎస్ఎంఇ రంగానికి ప్రభుత్వం ప్రధానంగా ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఉపాధికల్పన కింద ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది.
భారత ప్రభుత్వ నిర్వహణలోని ఇతర స్కీమ్ ల అనుబంధ విభాగాల ద్వారా అందుతున్ ఒకటి లేదా అంతకు ఎక్కువ ప్రయోజనాలన్నింటినీ అర్హత గల సంస్థలు ఈ స్కీమ్ లోని అనుబంధ విభాగాల ద్వారా పొందగలుగుతాయి.
సిక్కిం సహా ఈశాన్య రాష్ర్టాలన్నింటిలోని కొత్త పారిశ్రామిక యూనిట్లకు ఈ స్కీమ్ కింద ఈ దిగువ ప్రోత్సాహకాలు అందుతాయి.
రుణసదుపాయంఅందుబాటులో ఉండడంకోసం కేంద్ర మూలధనపెట్టుబడి ప్రోత్సాహకం(సిసిఐఐఎసి) |
ఐదు కోట్ల రూపాయల గరిష్ఠ పరిమితికి లోబడి ప్లాంట్, యంత్రపరికరాలపై పెట్టే పెట్టుబడిలో 30 శాతంరాయితీ |
కేంద్ర వడ్డీ ప్రోత్సాహం(సిఐఐ) |
యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన రోజునుంచి ఐదు సంవత్సరాల పాటు అర్హత గతబ్యాంకులు లేదా ఆర్థిక సహాయ సంస్థలు అందించినవర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్‌పై 3 శాతం వడ్డీరాయితీ. |
కేంద్ర సమగ్ర బీమాప్రోత్సాహకం (సిసిఐఐ) |
యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినరోజు నుంచి ఐదేళ్ల పాటు అమలులోఉండేలాభవనాలు, యంత్రపరికరాలు, ప్లాంట్ పై చెల్లించినబీమా ప్రీమియం నూరు శాతం వాపసు |
వస్తుసేవల పన్ను (జిఎస్ టి) వాపసు |
యూనిట్ వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించిన తేదీనుంచి ఐదు సంవత్సరాల పాటు కంపెనీ చెల్లించినసిజిఎస్ టి, ఐజిఎస్ టిలో కేంద్ర ప్రభుత్వ వాటావాపసు. |
ఆదాయపు పన్ను (ఐటి) వాపసు |
ప్లాంట్ వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించినసంవత్సరం నుంచి అమలులోకి వచ్చేలా ఐదుసంవత్సరాల పాటు ఆదాయపు పన్నులో కేంద్రప్రభుత్వ వాటా వాపసు. |
రవాణా ప్రోత్సాహకం (టిఐ) |
– రైళ్ల ద్వారా వస్తు రవాణాపై రైల్వే/ రైల్వే పిఎస్యుఅందించే సబ్సిడీ సహా 20 శాతం రవాణా వ్యయాల – ఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియారవాణా చేసే వస్తువులపై 20 శాతం రవాణా వ్యయం – చెడిపోయే స్వభావం గల వస్తువులనువాయుమార్గంలో రవాణా చేసేందుకు (ఐఏటిఏనిర్వచించిన మేరకు) విమానాశ్రయం సమీపంలోఉన్న ప్రదేశం నుంచి దేశంలోని ఏ గమ్యంలోనివిమానాశ్రయానికైనా రవాణా వ్యయంలో 33 శాతం |
ఉపాధి ప్రోత్సాహకం (ఇఐ) |
ప్రధానమంత్రి రోజ్ గార్ ప్రోత్సాహయోజన (పిఎంఆర్పివై) కింద ఉద్యోగుల పింఛను స్కీమ్ కి (ఇపిఎస్) ప్రభుత్వ వాటా 8.33 శాతానికి అదనంగా ఉద్యోగులభవిష్య నిధికి (ఇపిఎఫ్) యజమాని చెల్లిస్తున్న వాటాలోకూడా 3.67 శాతం ప్రభుత్వమే భరిస్తుంది. |