పి.ఎం. -ఎఎఎస్‌హెచ్ ఎ పథకం రైతులకు కనీస మద్దతు ధరకు హామీనిచ్చే పథకం.ఇది అన్నదాత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.
రైతు అనుకూలం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరింత ఊతం ఇస్తూఅన్నదాత పట్ల తమకు గల చిత్తశుద్ధి, నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కొత్తగా ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంకర్షన్ అభియాన్ (పిఎం-ఎఎఎస్‌హెచ్ఎ)ను ఆమోదించింది. ఈ పథకం రైతులకు వారి ఉత్పత్తులకు 2018 బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా గిట్టుబాటు ధరలు లభించేలా హామీ ఇచ్చేందుకు ఉద్దేశించినది
రైతుల రాబడికి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మున్నెన్నడూ లేని రీతిలో తీసుకున్న చర్య ఇది.రైతు సంక్షేమం విషయంలో ఇది ఎంతో కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను రైతుల ఉత్పత్తి ఖర్చుకు 1.5 రెట్లు పెంచింది. కనీస మద్దతు ధర పెంపు అంతిమంగా రైతుల రాబడి పెరగడానికి దోహదపడుతుంది. ఎందుకంటే, రాష్ట్రాల సహకారంతో రైతుల నుంచి పెద్ద ఎత్తున దిగుబడిని సేకరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నది.
పిఎం- ఎ ఎ ఎస్ హెచ్ ఎ లోని ముఖ్యాంశాలు
ఈ కోత్త రైతు రక్షణ పథకం కింద రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇవ్వడంతోపాటు ధర మద్దతు పథకం (ప్రైస్ సపోర్ట్ స్కీమ్-పిఎస్ ఎస్) , ప్రైస్ డెఫిసియన్సీ పేమెంట్ పథకం (పిడిపిఎస్), పైలట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్‌మెంట్, స్టాకిస్ట్ స్కీమ్ (పిపిపిఎస్)కూడా ఉన్నాయి..
రైతుల పంటకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ధాన్యం ,గోధుమలు, పౌషకాహార పప్పు, తృణధాన్యల సేకరణకు సంబంధించి ఆహార, ప్రజా పంపిణీ (డిఎఫ్‌పిడి) విభాగం కింద ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు అలాగే, పత్తి, జనపనారకు సంబంధించి టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న పథకాలు అలాగే కొనసాగుతాయి.
ప్రొక్యూర్‌మెంట్ కార్యకలాపాలలో ప్రైవేటు రంగం కార్యకలాపాలు నిర్వహించే విషయాన్ని పరీక్షించి చూడాలని, వాటి అనుభవాల నుంచి ప్రొక్యూర్‌మెంట్ కార్యకలాపాలలో ప్రైవేటు రంగం పాత్రను విస్తరింపచేయవచ్చని కేబినెట్ నిర్ణయించింది. అందువల్ల పిడిపిఎస్‌కు తోడుగా చమురు గింజలకు సంబంధించి , పైలట్ పథకం కింద ఎంపిక చేసిన జిల్లాలు , ప్రైవేటు స్టాకిస్టుల తోడ్పాటుతో జిల్లా ఎపిఎం సిలలో ప్రైపేట్ ప్రొక్యూర్‌మెంట్ స్టాకిస్ట్ స్కీం(పిపిఎస్ఎస్)ను అమలుచేసే అవకాశం రాష్ట్రాలకు ఇవ్వబడింది.
కనీస మద్దతు ధర ప్రకటించిన చమురుగింజలకు సంబంధించి ఒకటి లేదా అంతకంటె ఎక్కువ పంటలకు పైలట్ జిల్లా, ఎంపికచేసిన జిల్లాలలో వర్తింపచేస్తారు. ఇది పిఎస్ ఎస్ వంటిది కావడంతో నోటిఫై చేసిన సరకును భౌతికంగా సేకరించవలసి ఉంటుంది. ఇదిపైలట్ జిల్లాలలో పిఎస్ఎస్, పిడిపిస్ లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
ఎంపిక ఏసిన ప్రైవేటు ఏజెన్సీ పిపిఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్టర్డ్ రైతులనుంచి నోటిఫై చేసిన కాలంలో నోటిఫై చేసిన మార్కెట్‌లలో సరకును కనీస మద్దతు ధరకు ఎంపిక చేసిన ప్రైవేటు ఏజెన్సీ సేకరించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్‌లో ధరలు నోటిఫై చేసిన కనీసమద్దతు ధరకంటే తగ్గిన పక్షంలో రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం అనుమతితో మార్కెట్‌లో ప్రవేశించడానికి అధికారంపొందిన సందర్భాలలో నోటిఫై చేసిన కనీస మద్దతు ధరలో 15 శాతం వరకు సర్వీసు ఛార్జీలు చెల్లించవచ్చు.
వ్యయం :
కేంద్ర కేబినెట్ అదనంగా రూ 6,550 కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనితో మొత్తం గ్యారంటీ 45,550కోట్ల కు చేరింది.
దీనికితోడు, ప్రొక్యూర్‌మెంట్ కార్యకలాపాలకు సంబంధించి బడ్జెట్‌ను పెంచారు. పిఎం-ఎఎఎస్‌హెచ్ఎ అమలుకు 15,053 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ పథకం మన అన్నదాతల పట్ల ప్రభుత్వానికిగల చిత్తశుద్ధికి , అంకితభావానికి నిదర్శనం.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రొక్యూర్‌మెంట్ తీరు
2010-2014 మధ్య మొత్తం ప్రొక్యూర్‌మెంట్ రూ 3500 కోట్లరూపాయలు మాత్రమే,2014-2018 మధ్యకాలంలో ఇది పది రెట్లు పెరిగి రూ 34,000 కోట్లకుచేరుకుంది. 2010-14 మధ్య ఈ వ్యవసాయ ఉత్పత్తుల ప్రొక్యూర్‌మెంట్కు కేవలం 300 కోట్ల రూపాయల ఖర్చుతో సమకూర్చిన ప్రభుత్వ గ్యారంటీ 2500 కోట్ల రూపాయలు . అదే 2014-2018 మధ్య వెయ్యికోట్ల వ్యయంతో గ్యారంటీ మొత్తాన్ని 29,000 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది.
వివరాలు…
భారత ప్రభుత్వం ఏ అంశాన్ని అయినా వేటికవి విడివిడిగా కాకుండా ఒక సమగ్ర సానుకూల దృక్పథంతో పరిష్కారానికి పనిచేస్తున్నది. కనీస మద్దతు ధర పెంపు మాత్రమే సరిపోదు, అన్నికంటే ముఖ్యమైనది ప్రభుత్వం ప్రకటించిన కనీసమద్దతు ధరకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రయోజనాలు రైతుకు అందుబాటులోకి రావాలి. ఏదైనా సందర్భంలో వ్యవసాయ ఉత్పత్తి ధర కనీస మద్దతుధర కంటే తక్కువగా ఉన్నట్టయితే అలాంటి సందర్భాలలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనడం కానీ లేదా ఏదైనా పద్ధతి ద్వారా రైతులకు కనీస మద్దతు ధర అందేట్టు ఏర్పాటుచేయడం కానీ జరగాలని ఇది తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈవైఖరికి అనుగుణంగానే కేంద్ర కేబినెట్ పిఎం-ఎ.ఎ.ఎస్.హెచ్.ఎ పథకాన్ని మూడు ఉప పథకాలైన ధరల మద్దతు పథకం (పిఎస్ఎస్), ప్రై్ డెఫిసియన్సీ పేమెంట్ పథకం (పిడిపిఎస్), పైలట్ ఆఫ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ (పిడిపిఎస్)లను ఆమోదించింది.
ధరల మద్దతు పథకం (పిఎస్ఎస్) లో కాయధాన్యాలు, చమురుగింజలు,కొబ్బరి వంటి వాటిని వాస్తవంగా సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ద్వారా ప్రొక్యూర్ చేస్తారు. రాష్ట్రప్రభుత్వాల చురుకైన సహకారంతో వీటిని చేపడతారు. నాఫెడ్‌తోపాటు రాష్ట్రాలు, జిల్లాలలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) పి.ఎస్.ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రొక్యూర్‌మెంట్ వ్యయం, ప్రొక్యూర్‌మెంట్‌కారణంగా ఏవైనా నష్టాలు వస్తేవాటిని కేంద్రప్రభుత్వం నిబంధనల ప్రకారం భరిస్తుంది.
ప్రైస్ డెఫిసియన్సీ పేమెంట్ పథకం కింద (పిడిపిఎస్), కనీస మద్దతు ధర ను నోటిఫై చేసిన అన్ని చమురు గింజలకు వర్తింప చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా నోటిఫైచేసిన మార్కెట్‌లో తన ఉత్పత్తులనును అమ్మే ముందస్తు నమోదిత రైతులకు కనీస మద్దతు దరకు, అమ్మకపు, నమూనా ధరకు మధ్యగల తేడా ధరను ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా వారికి చెల్లిస్తారు. అన్ని చెల్లింపులను నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఈ పథకం కింద నోటిఫై చేసిన మార్కెట్‌లో సరకును అమ్మే రైతులకు కనీసమద్దతు ధరకు , అమ్మకపు, నమూనా ధరకు మధ్యగల తేడాను రైతులకు చెల్లిస్తున్నందున ,రైతులనుంచి పంట ప్రొక్యూర్‌మెంట్‌ను భౌతికంగా చేయాల్సిన అవసరం ఉండదు. పిడిపిఎస్‌కు మద్దతును కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్పించడం జరిగింది.
ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల చర్యలు :
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న దార్శనికతను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉత్పాదకతను పెంచడం, సాగు వ్యయాన్ని తగ్గించడం, పంట కోత అనంతరం యాజమాన్య వ్యవహారాలను , మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి వాటిపై ప్రభుత్వం గట్టిగా దృష్టిపెట్టడం జరిగింది. ఇందుకు పలు మార్కెట్ సంస్కరణలు చేపట్టారు. మోడల్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, లైవ్‌స్టాక్ మార్కెటింగ్ యాక్ట్ 2017 తోపాటు మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్, సర్వీసెస్ యాక్ట్ 2018 వంటివి ఇందులో భాగమే. పలు రాష్ట్రాలు వీటి అమలుకు,చట్టాలు తీసుకువచ్చాయి.
రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందే విధంగా నూతన మార్కెట్ వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామీణ వ్యవసాయ మార్కెట్‌ల(జి.ఆర్.ఎ.ఎం.ఎస్) ఏర్పాటు ఇందులో ఒకటి. రైతులకు దగ్గరలో 22,000 రిటైల్ మార్కెట్‌లను ప్రమోట్ చేసేందుకు ఈ గ్రామీణ్ అగ్రికల్చరల్‌మార్కెట్‌లను ఏర్పాటుచేయడం దీనిలో భాగం. ఈ -నామ్ ద్వారా ఎపిఎంసి వద్ద పారదర్శకంగా పోటీ పద్ధతిలో టోకు వర్తకానికి వీలు కల్పించడం, అత్యంత రైతు అనుకూల ఎగుమతుల విధానాన్ని అనుసరించడం వంటివి ఇందులో ఉన్నాయి.
వీటితోపాటు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన, భూ సార పరీక్షా కార్డుల జారీ వంటి ఎన్నో రైతు అనుకూల చర్యలు చేపట్టడం జరిగింది. మున్నెన్నడూ లేని రీతిలో కనీస మద్దతు ధరను సాగు వ్యయానికి ఒకటిన్నర రెట్ల ఫార్ములా ప్రాతిపదికగా నిర్ణయించడంలో రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి గల చిత్తశుద్ధి వెల్లడి అవుతోంది.