Quoteపీఏసీ నుంచి అపెక్స్ ప్రాథమిక సంఘాలు:జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘంలో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి సమాఖ్యలు మరియు బహుళ రాష్ట్ర సహకార సంఘాలతో సహా ప్రాథమిక నుంచి జాతీయ స్థాయి సహకార సంఘాలు సభ్యత్వం పొందవచ్చు .ఉప చట్టం ప్రకారం సహకార సంఘాలకు ఎన్నికైన ప్రతినిధులు జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘం బోర్డు లో సభ్యులుగా ఉంటారు.
Quoteనాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, లేబులింగ్ ప్యాకేజింగ్, నిల్వ, మార్కెటింగ్ మరియు పంపిణీ కోసం అపెక్స్ సంస్థగా జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘం వ్యవహరిస్తుంది. వ్యూహాత్మక పరిశోధన అభివృద్ధి, దేశీయ సహజ విత్తనాల సంరక్షణ మరియు ప్రచారం కోసం ఒక వ్యవస్థను జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘం అభివృద్ధి చేస్తుంది
Quoteసీడ్ రీప్లేస్‌మెంట్ రేట్ (SRR) మరియు వేరిటీ రీప్లేస్‌మెంట్ రేట్ (VRR)ని ప్రోత్సహిస్తుంది మరియు దిగుబడి అంతరాలను తగ్గించడంలో మరియు ఉత్పాదకతను పెంచడంలో జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘం సహాయపడుతుంది.
Quoteసహకార సంఘాల సమ్మిళిత వృద్ధి నమూనా ద్వారా “సహకార్-సే-సమృద్ధి” లక్ష్య సాధన ద

మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 ప్రకారం జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర విత్తన సహకార సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రకారం ఏర్పాటయ్యే జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర విత్తన సహకార సంఘం నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, లేబులింగ్, ప్యాకేజింగ్, నిల్వ, మార్కెటింగ్ మరియు పంపిణీ కోసం ఒక ఉన్నత సంస్థగా వ్యవహరిస్తుంది. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి, దేశీయ సహజ విత్తనాల సంరక్షణ మరియు ప్రచారం కోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు ముఖ్యంగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మరియు నేషనల్ సీడ్ కార్పొరేషన్ (NSC) సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాల ద్వారా వారి పథకాలు మరియు ఏజెన్సీల ద్వారా 'సంపూర్ణ ప్రభుత్వ విధానం' కింద కార్యక్రమాలు అమలు చేస్తుంది .

   "సహకార్-సే-సమృద్ధి' దృక్పథాన్ని సాకారం చేసుకోవడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర కీలక పాత్ర పోషిస్తున్న సహకార సంఘాలను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సూచించారు. సహకార సంఘాల బలాన్ని ఉపయోగించుకుని వాటిని విజయవంతమైన మరియు శక్తివంతమైన వ్యాపార సంస్థలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని గుర్తించిన ప్రధానమంత్రి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో సమూల మార్పులు తీసుకుని రావడానికి చర్యలు అమలు జరగాలని సూచించారు. 

పీఏసీ ల నుంచి అపెక్స్ సంస్థల వరకు:

జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి సమాఖ్యలు మరియు బహుళ రాష్ట్ర సహకార సంఘాలతో సహా ప్రాథమిక నుంచి జాతీయ స్థాయి సహకార సంఘాలు సభ్యత్వం పొందవచ్చు .ఉప చట్టం ప్రకారం సహకార సంఘాలకు ఎన్నికైన ప్రతినిధులు జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘం బోర్డు లో సభ్యులుగా ఉంటారు.

బహుళ-రాష్ట్ర విత్తన సహకార సంఘం నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, లేబులింగ్, ప్యాకేజింగ్, నిల్వ, మార్కెటింగ్ మరియు పంపిణీ కోసం ఒక ఉన్నత సంస్థగా వ్యవహరిస్తుంది. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి, దేశీయ సహజ విత్తనాల సంరక్షణ మరియు ప్రచారం కోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు ముఖ్యంగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మరియు నేషనల్ సీడ్ కార్పొరేషన్ (NSC) పథకాలు మరియు ఏజెన్సీల సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాల ద్వారా కార్యక్రమాలు అమలు చేస్తుంది. 

ప్రతిపాదిత జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘం అన్ని స్థాయిల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వ్యవస్థను ఉపయోగించుకుని నాణ్యమైన విత్తన సాగు మరియు విత్తన రకాల వినియోగంలో రైతులకు సహకారం అందిస్తుంది. ఒకే బ్రాండ్ పేరుతో ధృవీకరించబడిన విత్తనాల ఉత్పత్తి మరియు పంపిణీలో విత్తన మార్పిడి రేటు, వివిధ రకాల భర్తీ రేటును పెంచడానికి సహాయపడుతుంది. సహకార సంఘాలు. నాణ్యమైన విత్తనాలు లభ్యత వల్ల వ్యవసాయ దిగుబడి పెరుగుతుంది. దీనివల్ల ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడానికి అవకాశం కలుగుతుంది. నాణ్యమైన విత్తనాలను ఉపయోగించడం వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయ్యే పంటలకు రైతులు మెరుగైన ధర పొందేలా చూడడానికి వీలవుతుంది. సంఘం ద్వారా ఉత్పత్తి చేయబడిన మిగులు నుంచి పంపిణీ చేయబడిన డివిడెండ్ ద్వారా సభ్యులు ప్రయోజనం పొందుతారు.

నాణ్యమైన విత్తన సాగు మరియు విత్తన రకాల వినియోగం, ఒకే బ్రాండ్ పేరుతో ధృవీకరించబడిన విత్తనాల ఉత్పత్తి మరియు పంపిణీలో రైతులను భాగస్వామ్యులను చేయడం ద్వారా సంఘం నిర్ధారించడం ద్వారా ఎస్ఆర్ఆర్,విఆర్ఆర్ పెంచడానికి విత్తన సహకార సంఘం అన్ని రకాల సహకార సౌకర్యాలు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తుంది. 

   నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి జాతీయ స్థాయి విత్తన సహకార సంఘం అమలు చేసే చర్యల వల్ల పంట దిగుబడి ఎక్కువ అవుతుంది. దీనివల్ల వ్యవసాయ, సహకార రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దిగుమతి చేసుకున్న విత్తనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందించడం, "మేక్ ఇన్ ఇండియా"ను ప్రోత్సహించడం, ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణానికి జాతీయ స్థాయి విత్తన సహకార సంఘం అమలు చేసే చర్యలు సహకరిస్తాయి. 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
For PM Modi, women’s empowerment has always been much more than a slogan

Media Coverage

For PM Modi, women’s empowerment has always been much more than a slogan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 మార్చి 2025
March 08, 2025

Citizens Appreciate PM Efforts to Empower Women Through Opportunities