ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, సంబంధిత మంత్రిత్వ శాఖలు, ముఖ్యంగా వాణిజ్య -పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ - రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ,ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం / డోనర్) మద్దతుతో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఎమ్ ఎస్ సి ఎస్) చట్టం, 2002 కింద సేంద్రీయ ఉత్పత్తుల కోసం జాతీయ స్థాయి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖలు వాటి విధానాలు, పథకాలు,ఏజెన్సీల ద్వారా 'మొత్తం ప్రభుత్వ విధానాన్ని' అనుసరిస్తాయి.
సహకార్ - సే-సమృద్ధి దార్శనికతను సాకారం చేయడానికి సహకార సంఘాల బలాలను సద్వినియోగం చేసుకోవడానికి, వాటిని విజయవంతమైన ,శక్తివంతమైన వ్యాపార సంస్థలుగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు జరగాలని ప్రధాన మంత్రి.
అన్నారు. అందువల్ల సహకార సంఘాలు అంతర్జాతీయ దృక్పథం తో ఆలోచించడం, తులనాత్మక ప్రయోజనాన్ని పొందడానికి స్థానికంగా వ్యవహరించడం అత్యవసరం.
అందువల్ల, సేంద్రీయ రంగానికి సంబంధించిన వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి గొడుగు సంస్థగా వ్యవహరించడం ద్వారా సహకార రంగం నుండి సేంద్రీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఎంఎస్ సిఎస్ చట్టం, 2002 లోని రెండవ షెడ్యూల్ కింద జాతీయ స్థాయి సహకార సంఘాన్ని రిజిస్టర్ చేస్తారు.
ప్రాథమిక సంఘాలు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఫెడరేషన్లు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పి ఓ లు) సహా ప్రాథమిక నుంచి జాతీయ స్థాయి సహకార సంఘాల వరకు ఇందులో సభ్యత్వం ఉంటుంది. ఈ సహకార సంఘాలన్నీ వాటి ఉప-చట్టాల (బై లాస్)ప్రకారం సొసైటీ బోర్డులో తమ ఎన్నికైన ప్రతినిధులను కలిగి ఉంటాయి.
సర్టిఫైడ్ , ప్రామాణిక సేంద్రియ ఉత్పత్తులను అందించడం ద్వారా సహకార సంఘం సేంద్రీయ రంగానికి సంబంధించిన వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇది దేశీయ ,ప్రపంచ మార్కెట్లలో సేంద్రీయ ఉత్పత్తుల డిమాండ్, వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడానికి దోహద పడుతుంది.
సహేతుక ధరలో పరీక్షలు ,ధృవీకరణను సులభతరం చేయడం ద్వారా పెద్ద ఎత్తున అగ్రిగేషన్, బ్రాండింగ్ ,మార్కెటింగ్ ద్వారా సేంద్రీయ ఉత్పత్తుల అధిక ధర ప్రయోజనాలను పొందడంలో సహకార సంఘాలకు ,అంతిమంగా వారి రైతు సభ్యులకు ఈ సొసైటీ సహాయ పడుతుంది.
సహకార సంఘం అగ్రిగేషన్, సర్టిఫికేషన్, టెస్టింగ్, సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, లేబులింగ్, ప్యాకేజింగ్, లాజిస్టిక్ సదుపాయాలు, సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు / రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్ పి ఓ లు) తో సహా సభ్య సహకార సంఘాల ద్వారా సేంద్రీయ రైతులకు ఆర్థిక సహాయం ఏర్పాటు చేయడానికి సంస్థాగత మద్దతును కూడా అందిస్తుంది. వివిధ ప్రభుత్వ పథకాలు,ఏజెన్సీల ద్వారా
సేంద్రీయ ఉత్పత్తుల ప్రచారం ,అభివృద్ధి సంబంధిత కార్యకలాపాలను కూడా ఈ సహకార సంఘం నిర్వహిస్తుంది. ఇది గుర్తింపు పొందిన సేంద్రీయ పరీక్షా ప్రయోగశాలలు, సర్టిఫికేషన్ సంస్థలను ఎంపానెల్ చేస్తుంది, పరీక్ష ,ధృవీకరణ ఖర్చును తగ్గించడానికి సొసైటీ సూచించిన ప్రమాణాలను కలిగి ఉంటుంది.
సహకార సంఘాలు ,సంబంధిత సంస్థలు ఉత్పత్తి చేసే సేంద్రియ ఉత్పత్తుల మొత్తం సరఫరా గొలుసును సభ్య సహకార సంఘాల ద్వారా సొసైటీ నిర్వహిస్తుంది, ఇది ఎంఎస్ సిఎస్ చట్టం, 2002 కింద ఏర్పాటు చేయబడిన జాతీయ సహకార ఎగుమతి సొసైటీ సేవలను ఎగుమతి మార్కెటింగ్ కోసం ఉపయోగిస్తుంది. తద్వారా ప్రపంచ మార్కెట్ లో సేంద్రీయ ఉత్పత్తుల చేరిక ,డిమాండ్ ను పెంచుతుంది. సేంద్రియ ఉత్పత్తిదారుకు సాంకేతిక మార్గదర్శకత్వం, శిక్షణ, సామర్థ్య పెంపు తో పాటు సేంద్రీయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ను కూడా నిర్వహిస్తుంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో సాధారణ సామూహిక వ్యవసాయం , సేంద్రీయ వ్యవసాయం మధ్య సమతుల్య విధానాన్ని పాటిస్తుంది.