ఆర్థిక సంవత్సరం 2024-25 కాలానికి ముడి జనపనారకు కనీస మద్దతు ధరలను ఇచ్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.
ముడి జనపనార (గతంలో టిడిఎన్ 5వ గ్రేడ్‌తో సమానమైన టిడిఎన్-3)కి 2024-25 కాలంలో ఎంఎస్‌పీని క్వింటాలకు రూ. 5,335/- గా నిర్ణయించారు. ఇది మొత్తం భారతదేశ సగటు ఉత్పత్తి వ్యయం కంటే 64.8శాతం రాబడిని నిర్ధారిస్తుంది. 2024-25 సీజన్‌లో ముడి జనపనారకు ప్రకటించిన ఎంఎస్‌పి 2018-19 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన విధంగా, మొత్తం దేశం మొత్తం సగటు ఉత్పత్తి విలువకన్నా కనీసం 1.5 రెట్లు ఎక్కువ స్థాయిలో ఎంఎస్‌పీని నిర్ణయించాలన్న సూత్రానికి అనుగుణంగా ఉంది.
వ్యవసాయ ఖర్చులు ధరలలు కమిషన్ (సిఎసిపి) చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం ఉంది.
గత సీజన్ కన్నా క్వింటాలు ముడిజనపనార ఎంఎస్‌పీ 2024-25లో రూ. 285/- పెరిగింది. గత పది సంవత్సరాలలో ప్రభుత్వం 2014-15లో గల క్వింటాలు ముడి జనపనార ఎంఎస్‌పీని రూ. 2,400 నుంచి 2024-25లో క్వింటాలు రూ. 5,335/-కఉ పెంచి, దాదాపు 122 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో, రూ. 524.32 కోట్ల విలువైన 6.24 లక్షల బేళ్ళ ముడి జనపనారను ప్రభుత్వం రికార్డు మొత్తంలో సేకరించి దాదాపు 1.65 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చింది.
మద్దతు ధరల కార్యకలాపాలను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జెసిఐ) వ్యవహరిస్తుంది. అటువంటి కార్యకలాపాలలో ఏమైనా నష్టాలు వాటిల్లితే కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లిస్తుంది.
देशभर के अपने किसान भाई-बहनों के कल्याण के लिए हम प्रतिबद्ध हैं। इसी दिशा में हमारी सरकार ने वर्ष 2024-25 के लिए जूट की एमएसपी को बढ़ाने का निर्णय लिया है। इससे पश्चिम बंगाल सहित कई राज्यों के किसानों की आमदनी बढ़ेगी। https://t.co/F2pSqI1snM
— Narendra Modi (@narendramodi) March 7, 2024