ఎండు కొబ్బరికి 2024 సీజన్‌లో చెల్లించే కనీస మద్దతు ధరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. సాగుదారులకు లాభదాయకమైన ధరలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ప్రకటించింది.పంట ఉత్పత్తికి జాతీయ స్థాయిలో నిర్ణయించిన వెయిటెడ్ ఉత్పత్తి వ్యయంకి మించి కనీసం 1.5 రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధర నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొబ్బరి నూనె తయారు చేయడానికి ఉపయోగించే ఎండు కొబ్బరికి 2024 సీజన్‌లో క్వింటాల్‌కు రూ.11,160 కనీస ధరగా నిర్ణయించారు. కురిడి కొబ్బరి కాయకు చెల్లించే కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.12,000/-గా నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు నూనె తీయడానికి ఉపయోగించే కొబ్బరిపై 51.84 శాతం, కురిడి పై 63.26 శాతం మార్జిన్ లభిస్తుంది. జాతీయ స్థాయిలో నిర్ణయించిన వెయిటెడ్ ఉత్పత్తి వ్యయం తో పోల్చి చూస్తే ఇది1.5 రెట్లు ఎక్కువ. ఎండు కొబ్బరిని నూనెను తీయడానికి ఉపయోగిస్తారు. బంతి ఆకారంలో ఉండే కురిడి కొబ్బరికాయను డ్రై ఫ్రూట్‌గా , మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరి ఉత్పత్తి లో కేరళ, తమిళనాడు అగ్రస్థానంలో ఉన్నాయి. కురిడి కొబ్బరి ప్రధానంగా కర్ణాటకలో ఉత్పత్తి అవుతోంది.
గత సీజన్తో పోల్చే చూస్తే ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర 2024 సీజన్‌లో క్వింటాల్‌కు రూ.300/- పెరిగింది. కురిడి కొబ్బరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.250/- పెరిగింది. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస ధరను పెంచుతూ వస్తోంది. 2014-15 లో ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 5,250 రూపాయలుగా ఉంది ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర 113 శాతం పెరిగి 11,160 రూపాయలకు చేరింది. అదేవిధంగా కురిడి కొబ్బరి కనీస మధాతు ధర 118 శాతం పెరిగింది. 2014-15 లో . , ప్రభుత్వం మిల్లింగ్ కొప్రా మరియు బాల్ కొప్రాకు ఎంఎస్‌పిని క్వింటాల్‌కు రూ.5,250 నుండి మరియు 2014-15లో క్వింటాల్‌కు రూ.5,500 నుండి క్వింటాల్‌కు రూ.11,160కి మరియు 2024-25లో క్వింటాల్‌కు రూ.12,000కి పెంచింది. వరుసగా 113 శాతం మరియు 118 శాతం వృద్ధిని నమోదు చేసింది.
అధిక MSP కొబ్బరి పెంపకందారులకు మెరుగైన ప్రతిఫలాన్ని అందించడమే కాకుండా దేశీయంగా మరియు అంతర్జాతీయంగా కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కొప్రా ఉత్పత్తిని విస్తరించడానికి రైతులను ప్రోత్సహిస్తుంది.
ప్రస్తుత సీజన్ 2023లో, ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1.33 లక్షల మెట్రిక్ టన్నుల కొప్రాను రూ.1,493 కోట్లతో సేకరించి, దాదాపు 90,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ప్రస్తుత సీజన్ 2023లో సేకరణ మునుపటి సీజన్ (2022) కంటే 227 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) ధర మద్దతు పథకం (PSS) కింద కొప్రా మరియు పొట్టు తీసిన కొబ్బరి సేకరణ కోసం సెంట్రల్ నోడల్ /ఏజెన్సీలు (CNAs)గా కొనసాగుతాయి.
The Cabinet's approval of increased MSPs for copra ensures greater profit margins for our farmers. This significant step reaffirms our commitment to empowering India's coconut growers and strengthening our agricultural sector. https://t.co/UtGxV3LWN0 https://t.co/FZTRwDNHYR
— Narendra Modi (@narendramodi) December 27, 2023