ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్డర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) మరియు ద చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ద మాల్దీవ్స్ (సిఎ మాల్దీవ్స్) కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందాని (ఎంఒయు) కి గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది.
వివరాలు:
మాల్దీవ్స్ లో మరియు భారతదేశం లో అకౌంటింగ్ విజ్ఞానం, వృత్తి పరమైనటువంటి అభివృద్ధి లో, మేధోపరమైనటువంటి అభివృద్ధి లో ముందంజ వేయడం, సంబంధి విభాగం లో సభ్యుల హితాల ను పెంపు చేయడం తో పాటు ఇరు దేశాల లోను అకౌంటింగ్ వృత్తి రంగం అభివృద్ధి కి సకారాత్మకమైనటువంటి తోడ్పాటు ను అందించడం ముఖ్యం అనే దృష్టి కోణం తో పరస్పర సహకారాన్ని నెలకొల్పుకోవాలని ఐసిఎఐ, ఇంకా సిఎ మాల్దీవ్స్ ధ్యేయం గా పెట్టుకొన్నాయి.
ప్రభావం:
ఈ ఎంఒయు సిఎ మాల్దీవ్స్ కు సహాయకారి గా ఉండడంతో పాటు, స్వల్ప కాలం లోను రాబోయే దీర్ఘ కాలం లోను మాల్దీవ్స్ లో వృత్తిపరమైనటువంటి అవకాశాల ను ఐసిఎఐ సభ్యులు పొందేందుకు అదనపు అవకాశాల ను కూడా అందించ గలుగుతుంది. ఈ ఎంఒయు ద్వారా ఐసిఎఐ అకౌంటెన్సీ వృత్తి లో సేవ ల ఎగుమతి కి బాట ను పరుస్తూ, మాల్దీవ్స్ తో భాగస్వామ్యాన్ని బలపరచుకోవడం లో తోడ్పాటు లభించనుంది. ఐసిఎఐ సభ్యులు అనేక దేశాల లో, వేరు వేరు సంస్థల లో మధ్య శ్రేణి మొదలుకొని ఉన్నత శ్రేణి పదవుల ను నిర్వహిస్తూ, మరి ఆయా సంస్థ లు నిర్ణయాలను తీసుకోవడం/విధానాల ను రూపొందించడం లో కీలకమైనటువంటి పాత్ర ను పోషించే స్థితి లో ఉన్నారు.
ప్రయోజనాలు:
ఐసిఎఐ సభ్యుల కు వారు వృత్తిపరమైన పరిధి ని పెంచుకొనేందుకు మరియు అక్కడి పౌరుల లో సామర్థ్య నిర్మాణాన్ని పటిష్ట పరచడం లో సాయపడేటట్లుగా ఐసిఎఐ కి అవసరమైనటువంటి అండదండల ను ఈ ఎంఒయు సమకూర్చుతుంది. భారతదేశాని కి మరియు మాల్దీవ్స్ కు మధ్య బలమైన కార్యాచరణ సంబంధాల ను ఈ ఎంఒయు పెంచి పోషించగలదు. అంతేకాకుండా ఈ ఒప్పందం ఉభయ పక్షాల లో వృత్తి నిపుణుల మొబిలిటీ ని పెంచి, ప్రపంచ వ్యాప్తం గా వ్యాపారాని కి ఒక నూతనమైనటువంటి పార్శ్వాన్ని జత పరచ గలుగుతుంది.
అమలు సంబంధి వ్యూహం మరియు లక్ష్యాలు:
ప్రొఫెశనల్ అకౌంటెన్సీ ట్రయినింగ్, కు సంబంధించినటువంటి వృత్తి పరమైన నైతిక ప్రమాణాలు, సాంకేతిక పరిశోధన, ప్రొఫెశనల్ డెవలప్ మెంట్ ఆఫ్ అకౌంట్స్ లకు సంబంధి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ద్వారాను, అభిప్రాయాల ను పరస్పరం వెల్లడించుకోవడం ద్వారాను ఐసిఎఐ మరియు సిఎ మాల్దీవ్స్ ల మధ్య అకౌంటెన్సీ వృత్తి పరమైనటువంటి సహకారాన్ని బలపరచాలన్నది ఈ ఎంఒయు లక్ష్యం గా ఉంది. అంతే కాకుండా ఉభయ పక్షాలు వాటి వాటి వెబ్ సైట్ లింకేజీల ద్వారా చర్చాసభ లు, సమావేశాలు, విద్యార్థి బృందాల రాక పోక లు, ఇరు సంస్థల కు పరస్పరం ప్రయోజనకారి కాగలిగే అన్య సంయుక్త కార్యాకలాపాల ద్వారా పరస్పరం సహకారాన్ని పెంపొందింప చేసుకోవడానికి కూడా ఈ ఎంఒయు ను ఉద్దేశించడమైంది. ప్రపంచం లో చార్టర్ డ్ అకౌంటెన్సీ వృత్తి ని ప్రోత్సహించడాని కి భారతదేశం లో, మాల్దీవ్స్ లో అకౌంటెన్సీ వృత్తి యొక్క అభివృద్ధి తాలూకు తాజా సమాచారాన్ని సైతం ఈ ఎంఒయు అందిస్తుంది. పైపెచ్చు, ఇంటర్ నేశనల్ ఫెడరేశన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎఫ్ఎసి) లో సభ్యత్వాన్ని తీసుకోవాలని సిఎ మాల్దీవ్స్ బావిస్తోంది. ఐఎఫ్ఎసి 135 దేశాల లో 180 కి పైగా ఎక్కువ సభ్యత్వాలు ఉన్నాయి. ఐఎఫ్ఎసి అకౌంటెన్సీ వృత్తి కి సంబంధించిన గ్లోబల్ వాయిస్ గా ఉన్నది. ఐఎఫ్ఎసి లో సభ్యత్వాన్ని సిఎ మాల్దీవ్స్ పొందేందుకు వీలుగా అవసరమైనటువంటి సాంకేతిక పరమైన డ్యూ డిలిజన్స్ సేవల ను ఐసిఎఐ అందించనుంది.
పూర్వరంగం:
భారతదేశం లో చార్టర్ డ్ అకౌంటెంట్ వృత్తి ని క్రమబద్ధం చేసేందుకు 1949 వ సంవత్సరం లో రూపొందించిన చార్టర్ డ్ అకౌంటెంట్స్ యాక్ట్ పరిధి లో ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టబద్ధ సంస్థ యే ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్ డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ). ఐసిఎఐ విద్య రంగం లో, వృత్తి కుశలత ను అభివృద్ధి పరచడం లో, చార్టర్ డ్ అకౌంటెన్స్ వృత్తి ని వర్ధిల్లజేయడం లో ఉన్నతమైన అకౌంటింగ్, ఆడిటింగ్ మరియు నైతిక ప్రమాణాల సాధన కు ఐసిఎఐ మహత్తరమైనటువంటి తోడ్పాటు ను అందించింది. ఈ తోడ్పాటు కు ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు లభించింది.
Today’s Cabinet decision will benefit the CA community by opening several new opportunities. I urge the community to harness them and grow further. https://t.co/tVHCJ3uipg
— Narendra Modi (@narendramodi) May 17, 2023