ఇంట్రా-స్టేట్ ట్రాన్స్ మిశన్ సిస్టమ్ (ఐఎన్ ఎస్ టిఎస్ ) తాలూకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జిఇసి) రెండో దశ పథకాన్ని అమలు చేయడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదం తెలిపింది. దీనిలో భాగం గా ఇంచుమించు 10,750 సర్క్యూట్ కిలోమీటర్ ల మేరకు ప్రసార మార్గాలు మరియు సబ్ స్టేశన్ లకు దాదాపు గా 27,500 మెగా వోల్ట్-ఏంపియర్ (ఎమ్ విఎ)ల ప్రసారం సామర్ధ్యాన్ని అదనం గా జత చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ఏడు రాష్ట్రాలు.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, రాజస్థాన్, తమిళ నాడు, ఇంకా ఉత్తర్ ప్రదేశ్.. లలో గ్రిడ్ ఏకీకరణ కు తోడు సుమారు 20 గీగావాట్ నవీకరణ యోగ్య శక్తి (ఆర్ఇ) యొక్క క్లియరెన్సు కు కూడా మార్గం సుగమం కానుంది.
ఈ పథకాన్ని మొత్తం 12,031.33 కోట్ల రూపాయల అంచనా ఖర్చు తో ప్రారంభించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడమైంది. దీనిలో 3970.34 కోట్ల రూపాయల మేరకు కేంద్రీయ ఆర్థిక సహాయం (సిఎఫ్ఎ) ఉంటుంది. ఇది ప్రాజెక్టు వ్యయం లో 33 శాతాని కి సమానం. ప్రసార వ్యవస్థ లను 2021-22 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు అంటే అయిదు సంవత్సరాల కాలం లోపల నిర్మించడం జరుగుతుంది. కేంద్రీయ ఆర్థిక సహాయం (సిఎఫ్ఎ) అనేది అంతర్ రాష్ట్ర ప్రసార ఖర్చుల ను ఆఫ్ సెట్ చేయడం లో తోడ్పడనుంది. ఈ విధం గా విద్యుత్తు ధరల ను తక్కువ గా ఉంచడాని కి వీలవుతుంది. ఈ ప్రకారం గా, ప్రభుత్వం యొక్క మద్దతు తో విద్యుత్తు అంతిమ వినియోగదారుల కు, అదే దేశంలోని పౌరులకు మేలు కలుగుతుందన్న మాట.
ఈ పథకం 2030వ సంవత్సరాని కల్లా 450 గీగావాట్ స్థాపిత నవీకరణ యోగ్య శక్తి సామర్ధ్యం అనే లక్ష్యాన్ని సాధించడం లో సహాయకారి కానుంది.
ఈ పథకం దేశాని కి దీర్ఘకాలిక శక్తి రంగ భద్రత ను సమకూర్చడానికి కూడా తోడ్పాటు ను అందించడం తో పాటు కర్బన పాదముద్ర ను తగ్గించడం ద్వారా పర్యావరణ సంబంధి స్థిర వృద్ధి ని కూడా ప్రోత్సహించనుంది. దీనితో విద్యుత్తు మరియు ఇతర సంబంధి రంగాల లో ఇటు నైపుణ్యాలు అంతగా లేనటువంటి సిబ్బంది కి, అటు నిపుణులైన సిబ్బంది కి.. ఈ రెండు విధాలైన శ్రమికులకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి.
ఈ పథకం జిఇసి - ఒకటో దశ కు అదనం గా ఉంటుంది. జిఇసి ఒకటో దశ అనేది గ్రిడ్ ఏకీకరణ మరియు సుమారు 24 గీగావాట్ నవీకరణయోగ్య శక్తి క్లియరెన్సు సందర్భం లో ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు తమిళ నాడు రాష్ట్రాల లో ఇప్పటికే అమలవుతున్నది. ఈ ఒకటో దశ 2022వ సంవత్సరాని కల్లా పూర్తి అవుతుందన్న ఆశ ఉంది. ఏ సబ్ స్టేశన్ ల దగ్గర 4056.67 కోట్ల రూపాయల కేంద్రీయ ఆర్థిక సహాయం (సిఎఫ్ఎ) సహితంగా 10,141.68 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో కూడిన ట్రాన్స్ మిశన్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఆ సబ్ స్టేశన్ లలో 9,700 సర్క్యూట్ కిలో మీటర్ లకు అదనం గా ప్రసార మార్గాల ను, మరి అందులో 22,600 మెగా వోల్ట్- ఏంపియర్ ల అదనపు సామర్ధ్యాన్ని జోడించడం కోసం ఈ పథకాన్ని తలపెట్టడమైంది.