గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.23,123 కోట్ల విలువ గ‌ల “భార‌త కోవిడ్‌-19 అత్య‌వ‌స‌ర స్పంద‌న,  ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల సంసిద్ధ‌నీయ‌త ప్యాకేజి :  ఫేజ్-II ”కి ఆమోద‌ముద్ర వేసింది. ప్రధానంగా  శిశు వైద్య సంర‌క్ష‌ణ, మ‌దింపు చేయ‌ద‌గిన ఫ‌లితాల‌పై దృష్టి కేంద్రీక‌రిస్తూ ఆరోగ్య మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చేయ‌డం, స‌త్వ‌ర నివార‌ణ‌, గుర్తింపు, నిర్వ‌హ‌ణ‌తో కూడిన త‌క్ష‌ణ సంసిద్ధ‌నీయ‌త‌ను ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల్లో పెంచ‌డం ఈ స్కీమ్ ల‌క్ష్యాలు.

ఈ ఫేజ్-II ప్యాకేజిలో కేంద్ర సెక్టార్ (సిఎస్‌), కేంద్రం స్పాన్స‌ర్ చేసిన ప‌థ‌కాలు (సిఎస్ఎస్)  పేరిట రెండు ప్ర‌ధాన విభాగాలున్నాయి.

సెంట్ర‌ల్ సెక్టార్ లోని అంశాలు…

–      ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (డిఓహెచ్ఎఫ్‌ డ‌బ్ల్యు) పరిధిలోని  జాతీయ ప్రాధాన్య‌త గ‌ల  కేంద్ర‌ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఎయిమ్స్;  స‌ఫ్ద‌ర్ జంగ్ ఆస్ప‌త్రి, ఢిల్లీ;  ఎల్ హెచ్ఎంసి, ఎస్ఎస్ కెహెచ్, ఢిల్లీ;  ఆర్ఎంఎల్ ఢిల్లీ;  రిమ్స్, ఢిల్లీ, ఇంఫాల్;  నీగ్రిమ్స్, షిల్లాంగ్;  పిజిఐఎంఇఆర్, చండీగ‌ఢ్;  జిప్ మర్, పుదుచ్చేరి;   ఎయిమ్స్, ఢిల్లీ లకు కోవిడ్ నిర్వ‌హ‌ణ కోసం 6688 బెడ్ల‌ను  విభిన్న ప్ర‌యోజ‌నం కోసం సిద్ధం చేయ‌డానికి మ‌ద్ద‌తు చ‌ర్య‌లు అందిస్తారు.

–      జ‌న్యు సీక్వెన్సింగ్ యంత్రాల స‌ర‌ఫ‌రా, సైంటిఫిక్ కంట్రోల్ రూమ్ మంజూరు, మ‌హ‌మ్మారి నిఘా స‌ర్వీసులు (ఇఐఎస్‌), ఇసాకాగ్ స‌చివాల‌య మ‌ద్ద‌తు వంటి చ‌ర్య‌ల‌తో జాతీయ వ్యాధుల నియంత్ర‌ణ  కేంద్రం (ఎన్ సిడిసి) ప‌టిష్ఠీక‌ర‌ణ

–      దేశంలోని అన్ని జిల్లా ఆస్ప‌త్రుల్లోను ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ స‌మాచార వ్య‌వ‌స్థ (హెచ్ఎంఐఎస్‌) అమ‌లుకు (ప్ర‌స్తుతం 310 జిల్లా ఆస్ప‌త్రుల్లో అమ‌లు) అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు అందిస్తారు. అన్ని జిల్లా ఆస్ప‌త్రులు ఎన్ఐసి ఇ–ఆస్ప‌త్రి అభివృద్ధి, సిడాక్ రూపొందించిన ఇ–సుశ్రుత సాఫ్ట్ వేర్ క‌లిగి ఉండేలా చూడ‌డం వంటి చ‌ర్య‌ల ద్వారా హెచ్ఎంఐఎస్ ను అమ‌లుప‌రిచేలా చూస్తారు. అన్ని డిహెచ్ ల‌లోనూ జాతీయ డిజిట‌ల్ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్ డిహెచ్ఎం) అమ‌లుకు ఇది భారీ ఉత్తేజం ఇస్తుంది. జిల్లా ఆస్ప‌త్రుల హార్డ్ వేర్ సామ‌ర్థ్యం విస్త‌రించ‌డానికి కూడా మ‌ద్ద‌తు ఇస్తారు.

–      జాతీయ ఇ–సంజీవ‌ని టెలి క‌న్స‌ల్టేష‌న్ ఆర్కిటెక్చ‌ర్ ను విస్త‌రించేందుకు త‌గు మ‌ద్ద‌తు చ‌ర్య‌లు చేప‌డ‌తారు. త‌ద్వారా టెలీ క‌న్స‌ల్టేష‌న్ సేవ‌ల‌ను ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తున్న‌ రోజుకి 50 వేల టెలీ క‌న్స‌ల్టేష‌న్ల నుంచి రోజుకి 5 ల‌క్ష‌ల టెలీ క‌న్స‌ల్టేష‌న్ల‌కు పెంచుతారు. అలాగే దేశంలోని అన్ని జిల్లాల్లో ఇ–సంజీవ‌ని టెలీ క‌న్స‌ల్టేష‌న్ హ‌బ్ ల‌ను ప‌టిష్ఠం చేయ‌డం ద్వారా కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో (సిసిసి) కోవిడ్ రోగుల‌కు టెలీ క‌న్స‌ల్టేష‌న్ సేవ‌లందించేందుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు ఇస్తారు.

–      డిఓహెచ్ ఎఫ్ డ‌బ్ల్యులోని సెంట్ర‌ల్ వార్ రూమ్ ప‌టిష్ఠం చేయ‌డం, కోవిడ్‌-19 పోర్ట‌ల్ శ‌క్తివంతం చేయ‌డం, 1075 కోవిడ్ హెల్ప్ లైన్లు, కోవిన్ ప్లాట్ ఫారం  ప‌టిష్ఠం చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ఐటి చొర‌వ‌లు ప్ర‌ద‌ర్శించేందుకు మ‌ద్ద‌తు అందిస్తారు.

 

సిఎస్ఎస్ కింద తీసుకునే చ‌ర్య‌లు…

సిఎస్ఎస్ విభాగాల కింద మ‌హ‌మ్మారిపై స‌త్వర పోరాటానికి త్వ‌రిత స్పంద‌న వ్య‌వ‌స్థ‌లను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుప‌రిచేందుకు    జిల్లా, అంత‌క‌న్నా దిగువ స్థాయిలో సేవ‌ల ప‌టిష్ఠ‌త‌కు చ‌ర్య‌లు తీసుకుంటారు.

–      దేశంలోని 736 జిల్లా ఆస్ప‌త్రుల్లో పిల్ల‌ల  చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.  ప్ర‌తీ ఒక్క రాష్ట్రం, కేంద్ర‌పాలిత ప్రాంతంలో (వైద్య క‌ళాశాల‌, రాష్ట్రప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, లేదా ఎయిమ్స్, ఐఎన్ఐల వంటివి)  సెంట్ర‌ల్ ఆస్ప‌త్రుల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటారు.    పిల్ల‌ల చికిత్సపై సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ (పేడియాట్రిక్ సిఓఇ) ఏర్పాటు చేయ‌డంతో పాటు  టెలీ ఐసియు సేవ‌లందించేందుకు మ‌ద్ద‌తు ఇస్తారు. జిల్లా బాల‌ల చికిత్సా కేంద్రాల‌కు మార్గద‌ర్శ‌కం చేయ‌డానికి అవ‌స‌ర‌మైన‌ టెక్నిక‌ల్, మెంటారింగ్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

–      ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ‌లో అందుబాటులో ఉన్న 20 వేల ఐసియు ప‌డ‌క‌ల్లో 20 శాతం బాల‌ల ఐసియు ప‌డ‌క‌లుగా మార్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటారు.

–      ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు చేప‌ట్ట‌డం ద్వారా ప్ర‌స్తుత సిహెచ్ సిలు, పిహెచ్ సిలు, ఎస్ హెచ్ సిల‌న్నింటిలోనూ (6-20 ప‌డ‌క‌ల యూనిట్లు) ప‌డ‌క‌లు పెంచ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా కోవిడ్‌-19కి చికిత్స‌ను గ్రామీణ‌, పెరీ అర్బ‌న్‌, గిరిజ‌న ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తారు. ద్వితీయ‌, తృతీయ శ్రేణి న‌గ‌రాలు, జిల్లా ప్ర‌ధాన కేంద్రాల అవ‌స‌రాల ఆధారంగా మ‌రింత పెద్ద ఫీల్డ్ ఆస్ప‌త్రుల (50-100 ప‌డ‌క‌లు) ఏర్పాటుకు మ‌ద్ద‌తు ఇస్తారు.

–      ప్ర‌తీ జిల్లాకు ఒక్కోటి చొప్పున మెడిక‌ల్ గ్యాస్ పైప్ లైన్ తో  కూడిన 1050 లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజెన్ స్టోరేజి టాంకులు ఏర్పాటు చేస్తారు.

–      కొత్త‌గా 8800 అంబులెన్స్ లు జోడించ‌డం ద్వారా ప్ర‌స్తుత అంబులెన్స్ ల సంఖ్య పెంచుతారు.

–      స‌మ‌ర్థ కోవిడ్ నిర్వ‌హ‌ణ కోసం అండ‌ర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంట‌ర్న్ లు, చివ‌రి సంవ‌త్స‌రం ఎంఎంబిలు, బిఎస్ సిలు, జిఎన్ఎం న‌ర్సింగ్ విద్యార్థుల సేవ‌లు ఉప‌యోగించుకుంటారు.

–      అన్ని స‌మ‌యాల్లో కోవిడ్ నివార‌ణ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి పాటిస్తూ కోవిడ్‌-19ని స‌మ‌ర్థ‌వంతంగా నిలువ‌రించే జాతీయ స్థాయి వ్యూహంలో భాగంగా రాష్ర్టాల్లో “టెస్ట్, ఐసొలేట్‌, ట్రీట్” సేవ‌ల‌ సంఖ్య రోజుకి 21.5 ల‌క్ష‌లుండేలా చ‌ర్య‌లు తీసుకుంటారు.

–      కోవిడ్‌-19 చికిత్స‌ల‌కి కావ‌ల‌సిన‌న్ని ఔష‌ధాలు అందుబాటులో ఉంచ‌డం, బ‌ఫ‌ర్ స్టాక్ ల ఏర్పాటు కోసం జిల్లాల‌కు త‌గినంత మ‌ద్ద‌తు ఇస్తారు.

మొత్తం రూ.23,123 కోట్ల వ్య‌యంతో 2021 జూలై 1వ తేవా నుంచి 2022 మార్చి 31వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న “భారత కోవిడ్ 19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థల సంసిద్ధ‌నీయత ప్యాకేజి :  ఫేజ్ II” ప్యాకేజిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వాటా ఉంటుంది.

అది

– ఇసిఆర్ పి-II లో  కేంద్ర వాటా – రూ.15,000 కోట్లు

– ఇసిఆర్ పి-II లో  రాష్ర్టాల‌ వాటా – రూ.8,123 కోట్లు

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ముందున్న‌తొమ్మిది నెల‌ల త‌క్ష‌ణ అవ‌స‌రాల‌ను ప్ర‌ధానంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈ ప్యాకేజి రూపొందించారు. కేంద్ర ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు/  ఏజెన్సీలు;  రాష్ట్రప్ర‌భుత్వాలు/   కేంద్ర‌పాలిత ప్రాంతాల ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లు రెండో విడ‌త కోవిడ్ స‌మ‌యంలో స‌మ‌కూర్చుకున్న స‌దుపాయాల‌ను మ‌రింత‌గా విస్త‌రించి మ‌హ‌మ్మారి ముందు కాలంలో సంత‌రించుకోబోయే రూపాల‌కు అనుగుణంగా సంసిద్ధం చేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌డ‌తారు. అలాగే జిల్లా స్థాయి, అంత‌క‌న్నా దిగువ స్థాయిలో కూడా స‌దుపాయాలు మెరుగుప‌ర‌చ‌డంపై కూడా దృష్టి సారిస్తారు.

 

పూర్వాప‌రాలు

2020 మార్చిలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి దేశాన్ని తాకిన స‌మ‌యంలో ఏర్ప‌డిన క్లిష్ట ప‌రిస్థితి నేప‌థ్యంలో ఎంఓహెచ్ఎఫ్ డ‌బ్ల్యు, రాష్ట్ర ప్ర‌భుత్వాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల ప్ర‌య‌త్నాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం, మ‌హ‌మ్మారి నిర్వ‌హ‌ణ‌కు దీటుగా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను తీర్చి దిద్ద‌డం కోసం “భార‌త కోవిడ్‌-19 అత్య‌వ‌స‌ర స్పంద‌న‌, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల సంసిద్ధ‌త ప్యాకేజి” పేరిట రూ.15 వేల కోట్ల కేంద్ర‌ప్ర‌భుత్వ స్కీమ్ ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌టించారు. 2021 ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య కాలం నుంచి రెండో విడ‌త క‌రోనా విజృంభించి దేశంలోని గ్రామీణ‌, పెరీ అర్బ‌న్‌, గిరిజ‌న ప్రాంతాల‌కు కూడా విస్త‌రించింది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 నవంబర్ 2024
November 22, 2024

PM Modi's Visionary Leadership: A Guiding Light for the Global South