ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ జాతీయ రహదారి-208ని 101.300 కి.మీ. (ఖోవాయి) నుండి 236.213 కి.మీ. (హరీనా) వరకు రెండు లేన్‌ల మేర అభివృద్ధి & విస్తరణకు ఆమోదం తెలిపింది. త్రిపుర రాష్ట్రంలో దీని మొత్తం పొడవు 134.913 కి.మీ. ఈ మొత్తం ప్రాజెక్ట్ రూ.2,486.78 కోట్ల పెట్టుబడితో చేపడుతున్నారు. ఇందులో రూ.1,511.70 కోట్ల రుణ భాగం (జేపీవై 23,129 మిలియన్లు) ఉంది. లోన్ అసిస్టెంట్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుండి అధికారిక అభివృద్ధి సహాయం (ఓడా) పథకం కింద ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ త్రిపురలోని వివిధ ప్రాంతాల మధ్య మెరుగైన రహదారి కనెక్టివిటీని సులభతరం చేయడానికి మరియు త్రిపుర నుండి అస్సాం మరియు మేఘాలయాలకు ప్రస్తుత ఎన్.హెచ్-8 కాకుండా ప్రత్యామ్నాయ యాక్సెస్‌ను అందించడానికి ఉద్దేశించబడింది.
లాభాలు:
ప్రాంతం యొక్క సామాజిక ఆర్థిక అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మేలైన మరియు మోటారు చేయగల రహదారిని అందించడం యొక్క ఆవశ్యకత ఆధారంగా ప్రాజెక్ట్ ఎంపిక చేయబడింది. ఎన్.హెచ్-208 ప్రాజెక్ట్ విస్తరణ అభివృద్ధి ఎన్.హెచ్-208A ద్వారా అస్సాం మరియు త్రిపురల మధ్య అంతర్రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా రవాణా సమయాన్ని తగ్గిస్తుంది. ప్రయాణికులకు సురక్షితమైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రాజెక్ట్లో కొంత భాగం బంగ్లాదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరగా వెళుతుంది. ఇది కైలాషహర్, కమల్‌పూర్, ఖోవై బోర్డర్ చెక్ పోస్ట్ ద్వారా బంగ్లాదేశ్‌కు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ప్రాజెక్ట్ రహదారి అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతంలో రోడ్ నెట్‌వర్క్ మెరుగుపడటంతో భూ సరిహద్దు వాణిజ్యం కూడా సంభావ్యంగా వృద్ధి చెందుతుంది. ఎంపిక చేసిన స్ట్రెచ్ వృద్ధి మరియు ఆదాయం పరంగా వెనుకబడిన రాష్ట్రంలోని వ్యవసాయ బెల్ట్, పర్యాటక ప్రదేశాలు, మతపరమైన ప్రదేశాలు, గిరిజన జిల్లాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, కనెక్టివిటీ మెరుగుపడుతుంది, ఇది రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని మరియు స్థానిక ప్రజలకు ఆదాయాన్ని అందించడంలో సహాయపడుతుంది. ప్రాజెక్ట్ స్ట్రెచ్‌ల నిర్మాణ వ్యవధి 2 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ఈ జాతీయ రహదారుల విస్తరణ నిర్మాణం పూర్తయిన తర్వాత 5 సంవత్సరాలు (అనువైన పేవ్‌మెంట్ విషయంలో)/ 10 సంవత్సరాలు (దృఢమైన పేవ్‌మెంట్ విషయంలో) నిర్వహణ ఉంటుంది.