ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరల్ని అందిస్తూ, మరోవైపు ప్రజలపై నిత్యావసర సరకుల ధరాభారం పడకుండా- ప్రధానమంత్రి అన్నదాతా ఆదాయ సంరక్షణ పథకం (ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్- పిఎం-ఆషా) పథకాలను కొనసాగించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
15వ ఆర్థిక సంఘం చివరి నాటికి (2025-26 ఆర్థిక సంవత్సరం) పథకం మొత్తం అంచనా వ్యయం రూ.35,000 కోట్లు కానుంది.
రైతులకు, వినియోగదారులకు సమర్థవంతమైన సేవలందించడానికి ప్రభుత్వం ధరల ఆదరణ/మద్దతు పథకాన్ని (పిఎస్ఎస్), ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్) పథకాలను పీఎం ఆశాలో కలిపింది. పీఎం-ఆషా సంయుక్త పథకం అమలు ద్వారా సేవలు మరింత చేరువై, సానుకూల ప్రభావాన్ని చూపనున్నాయి. ఇది రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను అందించడంలో సహాయపడటమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువుల లభ్యమయ్యేలా చూస్తుంది. పీఎం-ఆషా పథకంలో ప్రస్తుతం ధరల ఆదరణ/మద్దతు పథకం (పిఎస్ఎస్), ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్), ధర లోటు చెల్లింపు పథకం (పిఒపిఎస్), మార్కెట్ మధ్యవర్తిత్వ పథకం(ఎంఐఎస్) మిళితమై ఉంటాయి.

ధరల మద్దతు పథకం కింద పేర్కొన్న పప్పుధాన్యాలు, నూనె గింజలు, కొబ్బరిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. ఇది 2024-25 పంటకాలంలో జాతీయ ఉత్పత్తిలో 25 శాతంగా ఉండనుంది. రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించేందుకు, సంక్షోభ కాలంలో వారి నష్టాల నివారించేందుకు కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలుకు చేసేందుకు రాష్ట్రాలకు వీలు కల్పిస్తుంది. అయితే, కందిపప్పు, పెసర, మైసూర్ పప్పు విషయంలో 2024-25 పంట కాలంలో ఈ పరిమితి వర్తించదు. ఎందుకంటే ముందుగా నిర్ణయించిన విధంగా 2024-25 పంటకాలంలో కందిపప్పు, పెసర, మైసూర్ పప్పుల వంద శాతం సేకరణ ఉండనుంది.

రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరి కొనుగోలుకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ గ్యారంటీని రూ.45 వేల కోట్లకు పెంచారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరి మరింత కొనుగోలు చేసేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుంది. కనీస మద్దతు ధర కన్నా మార్కెట్ రేటు పడిపోయినప్పడు కొనుగోలు... వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా నాఫెడ్ కు చెందిన ఇ-సమృద్ధి పోర్టల్‌లో నమోదిత రైతులు,  నేషనల్ కోపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇ-సంయుక్తి పోర్టల్ ఎంఎస్‌పీ ధరకే కొనుగోలు చేపడతాయి. దీని ద్వారా దేశంలో రైతులు ఈ పంటలను ఎక్కువగా పండించడానికి ప్రోత్సహం లభిస్తుంది. అంతే కాకుండా ఈ పంటలలో స్వయం సమృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది. దేశ అవసరాలను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడకుండా చేస్తుంది.
 

ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్) పథకాన్ని పొడిగించడం ద్వారా ఉల్లి, పప్పుధాన్యాలను కీలక సమయంలో వ్యూహాత్మకంగా మార్కెట్టుకు విడుదల చేయడం ద్వారా- వ్యవసాయ-ఉద్యాన ఉత్పత్తుల ధరలు పెరిగినపుడు వినియోగదారులను రక్షించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల అనైతిక నిల్వ, ధరల ఊహాత్మక పెరుగుదలకు ఇది తెరదించుతుంది. వినియోగదారులకు సరసమైన ధరలకు సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. మార్కెట్లో కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధర ఉన్నప్పుడల్లా నాఫెడ్ ఇ-సమృద్ధి పోర్టల్, ఎన్సిసిఎఫ్ సంయుక్తి పోర్టల్లో ముందస్తుగా నమోదైన రైతులతో సహా వినియోగదారుల వ్యవహారాల శాఖ (డిఓసిఎ) మార్కెట్ ధర వద్ద పప్పుధాన్యాల సేకరణ చేపడుతుంది. ధరల స్థిరీకరణ నిధి పథకం టమోటా వంటి ఇతర పంటలతో పాటు, భారత్ దాల్, భారత్ అట్టా, భారత్ రైస్ వంటి సబ్సిడీ రిటైల్ అమ్మకాల్లో పీఎస్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తున్నారు.

నోటిఫై చేసిన నూనె గింజల విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ధరల లోటు చెల్లింపు పథకాన్ని (పిడిపిఎస్) అమలు చేయనున్నారు. రాష్ట్ర ఉత్పత్తిలో నూనె గింజలపై ప్రస్తుతం ఉన్న 25 శాతం కవరేజీని 40 శాతానికి పెంచారు. రైతుల ప్రయోజనాల కోసం అమలు వ్యవధిని 3 నెలల నుండి 4 నెలలకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన కనీస మద్దతు ధర, సేల్/మోడల్ ధరల మధ్య వ్యత్యాస పరిహారం ఎంఎస్పీ లో 15 శాతానికి పరిమితం చేశారు.
పలు మార్పులతో మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్) అమలును పొడిగించడం వల్ల త్వరగా పాడయ్యే (పెరిషబుల్) ఉద్యాన పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రభుత్వం ఉత్పత్తిలో కవరేజీని 20 శాతం నుండి 25 శాతానికి పెంచింది. ఈ పథకం కింద భౌతిక సేకరణకు బదులుగా నేరుగా రైతుల ఖాతాలో భేదాత్మక చెల్లింపులు చేసే కొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. అంతేకాకుండా, టాప్ (టమోటా, ఉల్లి, బంగాళాదుంప) పంటల విషయంలో, గరిష్ట కోత సమయంలో- ఉత్పత్తి రాష్ట్రాలు, వినియోగ రాష్ట్రాల మధ్య ధరల వ్యత్యాసాన్ని పూడ్చడానికి, నాఫెడ్, ఎన్సిసిఎఫ్ వంటి కేంద్ర సంస్థలు చేపట్టే కార్యకలాపాలకు రవాణా, నిల్వ ఖర్చులను భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇది రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడమే కాకుండా మార్కెట్లో వినియోగదారులపై భారం పడకుండా చూస్తుంది.

 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
‘Bharat looks bhavya': Gaganyatri Shubhanshu Shukla’s space mission inspires a nation

Media Coverage

‘Bharat looks bhavya': Gaganyatri Shubhanshu Shukla’s space mission inspires a nation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 జూలై 2025
July 07, 2025

Appreciation by Citizens for PM Modi’s Diplomacy at BRICS 2025, Strengthening Global Ties