కేంద్రప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్.ఎ.ఎం)ను 01-04-2021 నుంచి 31-03-2026 వరకు కొనసాగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఇందుకు సంబంధించి రూ 4607.30 కోట్ల రూపాయలు (రూ 3000 కోట్లు కేంద్రం వాటా, 1607. 30 కోట్లు రాష్ట్రవాటా) ఆర్ధిక వనరులతో ముడిపడినది ఇది. ఈ మిషన్‌ను 15-09-2014 న ప్రారంభమైంది.
ఇండియాకు సంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేద, సిద్ద,సోవ రిగ్‌పా, యునాని, హోమియోపతి వంటి ( ఎ.ఎస్.యు, హెచ్) వంటివాటి ఘన వారసత్వం ఉంది. ముందస్తుగా వ్యాధులు రాకుండా చూడడానికి, రోగనిరోధక శక్తి పెంపునకు, చికిత్సకు సంబంధించి ఇండియాలో ఎంతో సంప్రదాయ విజ్ఞానం ఉంది. ఈ వైద్య విధానాలన్నీ తక్కువ ఖర్చు కాగలవి , అందుబాటులో ఉండేవి. సాధారణ ప్రజలు ఎక్కువ మందిలో వీటికి ఆమోదం ఉంది. ఇతర రకాల చికిత్సలతో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు బాగా తక్కువ,
కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైన నేషనల్ ఆయుష్ మిషన్‌ను భారత ప్రభుత్వానికి చెందిన ఆయుష్ మంత్రిత్వశాక అమలు చేస్తున్నది. తక్కువ ఖర్చుకాగల ఆయుష్ సేవలను అందించడం దీని లక్ష్యం. ఆయుష్ ఆస్పత్రులను డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేయడం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో , కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, జిల్లా ఆస్పత్రులలో ఆయుష్ సదుపాయాలు కల్పించడం, ఆయుష్ విద్యా సంస్థల ద్వారా రాష్ట్ర స్థాయిలో సంస్థాగత సామర్ధ్యాలను బలోపేతం చేయడం, కొత్తగా 50 పడకల సమీకృత ఆయుష్ ఆస్పత్రులను ఏర్పాటు చేయడం, ఆయుష్ పబ్లిక్ హెల్త్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఆయుష్ సూత్రాల ఆధారంగా నిర్వహించే 12,500 ఆయుష్ హెల్త్, వెల్‌నెస్ సెంటర్లద్వారా వైద్య సేవలు అందించడం, వైద్యంపై ఖర్చును తగ్గించే దిశగా స్వీయ రక్షణ చర్యలకు సంబంధించి ప్రజలకు సాధికారత కల్పించడం వంటివి ఇందులో ఉన్నాయి.