ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ఆర్థిక వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ ఈ రోజు 4556 మీ పొడవు, 6-లేన్ హై లెవెల్/ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ స్టేడ్ గంగా నది మీదుగా (ప్రస్తుతం ఉన్న పశ్చిమ భాగానికి సమాంతరంగా ఉన్న వంతెన) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం దిఘా-సోనేపూర్ రైల్-కమ్ రోడ్ బ్రిడ్జ్) మరియు బీహార్ రాష్ట్రంలోని పాట్నా మరియు సరన్ (ఎన్ హెచ్-139 డబ్ల్యూ) జిల్లాలలో రెండు వైపులా ఈ పీ సీ మోడ్‌ విధానం లో ఉంటుంది.

 

వ్యయం:

 

ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.3,064.45 కోట్లు, ఇందులో సివిల్ నిర్మాణ వ్యయం రూ.2,233.81 కోట్లు.

 

లబ్ధిదారుల సంఖ్య:

 

ఈ వంతెన ట్రాఫిక్‌ను వేగవంతం చేస్తుంది మరియు సులభతరం చేస్తుంది, దీని ఫలితంగా రాష్ట్రం మొత్తం ముఖ్యంగా ఉత్తర బీహార్ అభివృద్ధి చెందుతుంది, 

 

వివరాలు:

 

దిఘా (పట్నా & గంగా నదికి దక్షిణ ఒడ్డున ఉంది) మరియు సోనేపూర్ (సరన్ జిల్లాలో గంగా నది ఉత్తర ఒడ్డు)  రైలు కమ్ రోడ్ వంతెన ద్వారా అనుసంధానం ప్రస్తుతం తేలికపాటి వాహనాలు మాత్రమే వెళ్లేందుకు పరిమితం. అందువల్ల, ప్రధాన  వస్తువులు మరియు వస్తువుల రవాణా కోసం ప్రస్తుత రహదారిని ఉపయోగించలేని ఆర్థిక దిగ్బంధనం అయ్యింది. దిఘా మరియు సోనేపూర్ మధ్య ఈ వంతెనను అందించడం ద్వారా అడ్డంకి తొలగించబడుతుంది మరియు; బ్రిడ్జి నిర్మించబడిన తర్వాత సరుకులు మరియు వస్తువులను రవాణా చేయవచ్చు, ఇది ప్రాంతం యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీస్తుంది.

 

ఈ వంతెన ఔరంగాబాద్ మరియు సోనేపూర్ (ఎన్ హెచ్-31), ఛప్రా, మోతిహారి (తూర్పు-పశ్చిమ కారిడార్ పాత ఎన్ హెచ్-27), బెట్టియా (ఎన్ హెచ్-727) వద్ద ఎన్ హెచ్-139 ద్వారా బీహార్ లోని పాట్నా నుండి స్వర్ణ చతుర్భుజ కారిడార్‌కు నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ బుద్ధ సర్క్యూట్‌లో ఒక భాగం. ఇది వైశాలి మరియు కేశరియా వద్ద ఉన్న బుద్ధ స్థూపానికి మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే, ఎన్ హెచ్-139 డబ్ల్యూ చాలా ప్రసిద్ధి చెందిన అరేరాజ్ సోమేశ్వర్ నాథ్ ఆలయానికి కనెక్టివిటీని అందిస్తుంది మరియు తూర్పు చంపారన్ జిల్లాలోని కేసరియా వద్ద విరాట్ రామాయణ మందిరాన్ని (ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం) ప్రతిపాదించింది.

 

ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర రాజధానిపాట్నా , ఉత్తర బీహార్ మరియు బీహార్ యొక్క దక్షిణ భాగానికి మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ బ్రిడ్జి వాహనాల రాకపోకలను వేగంగా మరియు సులభతరం చేస్తుంది. ఫలితంగా ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక విశ్లేషణ ఫలితాలు బేస్ కేస్‌లో 17.6% ఈ ఐ పీ ఆర్ ని చూపించాయి మరియు 13.1%  ఉంది, ఇది దూరం మరియు ప్రయాణ సమయంలో  ఆదా చేస్తుందని చెప్పవచ్చు.

 

అమలు వ్యూహం మరియు లక్ష్యాలు: నిర్మాణం మరియు కార్యకలాపాల నాణ్యతను నిర్ధారించడానికి 5D-బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, బ్రిడ్జ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, నెలవారీ డ్రోన్ మ్యాపింగ్ వంటి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడంతోపాటు ఈ పని ఈ పీ సీ మోడ్‌లో అమలు చేయబడుతుంది. నిర్ణీత తేదీ నుంచి 42 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఉపాధి కల్పన సామర్థ్యంతో సహా ప్రధాన ప్రభావం: ఈ ప్రాజెక్ట్ వేగవంతమైన ప్రయాణాన్ని అందించడం మరియు బీహార్‌లోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అందువలన, ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రాంతం యొక్క సామాజిక-ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ప్రాజెక్ట్ నిర్మాణం మరియు నిర్వహణ కాలంలో నిర్వహించబడే వివిధ కార్యకలాపాలు నైపుణ్యం కలిగిన మరియు నైపుణ్యం లేని కార్మికులకు ప్రత్యక్ష ఉపాధిని సృష్టించగలవని భావిస్తున్నారు. 

కవర్ చేయబడిన రాష్ట్రాలు/జిల్లాలు: ఈ వంతెన బీహార్‌లోని గంగా నదిపై దక్షిణం వైపున దిఘా వద్ద పాట్నా మరియు ఉత్తరం వైపు సరన్ అనే రెండు జిల్లాలను కలుపుతుంది. 

నేపథ్య సమాచారం: "బాకర్‌పూర్, మాణిక్‌పూర్, సాహెబ్‌గంజ్, ఆరెరాజ్‌లను కలుపుతూ పాట్నా (ఏ ఐ ఐ ఎం ఎస్ ) సమీపంలోని ఎన్ హెచ్ - 139 జంక్షన్ నుండి ప్రారంభమయ్యే హైవే  బీహార్ రాష్ట్రంలోని బెట్టియా సమీపంలో ఎన్ హెచ్-139 డబ్ల్యూ  ఎన్ హెచ్- 727 జంక్షన్ వద్ద ముగుస్తుంది" అని ప్రభుత్వం  ప్రకటించింది. 8 జూలై 2021 నాటి గెజిట్ నోటిఫికేషన్‌ను చూడండి. 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman

Media Coverage

Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 మార్చి 2025
March 08, 2025

Citizens Appreciate PM Efforts to Empower Women Through Opportunities