అయోధ్య విమానాశ్రయాన్ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయం గా ప్రకటించే మరియు దానికి ‘‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’’ అనే పేరు ను పెట్టే ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది.
అయోధ్య యొక్క ఆర్థికపరమైన సామర్థ్యాన్ని మరియు ప్రపంచ స్థాయి తీర్థ స్థలం గా దాని ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం తో పాటు గా, విదేశీ తీర్థయాత్రికుల ను, పర్యటకుల ను దృష్టి లో పెట్టుకొని ఈ నగరం యొక్క తలుపులను తెరవడం కోసం అయోధ్య విమానాశ్రయాని కి అంతర్జాతీయ హోదా ను ఇవ్వడం చాలా మహత్వపూర్ణమైనటువంటిది అని చెప్పాలి.
విమానాశ్రయాని కి ‘‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’’ అనే పేరు ను పెట్టడం అంటే అది రామాయణ మహా కావ్యాన్ని రచించినటువంటి మహర్షి శ్రీ వాల్మీకి కి శ్రద్ధాంజలి ని ఘటించడం తో సమమైంది అని చెప్పాలి. ఈ పేరు తో విమానాశ్రయం యొక్క అస్తిత్వానికి ఒక సాంస్కృతిక వన్నె ను సంతరించినట్లు అవుతున్నది.
అయోధ్య తనకు ఉన్నటువంటి సాంస్కృతికం గా ఉన్నటువంటి పునాదుల తో పాటు వ్యూహాత్మకంగా కూడాను ఒక ప్రముఖమైనటువంటి ఆర్థిక కేంద్రం గా మరియు తీర్థయాత్రా స్థలం గా మారే స్థితి లోగి ఉంది. అంతర్జాతీయ తీర్థయాత్రికుల దృష్టి ని మరియు వ్యాపారాల ను ఆకట్టుకొనేందుకు ఈ విమానాశ్రయాని కి ఉన్నటువంటి సత్తా ఈ నగరానికి గల చారిత్రిక ఖ్యాతి తో తులతూగనుంది.
प्रभु श्री राम की पावन नगरी अयोध्या को दुनियाभर से जोड़ने के लिए हमारी सरकार कृतसंकल्प है। इसी कड़ी में यहां के एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट घोषित करने के साथ ही इसका नाम ‘महर्षि वाल्मीकि अंतरराष्ट्रीय हवाई अड्डा, अयोध्या धाम’ रखने के प्रस्ताव को मंजूरी दी गई है। यह कदम महर्षि… https://t.co/xhwQQ9gmb1
— Narendra Modi (@narendramodi) January 5, 2024