డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ)కి సంబంధించిన ఒకే గొడుగు కింద ఉన్న రెండు పథకాలను విలీనం చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 'బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (బయో-రైడ్)' అనే ఒక కొత్త పథకం పేరుతో పాత విధానాలను విలీనం చేశారు. బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయోఫౌండ్రీ పేరుతో రెండు కొత్త అంశాలను ఇందులో చేర్చారు.
ఈ పథకంలో విస్తృతంగా మూడు భాగాలుంటాయి:
a) బయోటెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ);
b) ఇండస్ట్రియల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (ఐ అండ్ ఈడీ)
c) బయో మాన్యుఫ్యాక్చరింగ్, బయోఫౌండ్రీ
2021-22 నుంచి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘ కాలంలో ఏకీకృత పథకం ‘బయో-రైడ్’ అమలుకు ప్రతిపాదిత వ్యయం రూ.9197 కోట్లుగా నిర్ణయించారు.
బయో-రైడ్ పథకం- ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, బయోటెక్నాలజీ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారుచేయడానికీ, బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీలో ప్రపంచానికి ఓ కరదీపికగా భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడానికి రూపొందించారు. ఇది పరిశోధనను వేగవంతం చేయడం, ఉత్పత్తి అభివృద్ధిని మెరుగుపరచడం, విద్యా పరిశోధన, పారిశ్రామిక రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణ సుస్థిరత, స్వచ్ఛమైన ఇంధనం వంటి జాతీయ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బయో-ఇన్నోవేషన్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే కేంద్ర ప్రభుత్వ మిషన్‌లో ఈ పథకం ఓ భాగం.
బయో-రైడ్ ని ప్రోత్సహించడం వల్ల జరిగేది-
. బయోటెక్నాలజీలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారుచేయడం: ఔత్సహికులకు ప్రారంభ పెట్టుబడులు (సీడ్ ఫండ్) అందించడం, పెట్టుబడులు, నిలదొక్కుకునే వరకూ సాయం అందించడం, సీనియర్ల ద్వారా మార్గదర్శనం అందించడం ద్వారా అంకుర సంస్థల కోసం అభివృద్ధి చెందుతున్న విస్తారణ వ్యవస్థను బయో-రైడ్ పెంపొందిస్తుంది.
· అడ్వాన్స్ ఇన్నోవేషన్: సింథటిక్ బయాలజీ, బయోఫార్మాస్యూటికల్స్, బయోఎనర్జీ, బయోప్లాస్టిక్స్ వంటి రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధికి ఈ పథకం నిధులనూ, ప్రోత్సాహకాలనూ అందిస్తుంది.
· పరిశ్రమ- విద్యా సంస్థల సహకారాన్ని సులభతరం చేయడం: బయో-ఆధారిత ఉత్పత్తులు, సాంకేతికతల వాణిజ్యీకరణను వేగవంతం చేయడానికి విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం దిశగా బయో-రైడ్ ఉపకరిస్తుంది.
· సుస్థిరమైన బయో మ్యాన్యుఫ్యాక్చరింగ్‌కు ప్రోత్సాహం: భారతదేశం హరిత లక్ష్యాలకు అనుగుణంగా బయోమాన్యుఫ్యాక్చరింగ్‌లో పర్యావరణపరంగా స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడంపై అధిక దృష్టి పెడుతుంది.
· అదనపు నిధుల ద్వారా పరిశోధకులకు మద్దతు: వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, బయోఎనర్జీ, పర్యావరణ స్థిరత్వం వంటి రంగాలలో పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తిగత పరిశోధకులకు అదనపు నిధులను అందిస్తుంది. దీని ద్వారా బయోటెక్నాలజీలోని విభిన్న రంగాలలో శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధిని అభివృద్ధి చేయడంలో బయో-రైడ్ కీలక పాత్ర పోషిస్తుంది.
· బయోటెక్నాలజీ రంగంలో మానవ వనరులను పెంపొందించడం: బయోటెక్నాలజీ బహుళ విభాగాలలో పనిచేస్తున్న విద్యార్థులు, యువ పరిశోధకులు, శాస్త్రవేత్తలకు బయో-రైడ్ సమగ్ర అభివృద్ధి, మద్దతును అందిస్తుంది. మానవ వనరుల అభివృద్ధి సమీకృత కార్యక్రమం మానవశక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. కొత్త పుంతలు తొక్కే సాంకేతిక పురోగతిని ప్రభావితం చేయడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది.
ఇంకా, దేశంలో చక్రభ్రమణ (సర్క్యులర్ బయోఎకానమీ) ని పెంపొందించడానికి బయో మాన్యుఫ్యాక్చరింగ్, బయోఫౌండ్రీలో ఒక భాగం ప్రారంభం అవుతుంది. ఇది గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించిన పచ్చని, స్నేహపూర్వక వాతావరణ మార్పులను తగ్గించే 'లైఫ్‌స్టైల్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్ (లైఫ్)' ద్వారా జీవితంలోని ప్రతి అంశంలో పర్యావరణ పరిష్కారాలు చూపుతుంది. బయో-రైడ్ ఆరోగ్య సంరక్షణ ఫలితాలను మెరుగుపరచడానికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికీ, బయోటెక్నాలజీ ఆధారిత వృద్ధిని పెంపొందించడానికి ప్రయత్నిస్తోంది. అలాగే స్వదేశీ వినూత్న పరిష్కారాల అభివృద్ధిని సులభతరం చేయడానికి 'బయోమ్యాన్యుఫ్యాక్చరింగ్' అపారమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షిస్తోంది.
కొనసాగుతున్న డీబీటీ ప్రయత్నాలు జాతీయ అభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసం ఒక ఖచ్చితమైన సాధనంగా బయోటెక్నాలజీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే దృష్టికి అనుగుణంగా ఇవన్నీ ఉంటాయి. బయోటెక్నాలజీ పరిశోధన, ఆవిష్కరణ, మార్పు, పారిశ్రామిక వృద్ధిలో భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేస్తోంది. 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల బయోటెక్నాలజీ ఆధారిత ఆర్థికాభివృద్ధిగా మారడం అనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తుంది. బయో-రైడ్ పథకం 'వికసిత భారత్ 2047' విజన్‌ను సాకారం చేయడంలో గణనీయంగా దోహదపడుతుంది.
నేపథ్యం:
శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంటు (డీబీటీ), బయోటెక్నాలజీ, ఆధునిక జీవశాస్త్రంలో నైపుణ్యం, ఆవిష్కరణ-ఆధారిత పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తుంది.