బడ్జెటు న్యూ ఇండియా కై ఉద్దేశించిందిగా ఉందని, ఇది దేశ ప్రజలకు శక్తి ని ప్రసాదించగలుగుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
2019-20 తాత్కాలిక బడ్జెటు సమర్పణ అనంతరం వరుస ట్వీట్ లలో ప్రధాన మంత్రి 12 కోట్ల మంది కి పైగా కర్షకులు మరియు వారి కుటుంబాలు, అలాగే 3 కోట్ల మంది కి పైగా మధ్య తరగతి కి చెందిన పన్ను చెల్లింపుదారులు, వృత్తినిపుణుల తో పాటు వారి యొక్క కుటుంబాలు, 30 నుండి 40 కోట్ల మంది శ్రామికులు న్యూ ఇండియా కు ఉద్దేశించిన బడ్జెటు పరం గా లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు.
ఎన్ డిఎ ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏవయితే రైతు సంక్షేమం నుండి మధ్య తరగతి వరకు, ఆదాయపు పన్ను రాయితీ నుండి మౌలిక రంగం వరకు, తయారీ నుండి ఎంఎస్ఎంఇ వరకు, గృహ నిర్మాణం నుండి ఆరోగ్య సంరక్షణ వరకు, మరి అలాగే అభివృద్ధి పరం గా పెరిగిన వేగ గతి తో పాటు న్యూ ఇండియా వరకు బడ్జెటు ప్రతిపాదన లలో ప్రతిబింబించాయో అవి అనేక జీవితాల ను స్పర్శించాయని ప్రధాన మంత్రి అన్నారు.
పేదరికం సంకెళ్ల లో నుండి మరింత మంది బయటపడటాన్ని చూడటం బాగుంది అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన నవ మధ్య తరగతి పెరుగుతోంది, మరి అలాగే వారి కలలు కూడా వృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. దేశ నిర్మాణానికి వారు అందించినటువంటి ఉన్నతమైన తోడ్పాటుకు గాను మధ్య తరగతి ప్రజానీకానికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, పన్ను ల సంబంధిత రాయితీ అంశంపై మధ్య తరగతి కి ఆయన అభినందనలు తెలిపారు.
బడ్జెటు లోని రైతు ప్రయోజనకర కార్యక్రమాల ను గురించి ఆయన ప్రస్తావిస్తూ, సంవత్సరాల తరబడి రైతు ల కోసం అనేక కార్యక్రమాలను ఆరంభించడం జరిగినప్పటికీ దు:ఖకరమైన విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమాల పరిధి లోకి చాలా మంది రైతులు రానేలేదు అన్నారు. పిఎం కిసాన్ నిధి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం, ఇది 5 ఎకరాల లోపు భూమి ని కలిగివున్న రైతు లకు సహాయకారి కాగలదు అని ఆయన తెలిపారు. ‘న్యూ ఇండియా’ కోసం ఉద్దేశించిన బడ్జెట్ లో పశు పోషణ రంగం పట్ల, మత్స్య పరిశ్రమ పట్ల శ్రద్ధ వహించడం జరిగిందని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
అసంఘటిత రంగం యొక్క ప్రయోజనాల ను పరిరక్షించడానికి ప్రాముఖ్యం ఇచ్చినట్లు ఆయన వివరిస్తూ, పిఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన ఎంతో సహాయకారి కాగలదన్నారు. ఈ రంగం లోని వారి యొక్క ప్రయోజనాల ను మరింత గా కాపాడవలసిన ఆవశ్యత ఉంది, మరి ‘న్యూ ఇండియా’కై ఉద్దేశించిన బడ్జెట్ ఇదే పని ని చేసింది అని ఆయన వివరించారు. ఆయుష్మాన్ భారత్ యోజన తో పాటు సామాజిక భద్రత పథకాలు కూడా వారి జీవితాల ను స్పర్శించనున్నాయని ప్రధాన మంత్రి వివరించారు.
అభివృద్ధి యొక్క ప్రయోజనాలు సమాజం లో అన్ని వర్గాల ను చేరేలా చూడటం ఎంతైనా అవసరమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ‘‘ఈ బడ్జెటు పేదల కు సాధికారిత ను కల్పిస్తుంది, రైతు కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, అంతే కాకుండా ఆర్థిక వృద్ధి కి ప్రేరణ ను ఇస్తుంద’’ని ఆయన అన్నారు.