ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని సోలాపుర్ ను రేపు సందర్శించనున్నారు. అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే, వివిధ పథకాలకు శంకుస్థాపనలు చేస్తారు.
రహదారి రవాణా కు ఊతాన్ని అందించే చర్య లో భాగం గా ఎన్‌హెచ్-211 (కొత్త హెన్‌హెచ్-52)లో భాగంగా ఉన్న సోలాపుర్-తుల్జాపుర్-ఉస్మానాబాద్ లతో కూడిన నాలుగు దోవల సెక్షను ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. సోలాపుర్-ఉస్మానాబాద్ రాజమార్గాన్ని నాలుగు దోవ లు కలిగింది గా విస్తరించడం వల్ల మహారాష్ట్ర లో ప్రముఖమైనటువంటి మరాట్‌వాడా తో సోలాపుర్ కు సంధానాన్ని మెరుగుపరుస్తుంది.
సోలాపుర్-తుల్జాపుర్-ఉస్మానాబాద్ సెక్షన్ ను నాలుగు దోవలు కలిగినది గా చూపుతున్న మార్గం యొక్క రూప రేఖ
‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లో భాగం గా 30,000 ఇళ్ళ కు ప్రధాన మంత్రి శంకు స్థాపన చేయనున్నారు. ఈ గృహాలు ప్రధానంగా గృహ వసతి కి నోచుకోని చెత్త ను ఏరి వేసే వారు, రిక్షాల ను నడిపే వారు, వస్త్రాల తయారీ కార్ఖానా లలో పని చేస్తున్న వారు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారి ప్రయోజనాలకై ఉద్దేశించినటువంటివి. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం వ్యయం1,811.33 కోట్ల రూపాయలు గా ఉంది. ఇందులో నుండి 750 కోట్ల రూపాయల ను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఆర్థిక సహాయం గా అందిస్తారు.
ప్రధాన మంత్రి తన ‘స్వచ్ఛ్ భారత్’ దార్శనికత కు అనుగుణం గా సోలాపుర్ లో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ ను, మూడు మురుగు నీటి శుద్ధి ప్లాంటుల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఇది పట్టణానికి మురుగు నీటి సదుపాయం యొక్క పరిధి ని పెంచడం తో పాటు పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచగలుగుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి వ్యవస్థ స్థానం లో ఈ సరికొత్త వ్యవస్థ అందుబాటు లోకి రానుంది. ఇవి ఎఎమ్ఆర్‌యుటి (‘అమృత్’) మిశన్ లో భాగం గా ప్రధాన మురుగు కాల్వల కు జోడించబడనున్నాయి.
సోలాపుర్ స్మార్ట్ సిటీ లో ప్రాంత ఆధారిత అభివృద్ధి పథకం లో భాగంగా కంబైన్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంప్రూవ్ మెంట్ ఇన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ సిస్టమ్ కు కూడా ప్రధాన మంత్రి పునాదిరాయి ని వేయనున్నారు. అలాగే, ఉజాని ఆనకట్ట నుండి సోలాపుర్ సిటీ కి త్రాగునీటి సరఫరా ను పెంచే పథకానికి, మరి అలాగే ఎఎమ్ఆర్‌యుటి మిశన్ లో భాగం గా భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ కు సైతం ఆయన శంకుస్థాపన చేయనున్నారు. స్మార్ట్ సిటీ మిశన్ లో భాగం గా ఈ ప్రాజెక్టు కు 244 కోట్ల రూపాయల వ్యయాన్ని మంజూరు చేయడమైంది. పౌరుల కు చక్కని ఫలితాల ను అందించడం కోసం ఈ ప్రాజెక్టు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకొంటూ, సేవల అందజేత ను, ప్రజారోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరచగలుగుతుందని ఆశించడమైంది.
నగరం లో ఒక జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు. ఈ నగరాన్ని ప్రధాన మంత్రి సందర్శించడం ఇప్పటికి ఇది రెండో సారి. ఇంతకు ముందు, 2014వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీ నాడు ఆయన ఇక్కడ కు వచ్చినప్పుడు ఎన్‌హెచ్-9 లో భాగం గా ఉన్న సోలాపుర్– మహారాష్ట్ర/కర్నాటక సరిహద్దు సెక్షను ను నాలుగు దోవల మార్గం గా మలచేందుకుగాను శంకు స్థాపన చేయడంతో పాటు 765 కెవి సామర్ధ్యం కలిగినటువంటి సోలాపుర్- రాయచూర్ విద్యుత్తు ప్రసార మార్గాన్ని దేశ ప్రజలకు ఆయన అంకితం చేశారు.