గ్లాస్గో లో సి.ఓ.పి-26 నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ వ్లోదిమిర్ జెలెన్ స్కీ తో 2021 నవంబర్, 2వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
ఇరువురు నాయకులు ద్వైపాక్షిక సంబంధాల స్థితిని సమీక్షించడంతో పాటు, తమ తమ ప్రాంతాల్లోని పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లను ఇరు దేశాలు పరస్పరం గుర్తించుకోవడంతో సహా మహమ్మారి కాలంలో సహకారంపై వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కోవిడ్ మహమ్మారి రెండవ దశ సమయంలో, మానవతా దృష్టితో, భారతదేశానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ను సరఫరా చేసినందుకు, అధ్యక్షుడు జెలెన్ స్కీ కి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా ఉక్రెయిన్ లోని వివిధ విశ్వవిద్యాలయాలలో పెద్ద సంఖ్యలో చదువుతున్న భారతీయ విద్యార్థులతో సహా, ఇరు దేశాల్లోని వ్యక్తుల మధ్య నెలకొన్న బలమైన బంధాన్ని ఇద్దరు నేతలు సానుకూలంగా అంచనా వేశారు.
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పని చేసేందుకు తమ సంసిద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.
Провів чудову зустріч з Президентом Зеленським @ZelenskyyUa. Наші перемовини нададуть новий поштовх у розвитку дружби між Індією та Україною. pic.twitter.com/7dPQVyXXAn
— Narendra Modi (@narendramodi) November 2, 2021
Had a wonderful meeting with President @ZelenskyyUa. Our talks will give new vigour to the friendship between India and Ukraine. pic.twitter.com/toyT6ewEQA
— Narendra Modi (@narendramodi) November 2, 2021