గ్లాస్ గో లో 2021 నవంబరు 1 వ తేదీన సిఒపి26 ప్రపంచ నేతల శిఖర సమ్మేళనం జరిగిన నేపథ్యం లో యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
2. సిఒపి26 ను ఫలప్రదం గా నిర్వహించడం తో పాటు జలవాయు పరివర్తన తాలూకు ప్రభావాల ను తగ్గించడాని కి, అలాగే సదరు పరివర్తన తాలూకు ప్రభావాని కి తగ్గట్టు సర్దుబాటుల ను చేసుకోవడం కోసం ప్రపంచ వ్యాప్తం గా చేపట్టవలసిన కార్యాచరణ కు సమర్ధన ను కూడగట్టడం లో కూడాను వ్యక్తిగతం గా నాయకత్వాన్ని వహించినందుకు గాను ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ ను ప్రధాన మంత్రి అభినందించారు. క్లయిమేట్ ఫినాన్స్, గ్రీన్ హైడ్రోజన్ సంబంధి సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణ, సర్దుబాటు లు, నవీకరణ యోగ్య సాంకేతికత లు, స్వచ్ఛ సాంకేతికత ల వైపునకు మళ్ళడం వంటి అంశాల లో యుకె తో సన్నిహితం గా కృషి చేస్తామంటూ భారతదేశం పక్షాన వచన బద్ధత ను శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు.
3. రోడ్ మేప్ 2030 ప్రాథమ్యాల ఆచరణ లో, మరీ ముఖ్యం గా పెట్టుబడి, ఆర్థిక వ్యవస్థ, ప్రజా సంబంధాలు, ఆరోగ్యం, రక్షణ, ఇంకా భద్రత రంగాల లో ప్రాథమ్యాల ఆచరణ పై ఇద్దరు ప్రధానులు సమీక్ష ను చేపట్టారు. ఎఫ్ టిఎ సంప్రదింపుల ను మొదలు పెట్టే దిశ లో తీసుకొన్న చర్యలు సహా ఇన్ హేన్స్ డ్ ట్రేడ్ పార్ట్ నర్ శిప్ పరం గా ప్రగతి నమోదు కావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
4. అఫ్ గానిస్తాన్ పరిణామాలు, ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా పోరాడడం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, సరఫరా వ్యవస్థ కు సంబంధించి ఆటుపోటుల ను తట్టుకొని నిలబడటం వంటి ప్రాంతీయ, ప్రపంచ సవాళ్ళ తో పాటు కోవిడ్ అనంతర కాలం లో ప్రపంచ దేశాలు ఆర్థికం గా తిరిగి కోలుకోవడం గురించి కూడా ఇరువురు నేత లు చర్చించారు.
5. ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ కు త్వరలోనే భారతదేశం లో స్వాగతం చెప్పాలని ఉంది అంటూ ప్రధాన మంత్రి తన ఆశ ను మరొక్కమారు వ్యక్తం చేశారు.