బెంగళూరు మైసూరు ఎక్స్ ప్రెస్ వే కర్నాటక యొక్క అభివృద్ధి లో తోడ్పాటు ను అందిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
రహదారి రవాణా మరియు రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ యొక్క అనేక ట్వీటు లకు శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు. మంత్రి తన ట్వీట్ లలో బెంగళూరు మైసూరు ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అది శ్రీరంగపట్న, కూర్గ్, ఊటీ మరియు కేరళ వంటి ప్రాంతాల కు చేరుకోవడాన్ని మెరుగు పరుస్తూ ఆయా ప్రాంతాల పర్యటన సామర్థ్యాన్ని పెంపొందింపచేయాలి అనేదే అని తెలియ జేశారు.
పైన ప్రస్తావించిన ప్రాజెక్టు లో ఎన్ హెచ్-275 లో ఒక భాగం కలసి ఉంది. ఈ ప్రాజెక్టు లో నాలుగు రైలు ఓవర్ బ్రిడ్జి లు, తొమ్మిది ప్రముఖమైనటువంటి వంతెన లు, నలభై చిన్నపాటి వంతెనల తో పాటు మొత్తం 89 అండర్ పాస్ లు మరియు ఓవర్ పాస్ ల అభివృద్ధి కూడా భాగం గా ఉంటుంది అని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కర్నాటక యొక్క వృద్ధి ప్రస్థానాని కి తోడ్పాటు ను అందించేటటువంటి ఒక ముఖ్యమైన కనెక్టివిటీ ప్రాజెక్టు’’ అని పేర్కొన్నారు.
An important connectivity project which will contribute to Karnataka’s growth trajectory. https://t.co/9sci1sVSCB
— Narendra Modi (@narendramodi) March 10, 2023