చత్తీస్ గఢ్ కు చెందిన 21 ఏళ్ళ వయస్సు కలిగిన సంజయ్ వర్‌గె మ్ గుండె లో నొప్పి, గుండె దడ, తల తిరగడం, దగ్గు లతో పాటు, ఒకటి రెండు సంవత్సరాల క్రితం నుండి ఉద్రిక్తత కారణం గా తక్కువ స్థాయి లో మాత్రమే ఊపిరి పీల్చుకోవడం వంటి సమస్య లతో బాధపడుతూ, 2019వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ఆసుపత్రి లో చేరాడు.
పూర్తి పరీక్ష లు చేసిన అనంతరం అతడి కి గుండె లో డబల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ అవసరమని తేల్చడమైంది.
నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడం తో వైద్యుని ద్వారా సూచించబడిన రోగ చికిత్స కు అయ్యే వ్యయాన్ని అతడు భరించలేని పరిస్థితి. తత్ఫలితం గా అతడు అతడి కుటుంబం తో సహా ఆశలు వదలివేసుకొని, వారి గ్రామాని కి తిరిగి వచ్చారు. అయితే, వారు తిరిగి వచ్చిన తరువాత త్వరలోనే వారు పిఎం-జెఎవై ని గురించి తెలుసుకోగలిగారు. ఈ పథకం సంజయ్ కు, అతడి పరివారాని కి ఒక వరం వలె రుజువైంది. 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే శస్త్ర చికిత్స ను పిఎం-జెఎవై లో భాగం గా 2019 ఫిబ్రవరి 18వ తేదీ న ఉచితం గా నిర్వహించడమైంది.
అతడు ప్రస్తుతం నొప్పి ఏదీ లేకుండా, సంతోషదాయకమైనటివంటి మరియు ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాడు.
ఈ రోజు న అతడు ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి. అంతేకాదు, ప్రపంచం లో కెల్లా అతి పెద్దదైనటువంటి ఆరోగ్య పథకం యొక్క సాఫల్యాన్ని గురించి వివరించడం కోసం ప్రధాన మంత్రి తో భేటీ అయిన 31 మంది లబ్ధిదారుల లో సంజయ్ ఒకరు గా ఉన్నారు.
సరిగ్గా ఒక సంవత్సరం క్రితం 2018 లో ప్రారంభించబడిన ఆయుష్మాన్ భారత్ ప్రపంచం లోనే అతి భారీ ఆరోగ్య బీమా పథకం గా ఉంది. దేశం లోని 10.74 కోట్ల కు పైబడిన పేదల కు వైద్య సౌకర్యాలు సులభం గా అందుబాటు లోకి తీసుకురావాలనేదే ఈ పథకం ధ్యేయం గా ఉంది.
గడచిన సంవత్సర కాలం లో సంజయ్ వర్‌గెమ్ వంటి 50,000 మంది కి పైగా రోగులు వారి రాష్ట్రాని కి వెలుపల ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సౌకర్యాల ను పొందగలిగారు.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పిఎం-జెఎవై లో భాగం గా 16,085 ఆసుపత్రుల ను పట్టిక లో చేర్చుకొని 41 లక్షల మందికి పైగా లబ్ధిదారుల కు చికిత్స ను అందించడమైంది. అలాగే 10 కోట్ల ఇ-కార్డుల ను జారీ చేయడం జరిగింది.
దేశం అంతటా ఆయుష్మాన్ భారత్ లో భాగం గా 20,700 కన్నా అధికంగా హెల్త్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లను ప్రారంభించడమైంది.