ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు మరియు మహిళ ల శాఖ మంత్రి గౌరవనీయురాలు మారిస్ పాయనే గారు, ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి గౌరవనీయుడు శ్రీ పీటర్ డటన్ లు ఈ రోజు న భారతదేశానికి, ఆస్ట్రేలియా కు మధ్య ఒకటో మంత్రుల స్థాయి టూ ప్లస్ టూ సంభాషణ ముగిసిన వెంటనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న మర్యాదపూర్వకం గా సమావేశమయ్యారు.
టూ ప్లస్ టూ సంభాషణ సాగిన సందర్భం లో ఉపయోగకరమైనటువంటి చర్చ జరిపినందుకు గాను ఆస్ట్రేలియా కు చెందిన ఉన్నతాధికారుల ను ప్రధాన మంత్రి ప్రశంసల ను వ్యక్తం చేస్తూ ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మకంగా చూస్తే సమానమైన అభిప్రాయాల ఒక సంకేతం గా నిలచిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
సమావేశం సాగిన క్రమం లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. వాటి లో ద్వైపాక్షిక వ్యూహాత్మక సహకారాన్ని, ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత గా విస్తరించుకొనేందుకు గల అవకాశాలు, ఇండో- పసిఫిక్ ప్రాంతం పట్ల ఉభయ దేశాల తాలూకు సమాన దృష్టికోణం, ఇరు పక్షాల కు మధ్య ఒక మానవ సేతువు గా ఆస్ట్రేలియా లోని భారతీయ సముదాయానికి పెరుగుతున్నటువంటి ప్రాముఖ్యం వంటి అంశాలు కూడా ఉన్నాయి.
కిందటి సంవత్సరం లో ఇరు దేశాల మధ్య ఏర్పరచుకొన్న విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని శరవేగం గా ముందుకు తీసుకుపోవడం లో ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ పోషిస్తున్న పాత్ర ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. ప్రధాని శ్రీ మారిసన్ ను ఆయనకు ఉండే వీలు ను బట్టి వీలైనంత త్వరలో భారతదేశాన్ని సందర్శించేందుకు తరలి రావలసింది గా శ్రీ నరేంద్ర మోదీ తన ఆహ్వానాన్ని పునరుద్ఘాటించారు.