ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సంబంధించిన ఆధికారిక వెబ్‌సైట్ www.pmindia.gov.in యొక్క అస్సామీ మరియు మణిపురి భాషల తాలూకు అనువాదాలను నేడు ప్రారంభించడం జరిగింది. అస్సామ్ మరియు మణిపుర్ రాష్ట్రాల పౌరుల అభ్యర్థనలకు అనుగుణంగా ఆయా భాషలలో ఈ వెబ్ సైట్ లోకి ప్రవేశించే సౌలభ్యం ప్రస్తుతం సాధ్యపడుతుంది.
నేటి ప్రారంభం దరిమిలా PMINDIA వెబ్‌సైట్ ప్రస్తుతం ఇంగ్లీషు, హిందీ లతో పాటు, 11 ప్రాంతీయ భాషలలో.. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ మరియు తెలుగు భాష లలో.. దొరుకుతుందన్న మాట.
ఈ 11 ప్రాంతీయ భాషా వెబ్‌సైట్ లను దిగువన పేర్కొన్న లింకుల లోకి వెళ్ళి, చూడవచ్చు:
అస్సామీ: https://www.pmindia.gov.in/asm/
బెంగాలీ: https://www.pmindia.gov.in/bn/
గుజరాతీ: https://www.pmindia.gov.in/gu/
కన్నడ: https://www.pmindia.gov.in/kn/
మరాఠీ: https://www.pmindia.gov.in/mr/
మళయాళం: https://www.pmindia.gov.in/ml/
మణిపురి: https://www.pmindia.gov.in/mni/
ఒడియా: https://www.pmindia.gov.in/ory/
పంజాబి: https://www.pmindia.gov.in/pa/
తమిళం: https://www.pmindia.gov.in/ta/
తెలుగు: https://www.pmindia.gov.in/te/
ప్రజల చెంతకు వెళ్ళి వారి సొంత భాషలో సందేశాలను పంపే దిశగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలలో ఒక భాగమే తాజా చొరవ. ఇది ప్రజా సంక్షేమం, ఇంకా అభివృద్ధిలకు సంబంధించిన వేరు వేరు అంశాలపై దేశం లోని అన్ని ప్రాంతాల ప్రజలకు మరియు ప్రధాన మంత్రికి మధ్య సాన్నిహిత్యాన్ని ఇనుమడింపజేస్తుందన్న అంచనా ఉంది.