QuoteIndia-ASEAN partnership may be just 25 years old. But, India’s ties with Southeast Asia stretch back more than two millennia: PM
QuoteIndia's free trade agreements in ASEAN region are its oldest and among the most ambitious anywhere, says the PM
QuoteOver six-million-strong Indian diaspora in ASEAN- rooted in diversity & steeped in dynamism - constitutes an extraordinary human bond: PM

ఆసియాన్‌, భార‌త్‌ భాగస్వామ్యం పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, త‌న అబిప్రాయాల‌ను ఆసియాన్‌- భార‌త్ ప‌ర‌స్ప‌ర విలువలు,ఉమ్మ‌డి ల‌క్ష్యం “అనే శీర్షికన ఒక వ్యాసంలో తెలిపారు.. ఈ వ్యాసం ఆసియాన్‌ సభ్య దేశాల నుండి ప్ర‌చురిత‌మ‌య్యే

ప్రముఖ దినపత్రికలలో ప్రచురించబడింది. ఈ వ్యాసానికి తెలుగు సంక్షిప్త అనువాదం దిగువ‌న చూడ‌వ‌చ్చు.
ఆసియాన్‌- భార‌త్ ప‌ర‌స్ప‌ర విలువలు,ఉమ్మ‌డి ల‌క్ష్యం : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ
ఇవాళ‌, ఆసియాన్ దేశాల‌కు చెందిన ప‌ది మంది ప్రియ‌మైన‌ నాయ‌కులకు భార‌త గ‌ణ‌తంత్ర‌దినోత్స‌వం నాడు దేశ రాజ‌ధాని కొత్త‌ఢిల్లీలో ఆతిత్యం ఇచ్చే గౌర‌వం 125 కోట్ల మంది భార‌తీయుల‌కు ల‌భించింది. 
పాతికేళ్ల ఆసియాన్‌ భార‌త్ సంబంధాల‌కు గుర్తుగా గురువారం నాడు వారికి ఆతిథ్యం ఇచ్చే అవ‌కాశం నాకు ద‌క్కింది. వీరంద‌రూ మ‌న‌తో ఉండ‌డం మునుపెన్న‌డూ లేని రీతిలో ఆసియాన్ దేశాల సుహృద్భావ వ్య‌క్తీక‌ర‌ణ‌కు నిద‌ర్శనంగా చెప్పుకోవ‌చ్చు.

ఇందుకు ప్ర‌తిగా వారికి ఈ చ‌లికాల‌పు ఉద‌య‌పువేళ స్నేహ‌పూర్వ‌క ఆత్మీయ‌స్వాగ‌తం ప‌లికేందుకు భార‌త‌దేశ ప్ర‌జ‌లుముందుకు వ‌చ్చారు. 
ఇది సామాన్య ఘ‌ట‌న కాదు. మాన‌వ‌జాతిలో నాలుగోవంతు క‌లిగిన 1.9 బిలియ‌న్ల మంది ప్ర‌జ‌లకు సంబంధించి ఇండియా, ఆసియాన్ దేశాలు త‌మ మ‌ధ్య ప‌టిష్ట‌మైన భాగ‌స్వామ్యంతో సాగించిన యాత్ర‌కు సంబంధించి ఇది ఒక చ‌రిత్రాత్మ‌క

మైలురాయిగా చెప్పుకోవ‌చ్చు.
ఇండియా, ఆసియాన్ భాగ‌స్వామ్యం కేవ‌లం 25 సంవ‌త్స‌రాలే కావ‌చ్చు.కాని, ఆగ్నేయాసియా దేశాల‌తో భార‌త్ సంబంధాలకు రెండు వేల ఏళ్ల‌కు పైగానే చ‌రిత్ర ఉంది. శాంతి, స్నేహం, మ‌తం, సంస్కృతి, వాణిజ్యం, భాష‌, సాహిత్యం వంటి ఎన్నో బంధాలు

ఇప్ప‌టికీ భార‌త‌, ఆగ్నేయాసియా దేశాల‌కు చెందిన వివిధ రంగాల‌లో బ‌హుముఖీనంగా మ‌నం ద‌ర్శించ‌వ‌చ్చు. ఇది ఈ రెండు ప్రాంతాల‌లో ఒక సానుకూల త‌ను ఒక ప్ర‌త్యేక‌త‌ను సూచిస్తుంది. రెండు ద‌శాబ్దాలకు ముందుగానే భార‌త‌దేశం భ్ర‌హ్మాండ‌మైన

మార్పుల‌తో ప్ర‌పంచానికి స్వాగ‌త ద్వారాలు తెరిచింది. శ‌తాబ్దాలుగా కొన‌సాగుతున్న సంబంధాల‌కు అనుగుణంగానే అది తూర్పు దేశాల‌వైపు చూసింది. ఆ ర‌కంగా భార‌త దేశ ప్ర‌యాణం తూర్పు దేశాల‌తో సంబంధాల‌ను తిరిగి కొన‌సాగించే దిశ‌గా సాగింది.

భార‌త‌దేశానికి సంబంధించినంత వ‌ర‌కు ఆసియాన్ నుంచి తూర్పు ఆసియా దేశాలు అటు నుంచి అమెరికా వ‌ర‌కు ప్ర‌ధాన భాగ‌స్వామ్య దేశాలు, మార్కెట్లు తూర్పు వైపు ఉన్నాయి. ఆగ్నేయాసియా, ఆసియాన్ డేశాలు మ‌న‌కు భూ, స‌ముద్ర త‌ల

మార్గాల‌కు సంబంధించిన ఇరుగు పొరుగుదేశాలు. ఇవి మ‌న ప్రాక్ దిశా వీక్ష‌ణం (లుక్ ఈస్ట్ )విధానానికి స్ప్రింగ్ బోర్డ్ వంటివి. మూడు సంవ‌త్స‌రాలుగా ఇవి యాక్ట్ ఈస్ట్ పాల‌సీకి స్ప్రింగ్ బోర్డు గా ఉన్నాయి.
.ఆ దిశ‌గా, ఆసియాన్‌,భార‌త్‌లు చ‌ర్చ‌ల‌లో భాగ‌స్వామ్య‌ప‌క్షాల స్థాయినుంచి వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య‌ప‌క్షాల స్థాయికి ఎదిగాయి. మ‌నం మ‌న విశాల ప్రాతిప‌దిక‌గ‌లిగిన భాగ‌స్వామ్యాన్ని 30 విధాలుగా ముందుకు తీసుకుపోతున్నాం. ప్ర‌తి ఆసియాన్

స‌భ్య‌దేశంతో మ‌న‌కు నానాటికీ విస్తృతమౌతున్న దౌత్య‌, ఆర్థిక‌, భ‌ద్ర‌తాప‌ర‌మైన సంబంధాలున్నాయి.మ‌న స‌ముద్రాలు సుర‌క్షితంగా,భ‌ద్రంగా ఉండేందుకు మ‌నం క‌ల‌సి కృషి చేస్తున్నాం.
మ‌న వాణిజ్య‌, పెట్టుబ‌డుల ప్ర‌వాహం ఎన్నోరెట్లు పెరిగింది. ఆసియాన్‌, మ‌న భార‌త‌దేశపు నాలుగ‌వ అతిపెద్ద వాణిజ్య భాగ‌స్వామి.ఆసియాన్ ఇండియా ఏడ‌వ అతిపెద్ద భాగ‌స్వామి.
భార‌త‌దేశంనుంచి వెలుప‌ల‌కు వెళ్లే పెట్టుబడుల‌లో 20 శాతం పెట్టుబ‌డులు ఆసియాన్‌కు వెళ‌తాయి. ఆసియాన్

భార‌త దేశ‌పు పెట్టుబ‌డుల‌కు ప్ర‌ధాన మార్గం. ఇందుకుసింగ‌పూర్ ముందు స్థానంలో ఉంది. భార‌త దేశ‌పు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఈప్రాంతంలో అతిప్రాచీన‌మైన‌వి. ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా లేని రీతిలో ఎన్నో ఆశ‌లు ఆకాంక్ష‌ల‌తో ముందుకు పోతున్న‌ది.
ఇండియా, ఆసియాన్‌మ‌ధ్య వైమాన‌యాన బంధం శ‌ర‌వేగంతో విస్త‌రింప‌బ‌డింది. జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణా కొన‌సాగుతోంది. ఇది ఆగ్నేయాసియా వ‌ర‌కు అత్యంత ప్రాధాన్య‌త‌తో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. నానాటికీ పెరుగుతున్న క‌నెక్టివిటీ ద‌గ్గ‌రిత‌నాన్ని

బ‌లోపేతం చేస్తోంది. ఆగ్నేయాసియాలో శ‌ర‌వేగంతో ప‌ర్యాట‌క అవకాశాలు వృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రాంతంలోని 60 ల‌క్ష‌ల మందికిపైగా భార‌తీయ‌సంత‌తి వారు ఉండ‌డం, వైవిధ్యం క‌లిగి ఉండ‌డం, డైన‌మిజం వంటివి ఈ దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య

అత్య‌ద్భుత‌మైన మానవ బంధాన్ని ఏర్పాటు చేస్తోంది.

ఆసియాన్ స‌భ్య‌దేశాల‌పై ప్ర‌ధాన‌మంత్రి త‌న అభిప్రాయాల‌ను ఇలా వ్య‌క్తం చేశారు.
థాయిలాండ్‌
ఆసియాన్‌లో థాయిలాండ్ ప్ర‌ముఖ వాణిజ్య భాగ‌స్వామిగా ఉంది. అలాగే ఆసియాన్ నుంచి భార‌త దేశంలో ప్ర‌ధాన పెట్టుబ‌డి దారుగా ఉంది. గ‌త ద‌శాబ్ద కాలంలో ఇండియా,థాయిలాండ్ మ‌ధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కంటే ఎక్కువ అయింద‌. ఇండియా, థాయిలాండ్ మ‌ధ్య సంబంధాలు ప‌లు రంగాల‌కు విస్తృతంగా విస్తరించాయి. ద‌క్షిణ‌, ఆగ్నేయాసియాల‌ను అనుంసంధానం చేసే కీల‌క ప్రాంతాయ భాగస్వామిగా మ‌నం ఉన్నాం.మ‌నం ఏసియాన్‌, తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర‌స‌ద‌స్సు, బిమ్‌స్టెక్ ల‌తో మ‌నం స‌న్నిహిత స‌హ‌కారం క‌లిగి ఉన్నాం. మెకాంగ్ గంగా స‌హ‌కారం, ఆసియా స‌హ‌కార చ‌ర్చ‌లు, ఇండియ‌న్ ఆసియ‌న్ రిమ్ అసోసియేష‌న్ ఫ్రేమ్ వ‌ర్క్‌లో మ‌నం ఉన్నాం. థాయిలాండ్ ప్ర‌ధాన‌మంత్రి 2016లో భార‌త దేశంలో జ‌రిపిన ప‌ర్య‌ట‌న ద్వైపాక్షిక సంబంధాల‌పై చిర‌కాల ప్ర‌భావాన్ని చూపింది.
థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అద్య‌ల్‌య‌దేజ్ మ‌ర‌ణంప‌ట్ల థాయ్ సోద‌ర సోద‌రీమ‌ణుల బాధ‌ను దేశం యావ‌త్తు పంచుకుంది. కొత్త రాజు ప‌రిపాల‌న‌లో థాయిలాండ్ సుభిక్షంగా, 
శాంతియుతంగా వెలుగొందాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేస్తున్న మిత్రుల‌తో క‌లిసి భార‌త్‌కూడా రాజు మ‌హా వ‌జ్ర‌లోంగ్‌కోర్న్ బోదిన్‌ద్ర‌దేబ‌య‌ర‌న్‌గ్‌కున్ ప‌రిపాల‌న చిర‌కాలం సాగాల‌ని ఆకాంక్షించింది.

వియ‌త్నాం

సంప్ర‌దాయకంగా భార‌త్ ,వియ‌త్నాంల మ‌ధ్య సౌహార్ధ సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలూ విదేశీ పాల‌కుల‌నుంచి స్వాతంత్ర్యం సాధించేందుకు జాతీయ స్వాతంత్ర్య పోరాటం నిర్వ‌హించిన‌ ఉమ్మ‌డి చారిత్రక చ‌రిత్ర క‌లిగి ఉన్నాయి. మ‌హాత్మాగాంధీ, హోచిమిన్ వంటి నాయ‌కులు వ‌ల‌స‌పాల‌న‌కు వ్య‌తిరేకంగా వీరోచిత పోరాటం సాగించారు. 2007లో వియ‌త్నాం ప్ర‌ధాని నుయెన్ తాన్ డుంగ్ భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మ‌న దేశం వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య ఒప్పందంపై సంత‌కాలు చేసింది. ఈ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం 2016లో నేను వియ‌త్నాం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేనాటికి స‌మ‌గ్ర వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం స్థాయికి ఎదిగింది. 
వియ‌త్నాంతో భార‌త‌దేశ సంబంధాలు ఆర్థిక‌, వాణిజ్య సంబంధాల పెరుగుద‌ల‌తో కీల‌క పాత్ర‌ను సంత‌రించుకుంటున్నాయి. భార‌త‌దేశం, వియ‌త్నాం మ‌ధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో ప‌ది రెట్లు పెరిగింది. ర‌క్ష‌ణ రంగంలో ప‌రస్ప‌ర స‌హ‌కారం ఇండియా, వియ‌త్నాంల మ‌ధ్య కీల‌క భాగ‌స్వామ్యంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. ఇండియా, వియ‌త్నాంల మ‌ధ్య శాస్త్ర , సాంకేతిక రంగాల‌లో స‌హ‌కారం కూడా మ‌రో కీల‌క‌మైన అంశం.

మ‌య‌న్మార్‌
ఇండియా, మ‌య‌న్మార్‌లు స‌ముద్ర తీర స‌రిహ‌ద్దుతోపాటు 1600 కిలోమీట‌ర్ల‌కుపైగా భూ స‌రిహ‌ద్దులు క‌లిగి ఉన్నాయి. మ‌న ఉమ్మ‌డి బౌద్ధ సంస్కృతి, సోద‌ర భావం, మ‌త‌, సాంస్కృతిక సంబంధాలు రెండు దేశాల‌ను అత్యంత స‌న్నిహితం చేస్తున్నాయి. ష్యూడ‌గాన్ ప‌గోడా ట‌వ‌ర్‌కు మించి అత్య‌ద్భుతంగా, గొప్ప‌గా వెలుగొందేది మ‌రొకటి ఉండ‌దు. బ‌గాన్‌లోని ఆనంద ఆల‌యం పునరుద్ధ‌ర‌ణ‌లో ఆర్కియ‌లాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా స‌హ‌కారం ఉభ‌య దేశాల సంస్కృతిని మ‌రింత పెంపొందించేదే.
వ‌ల‌స పాల‌న కాలంలో మ‌న నాయ‌కుల మ‌ధ్య రాజ‌కీయ బంధం బ‌లంగా విల‌సిల్లింది. దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన పోరాటంలో ఐక్య‌త ,ఆశావ‌హ దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించారు. గాంధీజీ యాంగ్యాన్‌ను ప‌లుమార్లు సంద‌ర్శించారు. బాల‌గంగాధ‌ర తిల‌క్ ను ప‌లుసార్లు యాంగ్యాన్‌కు డిపోర్ట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ భార‌త స్వాతంత్ర్య‌సాధ‌న ల‌క్ష్యంతో మ‌య‌న్మార్‌లో ఎంద‌రినో క‌దిలించారు.

గ‌త ద‌శాబ్ద‌కాలంలో భార‌త్‌, మ‌య‌న్మార్‌ల మ‌ధ్య వాణిజ్యం దాదాపు రెట్టింపు అయింది. మ‌న పెట్టుబ‌డి బంధం కూడా ఉజ్వ‌ల‌మైన‌ది. మ‌య‌న్మార్‌తో భార‌త దేశ బంధంలో అభివృద్ధి స‌హ‌కారం కీల‌క పాత్ర పోషిస్తున్న‌ది. ఈ స‌హాయం ప్ర‌స్తుతం సుమారు 1.73 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు ఉంది. భార‌త దేశ పార‌దర్శ‌క అభివృద్ధి స‌హ‌కారం, మ‌య‌న్మార్ జాతీయ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా ఉండ‌డ‌మే కాకుండా , ఏసియాన్ అనుసంధానం ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా ఇది ఉంది.
సింగపూర్‌
ఇండియా ఈ ప్రాంత సంబంధాల‌కు సింగ‌పూర్ ఒక గ‌వాక్షం లాంటింది. అలాగే ఈ ప్రాంత ప్ర‌గ‌తి, ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌కు కూడా గ‌వాక్షం లాంటిది. ఇండియా, ఆసియాన్‌ల‌కు సింగ‌పూర్ ఒక వార‌ధిలాంటిది.

సింగ‌పూర్ ప్ర‌స్తుతం తూర్పున‌కు గేట్‌వే లాంటిది. ఇది మ‌న ప్రముఖ ఆర్థిక భాగ‌స్వామి. ప్ర‌ధాన అంత‌ర్జాతీయ వ్యూహాత్మ‌క భాగ‌స్వామిగా ఉంటోంది. వివిధ అంత‌ర్జాతీయ వేదిక‌లు, ప‌లు ప్రాంతీయ స‌భ్య‌త్వాల‌లో ఇది ప్ర‌తిఫ‌లిస్తోంది. సింగ‌పూర్‌, ఇండియాలు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం క‌లిగి ఉంది. మ‌న రాజ‌కీయ సంబంధాలు ప‌ర‌స్ప‌ర విశ్వాసం, గుడ్‌విల్ తో బ‌లంగా ఉన్నాయి. మ‌న ర‌క్ష‌ణ బంధం ఇరు దేశాల‌కుసంబంధించి బ‌లంగా ఉన్నాయి. మ‌న ఆర్థిక భాగ‌స్వామ్యం రెండు దేశాల‌లోని ప్ర‌తి ప్రాధాన్య‌తా రంగంతో ముడిప‌డి ఉన్నాయి. సింగ‌పూర్ పెట్టుబ‌డుల కేంద్రంగా, గ‌మ్యంగా ఉంటూ వ‌స్తోంది.

వేలాది భార‌తీయ కంపెనీలు సింగ‌పూర్‌లో రిజిస్ట‌ర్ అయ్యాయి.
16 భార‌తీయ న‌గ‌రాల నుంచి సింగ‌పూర్‌కు ప్ర‌తి వారం నేరుగా 240 కిపైగా విమానాలు న‌డుస్తున్నాయి.సింగ‌పూర్ సంద‌ర్శించే ప‌ర్యాట‌కుల‌లో మూడ‌వ అతిపెద్ద గ్రూప్ భార‌తీయులే.
సింగ‌పూర్‌కు చెందిన బ‌హుళ సాంస్కృతికత‌, ప్ర‌తిభ‌కు గౌరవం, చురుకైన భార‌తీయ క‌మ్యూనిటీ ఇరు దేశాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి దోహ‌దం చేస్తున్నాయి.
ఫిలిప్పీన్స్‌
రెండు నెల‌ల క్రితం నేను ఫిలిప్పీన్స్ ప‌ర్య‌ట‌న‌ను సంతృప్తి క‌రంగా పూర్తి చేశాను. దీనికి తోడు ఆసియాన్‌- ఇండియా, ఇఎఎస్ సంబంధిత స‌మావేశాల‌కు హాజ‌రుకావ‌డంతోపాటు అధ్య‌క్షుడు డుటెర్టేను క‌లుసుకోవ‌డం సంతోషం క‌లిగించింది. మా మ‌ధ్య విస్తృత చ‌ర్చ‌లు జ‌రిగాయి. స‌మ‌స్య‌లు లేని రీతిలో రెండు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను ఎలా మ‌రింత ముందుకు తీసుకుపోవాల‌న్న అంశంపై చ‌ర్చ‌లు జ‌రిపాం. సేవ‌లు, అభివృద్ధి రేట్ల విష‌యంలో మేం ఎంతో బ‌లంగా ఉన్నాం. మ‌న అభివృద్ధి రేట్లు ఇత‌ర ప్ర‌ధాన దేశాల‌తో పోల్చి చూసిన‌పుడు గ‌రిష్ఠ‌స్థాయిలో ఉన్నాయి. మ‌న వ్యాపార‌, వాణిజ్య శ‌క్తి ఆశాజ‌న‌కంగా ఉంది.
అధ్య‌క్షుడు టుటెర్టీ స‌మ్మిళ‌త అభివృద్ధికి, అవినీతి వ్య‌తిరేకంగా పోరాటానికి చూపుతున్న‌చిత్త‌శుధ్దిని నేను అభినందిస్తున్నాను. రెండు దేశాలూ ఈ విష‌యాల‌లో క‌లిసి ప‌నిచేయ‌గ‌లుగుతాయి. యూనివ‌ర్స‌ల్ ఐడి కార్డుల విష‌యంలో, ఆర్థిక స‌మ్మిళితం, బ్యాంకింగ్ రంగాన్ని అంద‌రికీ అందుబాటులోకి తీసుకురావ‌డం, ల‌బ్దిదారుల‌కు నేరుగా ప్ర‌యోజ‌నాల‌ను బ‌దిలీ చేయ‌డం,న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డం వంటి అంశాల విష‌యంలో మ‌నం మ‌న‌ అనుభ‌వాల‌ను ఫిలిప్పీన్స్‌తో పంచుకోవ‌డానికి సంతోషంగా ఉంది. చౌక‌ధ‌ర‌ల‌లో మందుల‌ను అందుబాటులో ఉంచ‌డం పిలిప్పీన్స్ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌తా అంశం. ఈ దివ‌గా మ‌నం మ‌న స‌హ‌క‌రిస్తున్నాం. ముంబాయినుంచి మ‌రావి, ఉగ్ర‌వాదానికి స‌రిహ‌ద్దులు ఉండ‌వు. మ‌నం ఉభ‌య‌దేశాలు ఎదుర్కొంటున్న స‌వాళ్ల విష‌యంలో మ‌నం మ‌న స‌హ‌కారాన్ని విస్తృతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.
మ‌లేసియా
భార‌త్‌,మ‌లేసియా దేశాల మ‌ధ్య స‌మ‌కాలీన సంబంధాలు విస్తృతంగా, వివిధ‌రంగాల‌కు విస్త‌రించి ఉన్నాయి. మ‌లేషియా, భార‌త దేశం ప‌ర‌స్ప‌రం వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని క‌లిగి ఉన్నాయి. మ‌నం ప్రాంతీ, బ‌హుళ‌ప‌క్ష వేదిక‌ల‌లో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాం. మ‌లేసియా ప్ర‌ధాన‌మంత్రి 2017లో మ‌న‌దేశంలో ప‌ర్య‌టించారు.వారి ప‌ర్య‌ట‌న ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల‌పై చిర‌కాల ప్ర‌భావాన్ని చూపేదిగా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.
ఆసియాన్‌లో భార‌త‌దేశ‌పు మూడ‌వ అతిపెద్ద వాణిజ్య భాగ‌స్వామిగా మ‌లేసియా ఎదిగింది. ఆసియాన్ నుంచి ప్ర‌ధాన పెట్టుబ‌డి దారుల‌లో ఒక‌టిగా ఉంది. గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో ఇండియా, మ‌లేసియాల మ‌ధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు రెట్ల‌కుపైగా పెరిగింది. ఇండియా, మ‌లేసియాలు ద్వైపాక్షిక స‌మ‌గ్ర ఆర్థిక స‌హ‌కార ఒప్పందాన్ని 2011 నుంచి క‌లిగి ఉన్నాయి. ఈ ఒప్పందం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. దీనిక కార‌ణం, ఇరువైపులా ఏసియాన్‌కుతోడు అద‌న‌పు హామీలు వాణిజ్యం, స‌ర‌కుల‌కుసంబంధించి అందించ‌డం జ‌రిగింది. ట్రేడ్ , సేవ‌ల‌కు సంబంధించి ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌కు మించి ఆఫ‌ర్లు ఇవ్వ‌డం జ‌రిగింది. స‌వ‌రించిన డ‌బుల్ టాక్సేష‌న్ మిన‌హాయింపు ఒప్పందంపై 2012 మేలోఇరుదేశాల మ‌ధ్య సంత‌కం జ‌రిగింది. క‌స్ట‌మ్స్ స‌హ‌కారానికి సంబంధించిన అవ‌గాహ‌నా ఒప్పందంపై 2013లో సంత‌కాలు జ‌రిగాయి. ఇది మ‌న వాణిజ్యం పెట్టుబ‌డుల రంగంలో స‌హ‌కారాన్ని మ‌రింత సౌక‌ర్య‌వంతం చేస్తుంది.

బ్రూనై
ఇండియా , బ్రూనైల మ‌ధ్య గ‌త ద‌శాబ్ద కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు రెట్టింపు అయింది. ఇండియా, బ్యూనైలు ఐక్య‌రాజ్య‌స‌మితి, నామ్‌, కామ‌న్‌వెల్త్‌, ఎ.ఆర్‌.ఎఫ్ తదిత‌ర సంస్థ‌ల‌లో ఉమ్మ‌డి స‌భ్య‌త్వాన్ని పంచుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఇరు దేశాల‌మ‌ధ్య సాంస్కృతిక‌,సంప్ర‌దాయ సంబంధాలున్నాయి.ప‌లు అంత‌ర్జాతీయ అంశాల‌పై బ్రూనై, ఇండియాలు దాదాపు ఒకేతీరు అభిప్రాయాలు క‌లిగి ఉన్నాయి.బ్రూనై సుల్తాన్ 2008 మేలో భార‌త్‌లో ప‌ర్య‌టించారు. ఇది ఇండియా ,బ్రూనై సంబంధాల‌లో చ‌రిత్రాత్మ‌క‌మైన‌ది. భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి 2016 ఫిబ్ర‌వ‌రిలో బ్రూనై సంద‌ర్శించారు.
లావో పిడిఆర్

భారతదేశానికి, లావో పిడిఆర్ కు మధ్య ఉన్న సంబంధాలు అనేక రంగాలకు విస్తారంగా వ్యాపించివున్నాయి. లావో పిడిఆర్ లో వ్యవసాయ రంగంలోను మరియు విద్యుత్తు ప్రసార రంగంలోను భారతదేశం చురుకుగా పాలుపంచుకొంటోంది. ఇవాళ, భారతదేశం మరియు లావో పిడిఆర్ లు పలు బహుళ పార్శ్వ వేదికలతో పాటు ప్రాంతీయ వేదికలలో పరస్పరం సహకరించుకొంటున్నాయి.

భారతదేశానికి, లావో పిడిఆర్ కు మధ్య వ్యాపారం ఇప్పటికీ ఇంకా ఉండవలసినంత స్థాయి కన్నా తక్కువ స్థాయిలోనే ఉండగా, భారతదేశం డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ స్కీములను లావో పిడిఆర్ కు వర్తింపచేసింది. లావో పిడిఆర్ నుండి భారతదేశానికి ఎగుమతులను ప్రోత్సహించడం ఈ చర్య లో పరమార్థం. సేవల సంబంధిత వ్యాపార రంగంలో సైతం విస్తృతమైన అవకాశాలు మా వద్ద ఉన్నాయి. ఇవి లావో పిడిఆర్ యొక్క ఆర్థిక వ్యవస్థను నిర్మించే ప్రక్రియలో తోడ్పడుతాయి. ఆసియాన్ ఇండియా సర్వీసెస్ అండ్ ఇన్ వెస్ట్ మెంట్ అగ్రిమెంట్ ను అమలుపరచడం మన సేవల వ్యాపార రంగానికి ఊతాన్ని అందించగలుగుతుంది.

ఇండొనేశియా

హిందు మహాసముద్రంలో భారతదేశానికి, ఇండొనేశియా కు మధ్య అంతరం కేవలం 90 నాటికల్ మైళ్లు. ఈ ఇరు దేశాలు రెండు సహస్రాబ్దుల కు పైగా విస్తరించినటువంటి నాగరకతాపరమైన బంధాన్ని కలిగివున్నాయి.

అది ఒడిశాలో ఏటా నిర్వహించే బలిజాతర కానివ్వండి, లేదా రామాయణం లేదా మహాభారతం వంటి ఇతిహాసాలు కానివ్వండి.. ఇవి యావత్తు ఇండొనేశియా లో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ సాంస్కృతిక నాళాలు ఆసియా లోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్యాల ప్రజానీకాన్ని బొడ్డు తాడు వలె పెనవేశాయి.

‘భిన్నేక తుంగల్’ లేదా భిన్నత్వంలో ఏకత్వం సైతం ఉభయ దేశాలు సంబరపడేటటువంటి ఉమ్మడి సాంఘిక విలువలలో ఒక కీలక పార్శ్వంగా ఉంటోంది. అంతేకాక, ఉమ్మడి ప్రజాస్వామిక విలువలలో ఒకటిగాను, న్యాయ సూత్రంగాను కూడా ఇది అలరారుతోంది. ప్రస్తుతం, వ్యూహాత్మక భాగస్వాములమైన మన దేశాల సహకారం రాజకీయ, ఆర్థిక, రక్షణ మరియు భద్రత, సాంస్కృతిక రంగాలతో పాటు ప్రజా సంబంధాల రంగానికి కూడా వ్యాపించింది. ఆసియాన్ లో మాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఇండొనేశియా ఉంటోంది. భారతదేశానికి, ఇండొనేశియాకు మధ్య ద్వైపాక్షిక వ్యాపారం గత పది సంవత్సరాలలో 2.5 రెట్ల మేరకు పెరిగింది. 2016లో అధ్యక్షులు శ్రీ జోకో విడోడో భారతదేశంలో జరిపిన ఆధికారిక పర్యటన ద్వైపాక్షిక సంబంధాలపైన చిరకాల ప్రభావాన్ని ప్రసరించింది.

కంబోడియా

భారతదేశానికి, కంబోడియా కు మధ్య నెలకొన్న సాంప్రదాయకమైన మరియు స్నేహపూర్వకమైన సంబంధాలు నాగరకత పరంగా చూస్తే బాగా లోతుగా వేళ్లూనుకొన్నటువంటివి. అంకోర్ వాట్ దేవాలయ భవ్య నిర్మాణం మన ప్రాచీన చారిత్రక, మత సంబంధ మరియ సంస్కృతి పరమైన లంకెలకు ఒక స్తవనీయ నిదర్శనం. 1986-1993 కాలంలో అంకోర్ వాట్ దేవాలయ పునరుద్ధరణను, పరిరక్షణ ను చేబూనడం భారతదేశానికి గర్వకారణమైనటువంటి విషయం. ప్రస్తుతం కొనసాగుతున్న తా- ప్రోమ్ దేవాలయ పునరుద్ధరణ పనులలోనూ ఈ విలువైన అనుబంధాన్ని భారతదేశం ముందుకు తీసుకుపోతోంది.

ఖ్మేర్ రూజ్ హయాం పతనానంతరం, 1981లో నూతన సర్కారును గుర్తించిన మొట్టమొదటి దేశం భారతదేశం. ప్యారిస్ శాంతి ఒప్పందంతోను మరియు 1991లో ఆ ఒప్పందం ఖాయం కావడంలోను భారతదేశం సంబంధాన్ని కలిగి ఉండింది. ఈ మైత్రి తాలూకు సంప్రదాయక బంధాలు ఉన్నత స్థాయి అధికారుల రాకపోకలతో పటిష్టం అయ్యాయి. సంస్థాగత వనరుల నిర్మాణం, మానవ వనరుల వికాసం, అభివృద్ధి పథకాలు మరియు సామాజిక పథకాలు, ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బృందాల పర్యటనలు, రక్షణ రంగ సహకారం, ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాల వంటి విభిన్న రంగాలలో మనం మన సహకారాన్ని పెంపొందింపచేసుకొన్నాం.

ఆసియాన్ లో, మరియు వేరు వేరు ప్రపంచ వేదికలలో కంబోడియా ఒక ముఖ్యమైన సంభాషణకర్తగాను, భారతదేశానికి మద్దతునిచ్చే భాగస్వామిగాను ఉంది. కంబోడియా యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగస్వామిగా కొనసాగాలని భారతదేశం నిబద్ధురాలై ఉంది. అంతే కాదు, కంబోడియాతో తన సాంప్రదాయక బంధాలను మరింతగా విస్తరించుకోవడం కోసం భారతదేశం ఎదురుచూస్తోంది.

మరి, భారతదేశం ఇంకా ఆసియాన్ ఇంత కన్నా ఎక్కువే చేస్తున్నాయి. ఆసియాన్ నాయకత్వం వహిస్తున్న ఈస్ట్ ఆసియా సమిట్, ఎడిఎమ్ఎమ్+ (ఆసియాన్ డిఫెన్స్ మినిస్టీరియల్ మీటింగ్ ప్లస్), ఇంకా ఎఆర్ఎఫ్ (ఆసియాన్ రీజనల్ ఫోరమ్) వంటి సంస్థలలో మన భాగస్వామ్యం మన ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని వర్ధిల్లేటట్లు చేస్తున్నాయి. భాగస్వామ్యం కలిగిన పదహారు దేశాలకూ సమగ్రమైన, సమతులమైన మరియు న్యాయమైన ఒప్పందాన్ని ఆకాంక్షిస్తున్న రీజనల్ కాంప్రిహెన్సివ్ ఇకనామిక్ పార్ట్ నర్ షిప్ అగ్రిమెంట్ లో పాలుపంచుకోవాలన్న ఆసక్తి కూడా భారతదేశానికి ఉంది.

భాగస్వామ్యాల యొక్క బలం మరియు హుషారు కేవలం సంఖ్యల అంకగణితం నుండి కాక ఆ భాగస్వామ్యాల భూమిక నుండి కూడా జనిస్తాయి. భారతదేశానికి, ఆసియాన్ దేశాలకు మధ్య సంబంధాలలో ఎటువంటి వాదాలకు గాని, లేదా క్లెయిములకు గాని తావు లేదు. మేం భవిష్యత్తు విషయంలో ఒక ఉమ్మడి దార్శనికతను కలిగివున్నాం. ఈ భవిష్యత్తు సమ్మిళితం మరియు సమైక్యం అనేటటువంటి పునాదుల మీద నిర్మితమైంది. మా దార్శనికత దేశాల యొక్క పరిమాణానికి అతీతంగా సార్వభౌమ సమానత్వ నమ్మిక మీద నిర్మితమైంది. వాణిజ్యంలో స్వేచ్ఛాయుతమైన మరియు బహిరంగమైన మార్గాలకు, ఇంకా బంధాలకు సమర్ధింపు లభించే ప్రాతిపదిక మా దార్శనికతలో భాగంగా ఉంది.

ఆసియాన్- ఇండియా పొత్తు వర్ధిల్లుతూనే ఉంటుంది. జనాభా తాలూకు సానుకూలమైన అంశం, చురుకుదనం మరియు డిమాండు.. వీటికి తోడు, శర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నజరానాలతో భారతదేశం, ఆసియాన్ లు ఒక దృఢమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్మించనున్నాయి. అనుసంధానం పెంపొంది, వ్యాపారం విస్తరిస్తుంది. భారతదేశంలో సహకారాత్మకమైన మరియు స్పర్ధాత్మకమైన సమాఖ్య విధానం అమలులో ఉండటంతో, మా రాష్ట్రాలు సైతం ఆగ్నేయ ఆసియా దేశాలతో ఫలప్రద సహకారాన్ని ఆవిష్కరించుకొంటున్నాయి. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు పునరుత్థాన పథంలోకి అడుగుపెట్టాయి. ఆగ్నేయ ఆసియా తో ఈ ప్రాంతానికి ఉన్న సంబంధాలు ఈ పురోగమనం తాలూకు గతిని వేగవంతం చేయనున్నాయి. దీని పర్యవసానంగా, అనుసంధానయుతమైనటువంటి ఈశాన్య ప్రాంతాలు మనం కలగంటున్న ఆసియాన్- ఇండియా సంబంధాలకు ఒక సేతువు కాగలుగుతాయి.

ప్రధాన మంత్రి పదవిలో ఉంటూ నేను ఇప్పటి వరకు ఏటా జరిగే ఆసియాన్- ఇండియా సమిట్ మరియు ఈస్ట్ ఆసియా సమిట్ కు నాలుగు పర్యాయాలు హాజరయ్యాను. ఇవి ఆసియాన్ ఐకమత్యం, కేంద్ర స్థానం మరియు ఈ ప్రాంతం తాలూకు దార్శనికతను మలచడంలో నాయకత్వ స్థాయి పట్ల నాలో నమ్మకాన్ని బలపరచాయి.

ఈ సంవత్సరం మైలురాళ్ల సంవత్సరం. భారతదేశం గత ఏడాదిలో 70వ ఏటికి చేరుకొంది. ఆసియాన్ 50 సంవత్సరాల బంగారు మైలురాయికి చేరుకొంది. మనం ఉభయులమూ కూడాను మన యొక్క భవిష్యత్తుకేసి ఆశాజనకంగా చూడవచ్చును. అలాగే, మన భాగస్వామ్యానికి మరింత విశ్వసనీయతను సంతరించవచ్చు కూడా.

70 ఏళ్ల భారతదేశం తన జనాభాలోని యువత యొక్క స్ఫూర్తి, కష్టించే తత్త్వం మరియు శక్తి ల తాలూకు ఉత్సాహంతో తొణికిసలాడుతోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయినటువంటి భారతదేశం ప్రపంచ అవకాశాలకు ఒక నూతనమైన సీమ గాను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని ప్రసాదించే ఒక లంగరు గాను రూపుదిద్దుకొంది. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ, భారతదేశంలో వ్యాపారం చేయడమనేది అంతకంతకు సులభంగా, సాఫీగా మారిపోతోంది. ఆసియాన్ దేశాలు మా ఇరుగు పొరుగు దేశాలు మరియు మా మిత్ర దేశాల వలెనే న్యూ ఇండియా దిశగా సాగే పరివర్తనలో ఒక అంతర్భాగం అవుతాయని నేను ఆశిస్తున్నాను.

ఆసియాన్ యొక్క స్వీయ పురోగతిని మేము మెచ్చుకొంటాము. ఆగ్నేయ ఆసియా నిర్దాక్షిణ్య రణ రంగంగాను, అనిశ్చితితో కూడినటువంటి దేశాలతో నిండిన ప్రాంతంగాను ఉన్న కాలంలో పురుడు పోసుకొన్న ఆసియాన్ 10 దేశాలను ఒక ఉమ్మడి లక్ష్యం కోసం, ఒక ఉమ్మడి భవితవ్యం కోసం ఒక్కటిగా చేసింది. మనలో ఉన్నతమైన ఆకాంక్షలను అనుసరించగలిగిన సత్తా తో పాటు మన కాలంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ల ను.. అవి అవస్థాపన మొదలుకొని నగరీకరణం వరకు కానివ్వండి, లేదా హుషారైనటువంటి వ్యవసాయ రంగం కానివ్వండి, లేదా ఒక ఆరోగ్యకరమైన భూగోళాన్ని ఆవిష్కరించడం కానివ్వండి.. పరిష్కరించగలిగిన సత్తా కూడా ఉంది. ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి వేగంతోను, పరిమాణంతోను ప్రజా జీవనంలో పరివర్తనను తీసుకువచ్చేందుకు కూడా మనం డిజిటల్ టెక్నాలజీని, నూతన ఆవిష్కరణలను మరియు అనుసంధానాన్ని
ఉపయోగించుకోవచ్చు. ఆశామయమైన భవిష్యత్తును ఆవిష్కరించేందుకు శాంతి తాలూకు బలమైన పునాది 
అవసరం. ఇది మార్పుల, అంతవరకు ఉన్న స్థితికి అంతరాయాలను తీసుకువచ్చే, సరికొత్త దిశకు మళ్లే కాలం. ఇటువంటి కాలం చరిత్రలో అరుదుగా మాత్రమే వస్తుంది. ఆసియాన్ కు మరియు భారతదేశానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. నిజానికి, భారీ బాధ్యత కూడా వాటి పైన ఉంది. అదేమిటంటే, మన ప్రాంతానికే కాక ప్రపంచానికి ఒక నిలకడ కలిగినటువంటి మరియు శాంతియుతమైనటువంటి భవితవ్యాన్ని అందించేందుకు మన కాలంలోని అనిశ్చితి మరియు మన కాలంలోని అల్లకల్లోలాల నడుమ ఒక నిదానమైన గమనాన్ని నిర్దేశించుకొనేందుకు ఆసియాన్ వద్ద మరియు భారతదేశం వద్ద బోలెడు అవకాశాలున్నాయి.

భారతీయులు పోషించే శక్తి కలిగిన సూర్యోదయం కోసం మరియు అవకాశాల వెలుగు కోసం ఎల్లప్పటికీ తూర్పు దిక్కుకేసి చూస్తారు. ఇప్పుడు, ఇదివరకటి మాదిరి గానే, భారతదేశం యొక్క భవిష్యత్తు కు మరియు మన ఉమ్మడి భాగ్యానికి తూర్పు దిశ, లేదా ఇండో-పసిఫిక్ ప్రాంతం అనివార్యం కాగలదు. ఈ రెండు అంశాలలోనూ ఆసియాన్ ఇండియా భాగస్వామ్యం ఒక నిర్వచనాత్మకమైనటువంటి పాత్రను పోషించనుంది. మరి, ఢిల్లీ లో, ఆసియాన్ ఇంకా భారతదేశం తమ ముందు ఉన్నటువంటి ప్రయాణానికిగాను మరో మారు ప్రతిజ్ఞ ను స్వీకరించాయి.

ఆసియాన్ వార్తాపత్రికలలో ప్రధాన మంత్రి బహిరంగ సంపాదకీయ వ్యాసాన్ని ఈ దిగువ లింకుల ద్వారా చూడవచ్చు :

https://www.bangkokpost.com/opinion/opinion/1402226/asean-india-shared-values-and-a-common-destiny

 

https://vietnamnews.vn/opinion/421836/asean-india-shared-values-common-destiny.html#31stC7owkGF6dvfw.97

 

https://www.businesstimes.com.sg/opinion/asean-india-shared-values-common-destiny

 

https://www.globalnewlightofmyanmar.com/asean-india-shared-values-common-destiny/

 

https://www.thejakartapost.com/news/2018/01/26/69th-republic-day-india-asean-india-shared-values-common-destiny.html

 

https://www.mizzima.com/news-opinion/asean-india-shared-values-common-destiny

 

https://www.straitstimes.com/opinion/shared-values-common-destiny

 

https://news.mb.com.ph/2018/01/26/asean-india-shared-values-common-destiny/

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Rs 1332 cr project: Govt approves doubling of Tirupati-Pakala-Katpadi single railway line section

Media Coverage

Rs 1332 cr project: Govt approves doubling of Tirupati-Pakala-Katpadi single railway line section
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Bhagwan Mahavir on Mahavir Jayanti
April 10, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tributes to Bhagwan Mahavir on the occasion of Mahavir Jayanti today. Shri Modi said that Bhagwan Mahavir always emphasised on non-violence, truth and compassion, and that his ideals give strength to countless people all around the world. The Prime Minister also noted that last year, the Government conferred the status of Classical Language on Prakrit, a decision which received a lot of appreciation.

In a post on X, the Prime Minister said;

“We all bow to Bhagwan Mahavir, who always emphasised on non-violence, truth and compassion. His ideals give strength to countless people all around the world. His teachings have been beautifully preserved and popularised by the Jain community. Inspired by Bhagwan Mahavir, they have excelled in different walks of life and contributed to societal well-being.

Our Government will always work to fulfil the vision of Bhagwan Mahavir. Last year, we conferred the status of Classical Language on Prakrit, a decision which received a lot of appreciation.”