భారత్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం, పటిష్టం చేయడంపై యునైటెడ్ కింగ్డమ్ కొత్త ప్రధాని గౌరవనీయ కీర్ స్ట్రామర్ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ-కామన్వెల్త్-అభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయ డేవిడ్ లామీతో సమావేశం సందర్భంగా శ్రీ మోదీ ఈ మేరకు స్పందించారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘యు.కె. విదేశాంగ శాఖ మంత్రి గౌరవనీయ డేవిడ్ లామీ @DavidLammyతో సమావేశం కావడం సంతోషంగా ఉంది. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం, పటిష్టం చేయడంపై ప్రధానమంత్రి కీర్ స్ట్రామర్ @Keir_Starmer ప్రాధాన్యమివ్వడాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ స్నేహబంధాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు నిబద్ధతతో ఉన్నాం. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక సాంకేతిక భద్రత కార్యక్రమంతోపాటు పరస్పర ప్రయోజనాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) త్వరగా ఖరారుకు చొరవ చూపడం హర్షదాయకం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A pleasure to meet UK FS @DavidLammy. Appreciate the priority accorded by PM @Keir_Starmer to broaden and deepen the Comprehensive Strategic Partnership. Remain committed to elevating the ties. Welcome the bilateral Technology Security Initiative and the desire to conclude a… pic.twitter.com/7bGWZuJlOk
— Narendra Modi (@narendramodi) July 24, 2024