మూడు నగరాల్లో కొనసాగుతున్న వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియలను సమీక్షించిన – ప్రధానమంత్రి

November 28th, 07:20 pm

వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియలపై విస్తృతమైన సమీక్ష నిర్వహించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు మూడు నగరాల్లో పర్యటించారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కు, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలను ఆయన సందర్శించారు.

అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించిన – ప్రధానమంత్రి

November 28th, 12:49 pm

జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.‌ఎ. ఆధారిత స్వదేశీ వ్యాక్సిన్ గురించి మరింతగా తెలుసుకోవడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును ఈరోజు సందర్శించారు.

మూడు నగరాలలో టీకామందు కేంద్రాలను రేపటి రోజు న సందర్శించనున్న ప్రధాన మంత్రి

November 27th, 04:36 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టీకామందు అభివృద్ధి, తయారీ ప్రక్రియల ను స్వయంగా సమీక్షించడానికి మూడు నగరాల పర్యటన కు రేపటి రోజు న బయలుదేరుతున్నారు. ఆయన అహమదాబాద్ లో జైడస్ బయోటెక్ పార్కు ను, హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ను, పుణే లోని సీరమ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా ను సందర్శిస్తారు.