గత కొన్నేళ్లుగా భారత రైల్వే ఆధునీకరణకు అసాధారణ కృషి : ప్రధానమంత్రి శ్రీ మోదీ

January 17th, 02:36 pm

ఇటీవల కాలంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి దృక్పథంలో చోటు చేసుకున్న మార్పులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మార్పుల కారణంగా భారత రైల్వే ఆధునీకరణలో అసాధారణ పురోగతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. గుజరాత్ లోని కెవాడియాకు దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి నిరంతర అనుసంధానం కల్పించే ఎనిమిది రైళ్లకు పచ్చజెండా ఊపడంతో పాటు గుజరాత్ లో పలు రైల్వే ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రారంభించిన అనంతరం శ్రీ మోదీ మాట్లాడారు.

ఐక్యతా విగ్ర‌హానికి రైలు ద్వారా చేరుకునే విధంగా అనుసంధాన‌త‌ ప‌ర్యాట‌కుల‌కు మేలు చేయ‌నుంది,ఇది ఉపాధి అవ‌కాశాల‌నూ క‌ల్పించ‌నుంది. :ప‌్ర‌ధాన‌మంత్రి

January 17th, 02:36 pm

గుజ‌రాత్‌లోని కెవాడియా కు అన్ని వైపుల నుంచి రైలుమార్గం ద్వారా అనుసంధానం కావ‌డం చిర‌స్మ‌ర‌ణీయం,ఇది ప్ర‌తి ఒక్క‌రికీ గ‌ర్వ‌కార‌ణం అని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల‌నుంచి గుజ‌రాత్‌లోని కెవాడియాకు 8 రైళ్ల‌ను వ‌ర్చువ‌ల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించిన అనంత‌రం మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి ఈ విష‌యం తెలిపారు.

ర‌వాణా సౌక‌ర్యంలేని ప్రాంతాల‌ను క‌లుపుతున్న రైల్వేరంగం: ప‌్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

January 17th, 02:36 pm

దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఇంత‌కాలం స‌రైన ర‌వాణా సౌక‌ర్యాలు లేకుండా ప్ర‌ధాన స్ర‌వంతిలో లేని ప్రాంతాల‌కు రైల్వే సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తూ వాటిని క‌ల‌ప‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. గుజ‌రాత్ లోని కెవాడియానుంచి దేశంలోని ప‌లు ప్రాంతాలకు వేసిన 8 కొత్త రైళ్ల‌ను ఆయ‌న ప్రారంభించారు. అంతే కాదు ప‌లు రైల్వే ప్రాజెక్టుల‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు.

ప్ర‌ధాన అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క కేంద్రంగా ఎదుగుతున్న కెవాడియా : ప‌్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

January 17th, 02:36 pm

గుజ‌రాత్ రాష్ట్రంలోని కెవాడియా అనేది ఇప్పుడు ఒక మారుమూల ప్రాంతం కాద‌ని, ఇది ఇప్పుడు ప్ర‌పంచంలోని ప్ర‌ధాన‌మైన ప‌ర్యాట‌క కేంద్రంగా అవ‌త‌రించింద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. కెవాడియానుంచి దేశంలోని ప‌లు ప్రాంతాల‌ను క‌లుపుతూ వేసిన కొత్త రైళ్ల‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు.

"ఐక్యతా విగ్రహం" దర్శించడానికి వీలుగా ఎనిమిది రైళ్లను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం

January 17th, 11:45 am

దేశంలోని విభిన్న ప్రాంతాలను గుజరాత్ లోని కెవాడియాతో అనుసంధానం చేసే ఎనిమిది రైళ్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో పచ్చజెండా ఊపారు. ఈ రైళ్లు గుజరాత్ లోని ఐక్యతా విగ్రహానికి నిరంతర అనుసంధానత కల్పిస్తాయి. అలాగే ధబోల్-చందోడ్ మధ్య రైల్వేలైను బ్రాడ్ గేజ్ గా మార్పిడి, ప్రతాప్ నగర్-కెవాడియా మధ్య రైల్వే విద్యుదీకరణ, ధబోల్, చందోడ్, కెవాడియా స్టేషన్ల కొత్త భవనాల నిర్మాణం ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, రైల్వే మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐక్యతా విగ్రహానికి నిరంతర అనుసంధానం కల్పించేలా ఎనిమిది రైళ్లకు ప్రధానమంత్రి పచ్చజెండా

January 17th, 11:44 am

దేశంలోని విభిన్న ప్రాంతాలను గుజరాత్ లోని కెవాడియాతో అనుసంధానం చేసే ఎనిమిది రైళ్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో పచ్చజెండా ఊపారు. ఈ రైళ్లు గుజరాత్ లోని ఐక్యతా విగ్రహానికి నిరంతర అనుసంధానత కల్పిస్తాయి. అలాగే ధబోల్-చందోడ్ మధ్య రైల్వేలైను బ్రాడ్ గేజ్ గా మార్పిడి, ప్రతాప్ నగర్-కెవాడియా మధ్య రైల్వే విద్యుదీకరణ, ధబోల్, చందోడ్, కెవాడియా స్టేషన్ల కొత్త భవనాల నిర్మాణం ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, రైల్వే మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జూలాజికల్‌ పార్కును ప్రారంభించిన ప్రధాని మోదీ

October 30th, 06:43 pm

గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, కెవాడియాలో నిర్మించిన సర్దార్‌ పటేల్‌ జూలాజికల్‌ పార్కును, 'జియోడెసిక్ ఏవియరీ డోమ్‌'ను ప్రారంభించారు. కెవాడియా సమగ్ర అభివృద్ధి కింద చేపట్టిన 17 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 4 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టులు.. నావిగేషన్‌ చానెల్‌, కొత్త గోరా వంతెన, గరుడేశ్వర్‌ ఆనకట్ట, ప్రభుత్వ క్వార్టర్లు, బస్‌ బే టెర్మినల్‌, ఏక్తా నర్సరీ, ఖల్వానీ పర్యావరణ పర్యాటకం, గిరిజన గృహాల్లో బస. ఐక్యత విగ్రహం వరకు లాంచీ ప్రయాణాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.