ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2వ సన్సద్ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
January 18th, 04:39 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులో నా సహచరుడు నా యువ మిత్రుడు భాయ్ హరీష్ ద్వివేది గారు, వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర సీనియర్ ప్రముఖులు మరియు నా చుట్టూ యువకులు ఉండడం నేను చూస్తున్నాను. నా ప్రియమైన సోదర సోదరీమణులారా.బస్తీ జిల్లా లో సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 రెండో దశ ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యంద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 18th, 01:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 లో భాగం అయిన రెండో దశ ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. సాంసద్ ఖేల్ మహాకుంభ్ ను బస్తీ జిల్లా లో పార్లమెంట్ సభ్యుడు శ్రీ హరీశ్ ద్వివేదీ 2021 వ సంవత్సరం నుండి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కుస్తీ, కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, చదరంగం, కేరమ్స్, బాడ్ మింటన్, టెబుల్ టెనిస్ మొదలైన ఇండోర్ మరియు అవుట్ డోర్ స్పోర్ట్ స్ లో వివిధ పోటీల ను ఖేల్ మహాకుంభ్ లో భాగం గా నిర్వహిస్తుంటారు. ఇవి గాక విడి గా, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగవల్లుల ను తీర్చిదిద్దడం వంటి వాటి లో పోటీల ను కూడా ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.గుజరాత్‌లోని వడోదరలో శ్రీ స్వామినారాయణ్ మందిర్ నిర్వహించిన యువజన శిబిరంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
May 19th, 10:31 am
కార్యక్రమంలో పరమ పూజ్య గురూజీ శ్రీ జ్ఞానజీవన్ దాస్జీ స్వామి , భారతీయ జనతా పార్టీ గుజరాత్ ప్రదేశ్ అధ్యక్షుడు మరియు పార్లమెంటులో నా సహచరుడు శ్రీ సి. ఆర్. పాటిల్ , గుజరాత్ ప్రభుత్వంలో మంత్రి మనీషాబెన్ , వినుభాయ్ , ఎంపీ రంజన్ బెన్ , వడోదర మేయర్ కెయూర్ భాయ్ , ప్రముఖులందరూ , గౌరవనీయులైన సాధువులు , ప్రస్తుత భక్తులు , సోదరీమణులు మరియు పెద్దమనుషులు మరియు పెద్ద సంఖ్యలో యువ తరం నా ముందు కూర్చున్నారు , ఈ యువశక్తి , యువత అభిరుచి , యువత స్ఫూర్తి , మీ అందరికీ నా వందనాలు . జై స్వామినారాయణ!శ్రీ స్వామినారాయణ్ మందిర్ నిర్వహించిన ‘యువ శిబిరం’ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
May 19th, 10:30 am
వడోదరా లోని కరేలీబాగ్ లో జరుగుతున్న ‘యువ శిబిరా’న్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. కుండల్ ధామ్ లోని శ్రీ స్వామినారాయణ్ మందిరం మరియు వడోదరా లోని కరేలీబాగ్ లో గల శ్రీ స్వామినారాయణ్ మందిరం శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి.మే 18వ తేదీన శ్రీ స్వామినారాయణ్ దేవాలయం నిర్వహించే 'యువ శివిర్' లో ప్రసంగించనున్న - ప్రధానమంత్రి
May 18th, 07:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2022 మే,19వ తేదీ ఉదయం 10 గంటల 30 నిముషాలకు వడోదరలోని కరేలీబాగ్ లో జరుగుతున్న ‘యువ శివిర్’ లో దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు. కుండల్ ధామ్ లోని శ్రీ స్వామి నారాయణ్ దేవాలయం మరియు వడోదర లోని కరేలిబాగ్ శ్రీ స్వామినారాయణ్ దేవాలయం సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి.