Prime Minister Narendra Modi to distribute over 71,000 appointment letters under Rozgar Mela

December 22nd, 09:48 am

PM Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits. He will also address the gathering on this occasion. Rozgar Mela is a step towards fulfilment of the commitment of PM Modi to accord highest priority to employment generation.

Double-engine Governments at the Centre and state are becoming a symbol of good governance: PM in Jaipur

December 17th, 12:05 pm

PM Modi participated in the event ‘Ek Varsh-Parinaam Utkarsh’ to mark the completion of one year of the Rajasthan State Government. In his address, he congratulated the state government and the people of Rajasthan for a year marked by significant developmental strides. He emphasized the importance of transparency in governance, citing the Rajasthan government's success in job creation and tackling previous inefficiencies.

రాజస్థాన్ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా

December 17th, 12:00 pm

‘ఏక్ వర్ష్ - పరిణామ్ ఉత్కర్ష్: రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరం పూర్తి’ పేరుతో ఈ రోజు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకొన్నందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర ప్రజలకూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదాల్ని అందుకోవడం తనకు దక్కిన సౌభాగ్యమని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో అభివృద్ధి పనులకు ఒక కొత్త దిశను, జోరును ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రినీ, ఆయన జట్టునీ శ్రీ మోదీ ప్రశంసించారు. రాబోయే అనేక సంవత్సరాల్లో అభివృద్ధికి ఈ మొదటి సంవత్సరం ఒక బలమైన పునాదిగా మారిందని అన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తి అవడం ఒక్కటే కాకుండా రాజస్థాన్ అభివృద్ధి ఉత్సవంతోపాటు రాజస్థాన్ ఉజ్వలంగా మెరిసిపోతూ ఉండడానికి కూడా సంకేతంగా నిలిచిందని ఆయన అన్నారు. ఇటీవల రైజింగ్ రాజస్థాన్ సమ్మిట్ 2024 సందర్భంగా తాను ఇక్కడ పర్యటించిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేస్తూ.. ప్రపంచమంతటి నుంచీ ఎంతో మంది పెట్టుబడిదారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈ రోజు రూ.45,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు నీటి విషయంలో రాజస్థాన్ ఎదుర్కొంటున్న అడ్డంకుల్ని తొలగించేందుకు సముచిత పరిష్కారాన్ని అందిస్తాయనీ, భారతదేశంలో చాలా రాష్ట్రాలతో చక్కని అనుసంధాన సదుపాయాన్ని కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా రాజస్థాన్‌ను నిలబెడతాయని కూడా ఆయన అన్నారు. ఈ అభివృద్ధి పనులు మరింత మంది పెట్టుబడిదారులను ఆహ్వానించి, అనేక ఉద్యోగావకాశాలను కల్పించి, పర్యాటక రంగాన్ని బలపరచడంతోపాటు రాజస్థాన్‌లో రైతులకు, మహిళలకు, యువతకు ప్రయోజనాలను అందిస్తాయని ప్రధాని అన్నారు.

ఆసియా కప్ గెలిచిన భారత జూనియర్ మహిళల హాకీ బృందాన్ని అభినందించిన ప్రధానమంత్రి

December 16th, 09:35 pm

ఆసియా కప్ గెలిచిన భారత జూనియర్ మహిళల హాకీ బృందానికి నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. విజయాన్ని సొంతం చేసుకున్న బృందం మనోస్థైర్యాన్ని, పట్టుదలను ప్రశంసించారు.

Our Constitution is the foundation of India’s unity: PM Modi in Lok Sabha

December 14th, 05:50 pm

PM Modi addressed the Lok Sabha on the 75th anniversary of the Indian Constitution's adoption. He reflected on India's democratic journey and paid tribute to the framers of the Constitution.

రాజ్యాంగ ఆమోదం 75వ వార్షికోత్సవం: లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 14th, 05:47 pm

రాజ్యంగాన్ని ఆమోదించుకొని 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా లోక్‌సభలో చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. మనం ఈ ప్రజాస్వామ్య పండుగను నిర్వహించుకోవడం భారత పౌరులకే కాక పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గర్వకారణమూ, గౌరవభరితమంటూ వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగ 75వ వార్షికోత్సవ అసాధారణ, మహత్తర యాత్ర సందర్భంగా ఆయన రాజ్యాంగ నిర్మాతలు కనబర్చిన ముందుచూపునకు, వారి దార్శనికతకు, వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతూ 75 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రజాస్వామ్య ఉత్సవాన్ని జరుపుకోవలసిన తరుణమన్నారు. ఈ ఉత్సవంలో పార్లమెంటు సభ్యులు కూడా పాలుపంచుకొంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని శ్రీ మోదీ చెబుతూ, దీనికిగాను వారికి ధన్యవాదాలనూ, అభినందనలనూ తెలిపారు.

Maha Kumbh is a divine festival of our faith, spirituality and culture: PM in Prayagraj

December 13th, 02:10 pm

PM Modi inaugurated development projects worth ₹5500 crore in Prayagraj, highlighting preparations for the 2025 Mahakumbh. He emphasized the cultural, spiritual, and unifying legacy of the Kumbh, the government's efforts to enhance pilgrimage facilities, and projects like Akshay Vat Corridor and Hanuman Mandir Corridor.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం

December 13th, 02:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పవిత్ర సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్‌కు, మహాకుంభమేళాకు వచ్చే సాధువులు, సన్యాసులకు భక్తితో నమస్కరించారు. కృషి, అంకితభావంతో మహా కుంభమేళాను విజయవంతం చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా జరిగే పరిమాణాన్ని, స్థాయి గురించి వివరిస్తూ, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే మహాయజ్ఞంగా, ప్రతి రోజూ లక్షల మంది భక్తుల పాల్గొనే, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ‘‘ప్రయాగరాజ్ నేలపై సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న మహా కుంభమేళా దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును నూతన శిఖరాలకు తీసుకెళుతుందతని, ఈ ఐక్యత ‘మహాయజ్ఞం’ గురించి ప్రపంచమంతా చర్చిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహా కుంభమేళాని విజయవంతంగా నిర్వహించాలన్నారు.

సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

December 11th, 02:00 pm

నేడు దేశం మహాకవి సుబ్రమణ్య భారతి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారికి గౌరవ పూర్వక నివాళులర్పిస్తున్నాను. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకి, దేశస్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు, తమిళుల గౌరవానికి ఇవి అపురూపమైన క్షణాలు! మహాకవి సుబ్రమణ్య భారతి రచనల ప్రచురణను అత్యున్నతస్థాయి సేవగా పరిగణిస్తున్నాను. పరిపూర్ణమైన గొప్ప ఆధ్యాత్మిక యత్నమిది. 21 సంపుటాల్లో తయారైన 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' సంకలనం అసాధారణమైన, అపూర్వమైన విజయానికి ప్రతీక. ఎంతో స్థైర్యంతో చేపట్టిన ఆరు దశాబ్దాల అవిరామ కృషికి దక్కిన అద్భుత ఫలితం. అనితరసాధ్యమనిపించే ఈ సాఫల్యం శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషికీ, అంకితభావానికీ నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ సంకలనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒకే జీవితం, ఒక లక్ష్యం అన్న మాటని మనం తరచుగా వింటుంటాం కానీ శ్రీ శీని ఆ మాటను నిజం చేసి చూపారు. అపురూపమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఆయన శ్రమ, ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి 35 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన మహామహోపాధ్యాయ పాండురంగ్ వామన్ కానే గారిని గుర్తుకు తెచ్చింది. శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషి విద్యారంగంలో నూతన ప్రమాణాలను పాదుకొల్పగలదని విశ్వసిస్తున్నాను. గొప్ప ఫలితాన్ని సాధించిన విశ్వనాథన్ గారికి, ఆయన బృందం సహా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 11th, 01:30 pm

తమిళ భాషా రంగంలో మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈరోజు ఆవిష్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశ సంస్కృతికి, సాహిత్యానికి, మన దేశ స్వాతంత్య్ర పోరాట స్మృతులకు, అంతేకాకుండా తమిళనాడు ఆత్మగౌరవానికి కూడా లభించిన ఒక మహదవకాశమన్నారు.

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొనే విద్యార్థులతో డిసెంబర్ 11న ప్రధానమంత్రి మాటామంతీ

December 09th, 07:38 pm

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో భాగంగా గ్రాండ్ ఫినాలేని 2024 డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. ఆ పోటీలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం సుమారు 4:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాలుపంచుకోనున్నాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

అహ్మదాబాద్ రామకృష్ణ మఠం కార్యక్రమంలో వీడియో మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

December 09th, 01:30 pm

పూజ్య స్వామి గౌతమానందజీ మహరాజ్, రామకృష్ణ మఠానికి చెందిన దేశవిదేశాల సాధువులు, మహాత్ములు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్, కార్యక్రమంలో భాగమైన విశిష్ఠ అతిథులు, సోదర సోదరీమణులు.. అందరికీ నా నమస్కారాలు!

గుజరాత్ లో రామకృష్ణ మఠం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 09th, 01:00 pm

గుజరాత్ రామకృష్ణ మఠం ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పూజ్య స్వామి గౌతమానందజీ మహరాజ్, రామకృష్ణ మఠానికి చెందిన దేశవిదేశాల సాధువులు, మహాత్ములు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్, కార్యక్రమంలో భాగమైన విశిష్ఠ అతిథులు తదితరులకు అభినందనలు తెలిపారు. మాతా శారదాదేవి, గురుదేవులు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల వారి పాదాలకు ప్రణామాలు అర్పించారు. నేటి కార్యక్రమం స్వామి ప్రేమానంద్ మహరాజ్ జీ జయంతి సందర్భంగా ఏర్పాటయ్యిందంటూ వారికి వందనాలర్పించారు.

Odisha is experiencing unprecedented development: PM Modi in Bhubaneswar

November 29th, 04:31 pm

Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.

PM Modi's Commitment to Making Odisha a Global Hub of Growth and Opportunity

November 29th, 04:30 pm

Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.

మన యువ శక్తి అద్భుతాలు చేయగలదు: ప్రధాని

November 28th, 07:41 pm

భారత యువశక్తి అద్భుతాలు చేయగలదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. వారిలో ఉత్తేజం నింపడంలో, అన్ని అవకాశాలను అందించి వారు రాణించేలా చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

యువజనులారా క్విజ్‌లో పాల్గొనండి: ప్రధానమంత్రి

November 27th, 01:45 pm

క్విజ్ (ప్రశ్న, జవాబుల కార్యక్రమం)లో పాలుపంచుకోవాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువజనులు ఈ రోజు విజ్ఞప్తి చేశారు. దీనితో, చరిత్రాత్మక ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో భాగమయ్యే అవకాశం వారికి దక్కే వీలుంది. దీనితో, వికసిత్ భారత్ ను (అభివృద్ధి చెందిన భారతదేశం) ఆవిష్కరించాలనే లక్ష్యాన్ని సాధించడంలో వారు మరపురాని తోడ్పాటును అందించినట్లు కాగలదని ఆయన అన్నారు.

భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

November 24th, 11:30 am

మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్‌లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్‌లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.

న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం

November 22nd, 10:50 pm

మంత్రి విన్‌ఫ్రైడ్, నా మంత్రివర్గ సహచరుడు జ్యోతిరాదిత్య సిందియా, ఈ సదస్సుకు హాజరైన సోదరీ సోదరులారా!

న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం

November 22nd, 09:00 pm

జర్మనీలోని స్టట్‌గార్ట్ లో జరిగిన న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్-జర్మనీ భాగస్వామ్యంలో ఈ సదస్సు కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని ప్రధానమంత్రి అన్నారు. “నేటి సమాచార యుగంలో జర్మనీ, జర్మన్ ప్రజలతో అనుసంధితమయ్యేలా భారతదేశం నుంచి ఓ మీడియా సంస్థ ప్రయత్నిస్తుండడం సంతోషాన్నిస్తోంది. జర్మనీని, ఆ దేశ ప్రజలను అర్థం చేసుకోవడానికి భారతీయులకు ఇది ఒక వేదికను అందిస్తుంది” అని ప్రధానమంత్రి అన్నారు.