ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన జపాన్ పూర్వ ప్రధాని శ్రీయోశీహిదే సుగా
May 24th, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ పూర్వ ప్రధాని శ్రీ యోశీహిదే సుగా ఈ రోజు (2022, మే 24) న టోక్యో లో సమావేశమయ్యారు.చతుర్దేశాధినేతల సమావేశం : సమాచార పత్రం
September 25th, 11:53 am
అమెరికాలోని శ్వేత సౌధంలో చతుర్దేశాధినేతల తొట్టతొలి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అధ్యక్షుడు బైడెన్ సెప్టెంబరు 24న భారత, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, యోషిహిడే సుగా, స్కాట్ మోరిసన్‌లకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనడంలో ఆచరణాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం సహా స్నేహ సంబంధాల బలోపేతానికి తోడ్పడే విశిష్ట చర్యలు చేపట్టాలని అధినేతలు ఆకాంక్షించారు. ఈ మేరకు కోవిడ్-19 అంతం దిశగా సురక్షిత, ప్రభావశీల టీకాల ఉత్పత్తి-లభ్యత పెంపు, ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతులకు ప్రోత్సాహం, వాతావరణ మార్పు సంక్షోభ నిరోధం, ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాల్లో భాగస్వామ్యం, అంతరిక్షం, సైబర్ భద్రత, నాలుగు దేశాల్లోనూ భవిష్యత్తరం ప్రతిభాపాటవాల వృద్ధి వంటివి ఈ చర్యలలో భాగంగా ఉన్నాయి.క్వాడ్ నాయకుల ఉమ్మడి ప్రకటన
September 25th, 11:41 am
ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా దేశాల నాయకులమైన మేము మొదటిసారిగా ఈ రోజున భౌతికంగా సమావేశమయ్యాం. ఈ చారిత్రాత్మక సమావేశ సందర్భంగా మేం మా భాగస్వామ్యకృషికి పునరంకితమయ్యాం. నాలుగు దేశాలు కలిసి పంచుకుంటున్న భద్రత, సౌభాగ్యం, అరమరికలు లేని, అందరికీ అందుబాటులోని దృఢమైన ఇండో పసిఫిక్ కోసం పునర్ నిబద్దులయ్యాం. క్వాడ్ సమావేశం జరిగి ఆరు నెలలవుతోంది. మార్చి నెలనుంచి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణ సంక్షోభం కూడా తీవ్రతరమైంది. ప్రాంతీయ భద్రత అనేది మరింత సంక్లిష్టమైంది. ఇది మన దేశాలన్నిటినీ ఉమ్మడిగాను, విడివిడిగాను పరీక్షిస్తోంది. అయినప్పటికీ మన సహకారం ఏమాత్రం తొణకలేదు. బెణకలేదు.భారత-అమెరికా ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
September 24th, 11:48 pm
మిస్టర్ ప్రెసిడెంట్, సంపూర్ణ స్నేహభావంతో నాకు, నా ప్రతినిధివర్గానికి హార్థిక స్వాగతం పలికినందుకు మొదట మీకు నా కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నాను.జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో ఫలవంతమైన చర్చలు జరిపిన ప్రధాని మోదీ
September 24th, 03:45 am
వాషింగ్టన్ డిసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు జపాన్ ప్రధాని యోషిహిడే సుగాల మధ్య ఫలవంతమైన సమావేశం జరిగింది. వాణిజ్యం మరియు సాంస్కృతిక సంబంధాలకు మరింత ఊపునిచ్చే మార్గాలతో సహా అనేక అంశాలపై ఇరువురు నాయకులు చర్చలు జరిపారు.ప్రధాన మంత్రి యుఎస్ఎ సందర్శన కు బయలుదేరి వెళ్ళే ముందు జారీ చేసిన ప్రకటన
September 22nd, 10:37 am
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట నేను 2021 సెప్టెంబర్ 22-25 తేదీ ల మధ్య కాలం లో యుఎస్ఎ ను సందర్శించనున్నాను.టోక్యో ఒలింపిక్స్ కు గాను జపాన్ ప్రధాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
July 23rd, 01:17 pm
టోక్యో ఒలింపిక్స్ 2020 కి గాను జపాన్ ప్రధాని శ్రీ యోశీహిదే శుగా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.అహ్మదాబాద్ లోని ఎఎంఎలో జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 27th, 12:21 pm
జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ అంకితభావానికి ఈ సందర్భం భారతదేశం-జపాన్ సంబంధాల సౌలభ్యం మరియు ఆధునికతకు చిహ్నం. జపాన్ జెన్ గార్డెన్ , కైజెన్ అకాడెమీ ల ఏర్పాటు భారత దేశం- జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేసి, మన పౌరులను మరింత సన్నిహితం చేయగలదని నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా, ఈ సమయంలో నా అంతర్గత స్నేహితుడు, గవర్నర్ శ్రీ ఇడో తోషిజో, హ్యోగో ప్రీ ఫ్రాక్చర్ నాయకులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గవర్నర్ ఇడో స్వయంగా 2017 లో అహ్మదాబాద్ వచ్చారు. అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ ఏర్పాటుకు ఆయన మరియు హ్యోగో ఇంటర్నేషనల్ అసోసియేషన్ విలువైన సహకారం అందించారు. ఇండో, జపాన్ ఫ్రెండ్ షిప్ అసోసియన్ ఆఫ్ గుజరాత్ కు చెందిన నా సహచరులను కూడా నేను అభినందిస్తున్నాను. భారత దేశం- జపాన్ సంబంధాలకు శక్తిని కల్పించడానికి ఆయన నిరంతరం అత్యద్భుత మైన కృషి చేశారు. జపాన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టడీ సెంటర్ కూడా దీనికి ఉదాహరణ.అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్, కైజెన్ అకాడమీలకు శ్రీకారం!
June 27th, 12:20 pm
అహ్మదాబాద్ లోని అహ్మదాబాద్ మేనేజిమెంట్ అసోసియేషన్ సంస్థ ఆవరణలో జెన్ గార్డెన్.ను, కైజెన్ అకాడమీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో ప్రారంభించారు.క్వాడ్ నేత ల ఒకటో వర్చువల్ సమిట్
March 11th, 11:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 12న వర్చువల్ పద్ధతి లో జరిగే లీడర్స్ సమిట్ ఆఫ్ ద క్వాడ్రిలాటరల్ ఫ్రేమ్ వర్క్ ఒకటో సమావేశం లో పాలుపంచుకోనున్నారు. ఈ శిఖర సమ్మేళనం లో ఆయన తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని శ్రీ యోశిహిదే సుగా, యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ లు కూడా పాల్గొంటారు.జపాన్ ప్రధాని మాన్య శ్రీ సుగా యోశీహిదే తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 09th, 08:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని మాన్యశ్రీ సుగా యోశిహిదే తో మంగళవారం నాడు టెలిఫోన్ లో మాట్లాడారు.టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని శ్రీ సుగా యోశిహిదే
September 25th, 02:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ ప్రధాని శ్రీ సుగా యోశిహిదే శుక్రవారం టెలిఫోన్ లో మాట్లాడారు.జపాన్ ప్రధాని గా నియమితులైన శ్రీ యోశిహిదే సుగా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
September 16th, 11:45 am
జపాన్ ప్రధాని గా నియమితులైన శ్రీ యోశిహిదె సుగా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.