కర్నాటకలోని యాద్గిర్ జిల్లా కోడెకల్‌లో శంకుస్థాపన, పలు అభివృద్ధి ప్రాజెక్టుల అంకితం కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 19th, 12:11 pm

కర్నాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ జీ, ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ భగవంత్ ఖుబా జీ, కర్ణాటక ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి తరలివచ్చిన ప్రియమైన నా సోదర సోదరీమణులారా!

క‌ర్ణాట‌క‌లోని కోడెక‌ల్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

January 19th, 12:10 pm

క‌ర్ణాట‌క‌లోని కోడెక‌ల్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. కోడెకల్‌లో సాగునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టనున్న యాద్గిర్ బహుళ-గ్రామ తాగునీటి సరఫరా పథకం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే ఎన్ హెచ్ -150సీ లో 65.5 కి.మీ విభాగం (బడదల్ నుంచి మరదగిఎస్ ఆందోల వరకు) , నారాయణపూర్ లెఫ్ట్ బ్యాంక్ కాలువ - పొడిగింపు పునరుద్ధరణ మరియు ఆధునికీకరణ ప్రాజెక్ట్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.