‘‘పెంచి పోషించగలిగే అభివృద్ధి కోసం 2030 కార్యక్రమ పట్టికను అమలుపరచాలి; దానితో పాటే విస్తృతమైన భాగస్వామ్యాలను నిర్మించుకోవాలి’’ - జియామెన్ లో బ్రిక్స్ ఇమర్జింగ్ మార్కెట్స్ అండ్ డివెలపింగ్ కంట్రీజ్ డైలాగ్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 05th, 09:22 am
భారతదేశం తన ఎస్ డి జి స్ యొక్క తొలి స్వచ్ఛంద జాతీయ సమీక్షను ఇటీవలే జులై లో పూర్తి చేసింది. మా అభివృద్ధి కార్యక్రమ పట్టికకు ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’ సంకల్పమే కీలకంగా ఉన్నది. ఈ మాటలకు- సమష్టి ప్రయత్నం, సమ్మిళిత వృద్ధి అని - అర్థం. మేము ఎస్ డి జిలలో ప్రతి ఒక్క లక్ష్యాన్ని సమాఖ్య మరియు రాష్ట్రాల స్థాయిలలోని మా అభివృద్ధి కార్యక్రమాలతో ముడి వేసుకొన్నామని ప్రధాని మోదీ అన్నారు.చైనాలోని జియామెన్ లో 2017 సెప్టెంబర్ 4వ తేదీన బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తో సంభాషణ కార్యక్రమం ప్రధాన మంత్రి ప్రసంగం
September 04th, 04:19 pm
బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తో జరుగుతున్న ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. బిజినెస్ కౌన్సిల్ లో మీరు చేస్తున్న కృషి బ్రిక్స్ భాగస్వామ్యం యొక్క దార్శనికతకు ఒక ఆచరణాత్మకమైన దారిని చూపించడంలో కీలకమైన పాత్రను పోషిస్తోంది. మీరు ఏర్పరిచిన భాగస్వామ్యాలు, మీరు నిర్మించినటువంటి నెట్ వర్క్ లు బ్రిక్స్ లో ప్రతి ఒక్క దేశంలోను ఆర్థిక వృద్ధికి ఊతాన్ని ఇస్తున్నాయి.చైనాలోని గ్జియామెన్ లో 9 వ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని సమావేశాలు
September 04th, 12:39 pm
చైనాలోని గ్జియామెన్ లో 9 వ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.బ్రిక్స్ నేతల జియామెన్ ప్రకటన (సెప్టెంబర్ 04, 2017)
September 04th, 12:18 pm
బ్రిక్స్ నాయకులు 9 వ బ్రిక్స్ సదస్సు కోసం డిక్లరేషన్ సభ్య దేశాల మధ్య ఆచరణాత్మక సహకారం శక్తివంతం కావాలని కోరారు. ప్రపంచ ఆర్ధిక పరిపాలనను మెరుగుపర్చడంలో కమ్యూనికేషన్ మరియు సమన్వయాలను పెంపొందించుకునేందుకు ఇది మరింత సరళమైన, సరళీకృత అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది అంతర్జాతీయ మరియు ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వాన్ని తెలియజేస్తుంది.చైనా లోని జియామెన్ లో 2017 సెప్టెంబర్ 4వ తేదీన 9వ బ్రిక్స్ శిఖర సమ్మేళనం యొక్క సర్వ సభ్య సదస్సు లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం
September 04th, 09:46 am
బ్రిక్స్ సహకారం కోసం ఒక బలమైన ప్రణాళికను అభివృద్ధి చేశాయని, దాని నిలకడ ప్రపంచంలోని స్థిరత్వం, వృద్ధికి దోహదం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయం, విద్యుత్, క్రీడలు, పర్యావరణం, ఐ.సి.టి మరియు సంస్కృతి వంటి రంగాల్లో సహకారాన్ని కొనసాగించాలని ఆయన ఉద్ఘాటించారు.చైనాలో జియామెన్లో చేరుకున్న ప్రధానమంత్రి మోదీ
September 03rd, 06:12 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో జియామెన్లో చేరుకున్నారు. అతను ఇక్కడ 9 వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. శ్రీ మోదీ ఈ పర్యటనలో భాగంగా బ్రిక్స్ నాయకులతో ద్వైపాక్షిక స్థాయి చర్చలు నిర్వహించనున్నారు.