టిఇఆర్ఐ నిర్వహించే వరల్డ్ సస్ టేనబుల్డెవలప్ మెంట్ సమిట్ లో ఫిబ్రవరి 16న ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నప్రధాన మంత్రి
February 15th, 11:32 am
ది ఎనర్జీ ఎండ్ రిసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ (టిఇఆర్ఐ) నిర్వహించే వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ న సాయంత్రం పూట సుమారు 6 గంటల వేళ కు వీడియో సందేశం ద్వారా ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.ఈ నెల 10న వరల్డ్ సస్‌టైనబుల్ డెవలప్‌మెంట్ సమిట్ 2021 ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
February 08th, 05:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరల్డ్ సస్‌టైనబుల్ డెవలప్‌మెంట్ సమిట్ 2021 ని ఈ నెల 10న సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ‘మన భవిష్యత్తు ను పునర్ నిర్వచించుకోవడం: అందరికీ సురక్షితమైన, భద్రమైన పర్యావరణం’ అనే అంశం ఈ శిఖర సమ్మేళనానికి ఇతివృత్తం గా ఉండనుంది. గుయానా సహకార గణతంత్రం అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్; పాపువా న్యూ గునియా ప్రధాని జేమ్స్ మరాపే; మల్దీవ్స్ గణతంత్రం పీపుల్స్ మజ్లిస్ స్పీకర్ మొహమ్మద్ నషీద్, ఐక్య రాజ్య సమితి లో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా జె మొహమ్మద్ లతో పాటు, పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ లు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు.వరల్డ్ సస్‌టేనబుల్ డివెలప్‌మెంట్ సమిట్ (డబ్ల్యుఎస్‌డిఎస్ 2018) ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 16th, 11:30 am
‘వరల్డ్ సస్‌టేనబుల్ డివెలప్‌మెంట్ సమిట్’ ప్రారంభ సందర్భంగా ఇక్కడకు రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. విదేశాల నుండి వచ్చి మమ్మల్ని కలుసుకున్న వారందరికీ భారతదేశానికి స్వాగతం. అలాగే వారికి ఢిల్లీ లోకీ సుస్వాగతం.వరల్డ్ సస్‌టైనబుల్ డివెలప్‌మెంట్ సమ్మిట్ 2018 ని రేపు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
February 15th, 03:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు శుక్రవారం ఫిబ్రవరి 16వ తేదీన వరల్డ్ సస్‌టైనబుల్ డివెలప్‌మెంట్ సమ్మిట్ 2018 సంచిక (డబ్ల్యుఎస్‌డిఎస్ 2018)ని విజ్ఞాన్ భవన్ లో ప్రారంభించనున్నారు. డబ్ల్యుఎస్‌డిఎస్ అనేది ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టిఇఆర్ఐ) యొక్క ప్రధానమైన వేదిక. సుస్థిరమైన అభివృద్ధి, శక్తి ఇంకా పర్యావరణ రంగాలలో మేధావులను, ప్రపంచ నాయకులను ఒక ఉమ్మడి వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.