రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.