రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.జి-7 విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
June 14th, 09:54 pm
మున్ముందుగా నన్ను ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించడంతోపాటు అత్యంత గౌరవ మర్యాదలతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధానమంత్రి మెలోనీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చాన్సలర్ ఓలాఫ్ షోల్ట్స్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జి-7 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకమైనదేగాక, దీనికెంతో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ మేరకు కూటమి 50వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయ మిత్రులైన జి-7 దేశాధినేతలందరికీ నా మనఃపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.జి-7 సదస్సులో కృత్రిమ మేధ ఇంధనం ఆఫ్రికా మధ్యధరా ప్రాంతం అంశాలపై విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 14th, 09:41 pm
ఇటలీలోని అపులియాలో జి-7 సదస్సులో భాగంగా ఇవాళ కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం తదితర అంశాలపై నిర్వహించిన విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత జి-7 కూటమి 50వ వార్షికోత్సవ మైలురాయిని అందుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ- మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. మానవ కేంద్రక విధాన ప్రాతిపదికగా ఉన్నపుడే సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం కాగలదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవా ప్రదానం కోసం డిజిటల్ సాంకేతికత వినియోగంలో భారత్ సాధించిన విజయాలను సభికులతో ప్రధాని పంచుకున్నారు.‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
June 05th, 02:21 pm
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. శ్రీ నరేంద్ర మోదీ దిల్లీ లోని బుద్ధ జయంతి పార్కు లో ఒక రావి మొక్క ను నాటారు. మన భూ గ్రహాన్ని మెరుగైంది గా మలచడం లో అందరు వారి వంతు తోడ్పాటు ను అందించవలసింది అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. గడచిన పది సంవత్సరాల లో భారతదేశం చేపట్టిన అనేక ఉమ్మడి ప్రయాస లు దేశం లో అటవీ ప్రాంత విస్తీర్ణం పెరిగేందుకు దారితీశాయి అని ఆయన అన్నారు. స్థిరమైన అభివృద్ధి దిశ లో మనం పడుతున్న తపన లో ఇది ఒక మహత్కార్యం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 సందర్భంగా ప్రధాన మంత్రి వీడియో సందేశం
June 05th, 03:00 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ, మన దేశానికి, ప్రపంచానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించాలన్నదే ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం. గత 4-5 సంవత్సరాలుగా, ప్రపంచ చొరవ కంటే ముందే భారతదేశం ఈ సమస్యపై స్థిరంగా పనిచేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించడానికి 2018లోనే భారత్ రెండు స్థాయిల్లో చర్యలు ప్రారంభించింది. ఒకవైపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తూనే మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ ను తప్పనిసరి చేశాం. ఫలితంగా భారత్ లో దాదాపు 30 లక్షల టన్నుల ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ను తప్పనిసరిగా రీసైక్లింగ్ చేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వార్షిక ప్లాస్టిక్ వ్యర్థాలలో ఇది 75 శాతం. నేడు, సుమారు 10,000 మంది ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు , బ్రాండ్ యజమానులు ఈ ప్రయత్నంలో చురుకుగా పాల్గొంటున్నారు.ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటైన సమావేశాన్నిఉద్దేశించి వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 05th, 02:29 pm
ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.జర్మనీలో జరిగిన జి7 సమ్మిట్‌లో 'స్ట్రాంగర్ టుగెదర్: అడ్రస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ అడ్వాన్సింగ్ జెండర్ ఈక్వాలిటీ' సెషన్‌లో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
June 27th, 11:59 pm
ప్రపంచ ఉద్రిక్తత వాతావరణం మధ్య మనం కలుస్తున్నాము. భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో కూడా, మేము సంభాషణ మరియు దౌత్య మార్గాన్ని నిరంతరం కోరాము. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత ప్రభావం కేవలం యూరప్‌కే పరిమితం కాదు. ఇంధనం, ఆహార ధాన్యాల ధరలు పెరగడం అన్ని దేశాలపై ప్రభావం చూపుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన మరియు భద్రత ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నాయి. ఈ సవాలు సమయంలో, భారతదేశం అవసరమైన అనేక దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. మేము గత కొన్ని నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయంగా సుమారు 35,000 టన్నుల గోధుమలను పంపాము. మరియు అక్కడ భారీ భూకంపం తర్వాత కూడా, సహాయ సామాగ్రిని అందించిన మొదటి దేశం భారతదేశం. మా పొరుగున ఉన్న శ్రీలంకకు కూడా ఆహార భద్రత కల్పించేందుకు మేము సహాయం చేస్తున్నాము.Prime Minister’s remarks at the session on ‘Investing in a better Future: Climate, Energy, Health’ at G7 Summit in Germany
June 27th, 07:47 pm
At the session on ‘Investing in a better Future: Climate, Energy, Health’ during G7 Summit in Germany, PM Modi said, There is a misconception that poor countries and poor people cause more damage to the environment. But, India’s history of over thousands of years completely refutes this view.లైఫ్ ఉద్యమ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
June 05th, 07:42 pm
నా స్నేహితుడు శ్రీ బిల్ గేట్స్ కు, శ్రీ అనిల్ దాస్ గుప్తాకు భారతదేశ పర్యావరణశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ లకు నమస్కారాలు..PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’
June 05th, 07:41 pm
Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.‘భూమి ని కాపాడే ఉద్యమం’ అంశం పై జూన్ 5న ఏర్పాటైన కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి
June 04th, 09:37 am
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భూమి ని కాపాడే ఉద్యమం’ అనే అంశం పై జూన్ 5వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat
May 29th, 11:30 am
During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 05th, 11:05 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీమాన్ శ్రీ నితిన్ గడ్కరీ జీ, నరేంద్ర సింగ్ తోమర్జీ, ప్రకాష్ జవదేకర్ జీ, పీయూష్ గోయల్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, గుజరాత్ లోని ఖేడా పార్లమెంటు సభ్యుడు, దేవుసింగ్ జసింగ్ భాయ్ చౌహాన్ జీ, హర్దోయ్ పార్లమెంటు సభ్యుడు, యుపి, భాయ్ జై ప్రకాష్ రావత్ జీ, పూణే మేయర్ ముర్లీధర్ మహుల్ జీ, పింప్రి చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ సోదరి ఉషా జీ ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,ప్రపంచ పర్యావరణ దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 05th, 11:04 am
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో పెట్రోలియమ్ & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ కలసి శనివారం నాడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా పుణే కు చెందిన ఒక రైతు తో ఆయన మాట్లాడారు. ఆ రైతు సేంద్రియ వ్యవసాయం తాలూకు తన అనుభవాన్ని, వ్యవసాయం లో బయో ఫ్యూయల్ వినియోగాన్ని గురించి వెల్లడించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రధానమంత్రి ప్రసంగం
June 04th, 07:39 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2021 జూన్ 5న నిర్వహించే కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా పాల్గొంటారు. ఈ ఏడాది “మెరుగైన పర్యావరణ కోసం జీవ ఇంధనాలకు ప్రోత్సాహం” ఇతివృత్తంగా కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ, పెట్రోలియం-సహజ వాయువుల మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.12 వ తరగతి విద్యార్థులు ,వారి తల్లిదండ్రులతో ప్రధాని ఆశ్చర్యకరమైన సంభాషణ కు సంబంధించిన ప్రసంగం పాఠం
June 03rd, 09:42 pm
మోదీజీ: సరే ఈ విషయం చెప్పండి. మీరు 10 వ తరగతిలో టాపర్‌గా ఉన్నారు, 12 వ తరగతికి కూడా టాపర్ గానే ఉండాలని ఇంట్లో బాగా సిద్ధం అయి ఉంటారు. కానీ ఇప్పుడు పరీక్షలు లేనందున అది జరగదు.12 వ తరగతి విద్యార్థుల కు విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక వర్చువల్ సెశన్ లో ఆశ్చర్యకరం గా జతపడ్డ ప్రధాన మంత్రి
June 03rd, 09:41 pm
విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక వర్చువల్ సెశన్ లో పాలుపంచుకొన్న 12 వ తరగతి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అప్రయత్నపూర్వకం గా ఆ సమావేశం లో జతపడటం తో ఒక ఆనందభరితమైనటువంటి ఆశ్చర్యం ఎదురైంది. 12 వ తరగతి పరీక్షలు రద్దు కావడాన్ని దృష్టి లో పెట్టుకొని విద్య మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే తమ మధ్య కు ప్రధాన మంత్రి అకస్మాత్తు గా రావడం తో ఆశ్చర్యపడ్డ విద్యార్థి తో ఆయన ‘‘మీ ఆన్ లైన్ సమావేశాన్ని నేను భంగపరచడం లేదని ఆశిస్తున్నాను’’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆ సందర్భం తాలూకు స్ఫూర్తి కి తగ్గట్టు గా శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ పరీక్ష తాలూకు ఒత్తిడి సడలిపోవడాన్ని గురించి ప్రస్తావించి, ఉపశమనం పొందిన విద్యార్థుల తో కొన్ని సరదా సందర్భాలను పంచుకొన్నారు. వ్యక్తిగతమైనటువంటి ప్రస్తావనలను గురించి చెప్తూ విద్యార్థుల ను ఆయన ఉల్లాసపరిచారు. పంచ్ కులా కు చెందిన విద్యార్థి ఒకరు గత కొన్ని రోజులు గా పరీక్షల పట్ల నెలకొన్న ఉద్విగ్నత ను గురించి ప్రస్తావించగా, ఆ విద్యార్థి ఉంటున్నది ఏ ప్రాంతం లోనో ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొని తాను కూడా అదే బస్తీ లో చాలా కాలం పాటు ఉన్నానన్నారు.PM reiterates the pledge to preserve the planet’s rich biodiversity
June 05th, 12:20 pm
On the occasion of World Environment Day, the Prime Minister, Shri Narendra Modi in a tweet said, “On #World Environment Day, we reiterate our pledge to preserve our planet’s rich biopersity.స్వచ్ఛ భూ గ్రహం పట్ల తన వచనబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
June 05th, 09:45 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ పర్యావరణ దినం నాడు స్వచ్ఛ భూ గ్రహం పట్ల తన వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.సోషల్ మీడియా కార్నర్ 6 జూన్ 2018
June 06th, 07:23 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!