కాప్-28లో పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ కార్యక్రమానికి భారత్-స్వీడన్ సహాధ్యక్షత

December 01st, 08:29 pm

దుబాయ్‌లో కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా 2024-26 కాలానికిగాను పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ (లీడ్ ఐటీ2.0) సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్ సహాధ్యక్షత వహించారు.

వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ కోసం యూఏఈ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన

November 30th, 05:44 pm

యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు అయిన నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు, నేను 1 డిసెంబర్ 2023న కాప్-28 ప్రపంచ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు దుబాయ్‌కి వెళ్తున్నాను.వాతావరణ చర్య రంగంలో భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా ఉన్న యూఏఈ ప్రెసిడెన్సీలో ఈ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోందని. దీనిలో పాల్గొంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అని ప్రధానమంత్రి తన యూఏఈ పర్యటన ముందు ప్రకటన చేశారు..