అంతర్జాతీయ సహకార సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 25th, 03:30 pm

మీ అందరికీ ఈరోజు నేను స్వాగతం పలుకుతున్నానంటే, అది నేనొక్కడిని చేసింది కాదు.. నిజానికి నేనొక్కడినే చేయలేను కూడా. భారత్ లోని లక్షలాది మంది రైతులు, లక్షలాది మంది పశుపోషకులు, దేశంలోని మత్స్యకారులు, 8 లక్షలకు పైగా సహకార సంఘాలు, స్వయంసహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలు, సహకార సంఘాలను సాంకేతికతతో అనుసంధానిస్తున్న భారత యువత తరఫున – మిమ్మల్ని నేను భారత్ కు ఆహ్వానిస్తున్నాను.

2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సుని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 25th, 03:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సును ప్రారంభించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ, భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టోబ్‌గే, ఫిజీ ఉప ప్రధాన మంత్రి శ్రీ మనోవా కమికామికా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ షోంబీ షార్ప్, అంతర్జాతీయ సహకార సమితి అధ్యక్షుడు శ్రీ ఏరియల్ గార్కో, విదేశీ ప్రముఖులు తదితరులకు శ్రీ మోదీ స్వాగతం పలికారు.

The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

గయానా పార్లమెంటునుద్దేశించి భారత ప్రధానమంత్రి ప్రసంగం

November 21st, 07:50 pm

గ‌యానా పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగించారు. అలా ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రి ఆయనే. ఈ ప్రసంగం కోసం స్పీకర్ శ్రీ మంజూర్ నాదిర్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’’పై జి20 సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం

November 18th, 08:00 pm

నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు... జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి గొప్ప ఏర్పాట్లను చేసినందుకు, అలాగే జి20 కి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంలో సాఫల్యాన్ని సాధించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలా కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను.

‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అనే అంశాలు ప్రధానంగా జి 20 కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 18th, 07:55 pm

‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అంశాలు ప్రధానంగా ఈ రోజున నిర్వహించిన జి 20 శిఖరాగ్ర సమావేశ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు, అతిథి మర్యాదలు చక్కని పద్ధతిలో చేస్తున్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిస్ ఇనాషియో లూలా డిసిల్వా కు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. బ్రెజిల్ లో నిర్వహిస్తున్న జి 20 కార్యక్రమాలు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుండడం ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనలపై శ్రద్ధ వహిస్తూ, న్యూ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చేసిన నిర్ణయాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆయన అన్నారు. జి 20 కూటమికి భారతదేశం అధ్యక్షత వహించిన కాలంలో, ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అంటూ ఇచ్చిన పిలుపు రియో చర్చల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు.

PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra

November 14th, 02:30 pm

In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.

సెప్టెంబర్ 20న మహారాష్ట్రలో పర్యటించనున్న ప్రధాని

September 18th, 09:58 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 20న మహారాష్ట్ర వార్ధాలో పర్యటించనున్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభమై ఏడాది అవుతోన్న సందర్భంగా నిర్వహిస్తోన్న జాతీయ స్థాయి కార్యక్రమంలో ఉదయం 11.30 గంటలకు పాల్గొంటారు.

న్యూ ఢిల్లీ లో జరిగిన రెండో ఆసియా పసిఫిక్ పౌర విమానయాన మంత్రుల సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

September 12th, 04:00 pm

వివిధ దేశాలకు చెందిన ప్రముఖులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మీరు ఈ రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. పౌర విమానయాన రంగంలో ఉన్న మేధావులు ప్రస్తుతం మన మధ్యలో ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఇది మన సమష్టి నిబద్ధతను, ఆసియా పసిఫిక్ ప్రాంత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంస్థ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, మా మంత్రి శ్రీ నాయుడు మార్గదర్శకత్వం, నాయకత్వంలో, 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక చెట్టు) తో 80,000 చెట్లను నాటే ఒక ప్రధాన కార్యక్రమం చేపట్టబడింది. అయితే, నేను మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మా దేశంలో ఒక వ్యక్తి 80 ఏళ్ళకు చేరుకున్నప్పుడు, దానిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వేడుకగా జరుపుకుంటారు. మన పూర్వీకుల ప్రకారం, 80 ఏళ్ళకు చేరుకోవడం అంటే వెయ్యి పౌర్ణమి చంద్రులను చూసే అవకాశం కలిగి ఉండటం. ఒకరకంగా చెప్పాలంటే మన సంస్థ కూడా వెయ్యి పౌర్ణమిలను ప్రత్యక్షంగా వీక్షించి, దగ్గరగా చూసిన అనుభవం కలిగింది. ఈ 80 సంవత్సరాల ప్రయాణం ఒక చిరస్మరణీయ ప్రయాణం, విజయవంతమైన ప్రయాణం, అభినందనలకు అర్హమైనది.