297 పురాతన వస్తువులను భారత్‌కు తిరిగిచ్చిన అమెరికా
September 22nd, 12:11 pm
భారత్, అమెరికా మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలకు అనుగుణంగా ఉన్నతమైన సాంస్కృతిక అవగాహనను పెంపొందించుకోవడానికి జూలైలో సాంస్కృతిక సంపద ఒప్పందం కుదిరింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్య, సాంస్కృతిక వ్యవహారాల బ్యూరో, భారత ప్రభుత్వంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల భారతీయ పురావస్తు సర్వేక్షణ విభాగం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు సహకారాన్ని పెంపొందించుకోవాలని 2023 జూన్‌లో జరిగిన సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధానమంత్రి మోదీ చేసిన ఉమ్మడి ప్రకటనలోని లక్ష్యాలను నెరవేర్చడంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది.వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు
September 22nd, 12:06 pm
సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన
September 22nd, 11:51 am
ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .అమెరికా పర్యటనకు ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన
September 21st, 04:15 am
అధ్యక్షుడు బైడెన్ తన స్వస్థలం విల్మింగ్టన్ లో నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి, న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తుకు సంబంధించిన శిఖరాగ్ర సమావేశం (సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ ) లో ప్రసంగించడానికి నేను మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు బయలుదేరుతున్నాను.సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
September 19th, 03:07 pm
ప్రధాని మోదీ 21-23 సెప్టెంబర్ 2024 సమయంలో యూఎస్ సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సెప్టెంబరు 23న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని ప్రసంగిస్తారు.