డిసెంబర్ 15వ తేదీన కచ్ సందర్శించి అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న – ప్రధానమంత్రి
December 13th, 06:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్ 15వ తేదీన గుజరాత్, కచ్ లోని ధోర్డో లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో – లవణ నిర్మూలన ప్లాంటు; హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్తు పార్కుతో పాటు పూర్తిగా ఆటోమేటిక్ గా నడిచే పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ ప్లాంటు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హాజరుకానున్నారు. ప్రధానమంత్రి వైట్ రాన్ లో కూడా పర్యటించి, అక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.