రాజస్తాన్ లోని సికార్ వద్ద పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభం అనంతరం ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం

July 27th, 12:00 pm

నేడు దేశవ్యాప్తంగా 1.25 లక్షల పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ, బ్లాక్ స్థాయిలో ఏర్పాటైన ఈ కేంద్రాలు నేరుగా కోట్లాది మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలిగిస్తోంది. అలాగే 1500 పైగా వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్ పిఓ), మన రైతుల కోసం ‘‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’’ (ఓఎన్ డిసి) ప్రారంభించడం జరిగింది. దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోని రైతు అయినా ఇంట్లోనే కూచుని దేశంలోని ఏ ప్రాంతంలోని మార్కెట్ లో అయినా తేలిగ్గా తమ ఉత్పత్తిని విక్రయించవచ్చు.

రాజస్థాన్ లోనిసీకర్ లో వివిధ అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి

July 27th, 11:15 am

రాజస్థాన్ లోని సీకర్ లో వేరు వేరు అభివృద్ధి పథకాల కు ప్రధాన మంత్రి ఈ రోజు న శంకుస్థాపన చేసి వాటి ని దేశ ప్రజల కు అంకితం చేశారు. ఆయా ప్రాజెక్టుల లో 1.25 లక్షల కు పైచిలుకు ‘పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రాల’ (పిఎమ్ కెఎస్ కె స్) ను దేశ ప్రజల కు అంకితం చేయడం, గంధకం పూత పూసినటువంటి ఒక క్రొత్త రకం యూరియా ‘యూరియా గోల్డ్ ’ ను ప్రవేశపెట్టడం, 1,600 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్) ను ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) లో చేరినట్లు ప్రకటించడం, ‘ప్రధాన మంత్రి కిసాస్ సమ్మాన్ నిధి’ (పిఎమ్-కిసాన్) లో భాగం గా 8.5 కోట్ల మంది లబ్ధిదారుల కు పధ్నాలుగో వాయిదా సొమ్ము తాలూకు దాదాపు 17,000 కోట్ల రూపాయల ను విడుదల చేయడం, చిత్తౌడ్ గఢ్, ధౌల్ పుర్, సిరోహీ, సీకర్, ఇంకా శ్రీ గంగానగర్ లలో నూతన వైద్య కళాశాలలు అయిదింటి ని ప్రారంభించడం, బారాఁ, బూందీ, కరౌలీ, ఝుంఝునూ, సవాయి మాధోపుర్, జైసల్ మెర్ మరియు టోంక్ లలో వైద్య కళాశాల లు ఏడింటి కి శంకుస్థాపన చేయడం, అలాగే ఉదయ్ పుర్, బాన్స్ వాడ, ప్రతాప్ గఢ్ మరియు డుంగర్ పుర్ జిల్లాల లో ఏర్పటైన ఆరు ఏకలవ్య నమూనా ఆశ్రమ పాఠశాలలు ఆరింటిని మరియు జోద్ పుర్ లో కేంద్రీయ విద్యాలయ తింవరీ ని ప్రారంభించడం భాగం గా ఉన్నాయి.

వైట్ హౌస్ ఆగమన వేడుకలో ప్రధాని ప్రకటన

June 22nd, 11:48 pm

మొదటగా, అధ్యక్షుడు బైడెన్ మర్యాదపూర్వక స్వాగతం మరియు వివేకవంతమైన ప్రసంగానికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అమెరికా అధ్యక్షుడితో సంయుక్తంగా పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన తెలుగు అనువాదం

June 22nd, 11:19 pm

భారత-అమెరికా వాణిజ్య/పెట్టుబడి భాగస్వామ్యం మా రెండు దేశాలకు మాత్రమేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ కీలకమైనది. నేడు భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో అపరిష్కృత వాణిజ్య సంబంధ సమస్యలకు స్వస్తి పలికి సరికొత్తగా ప్రారంభించాలని మేం నిర్ణయించుకున్నాం. మా సాంకేతిక సహకారంలో భాగంగా ‘సునిశిత-భవిష్యత్‌ సాంకేతికతల కోసం చొరవ’ (ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్-ఐసిఇటి) ఒక ముఖ్యమైన చట్రంగా రూపొందింది. ఆ మేరకు కృత్రిమ మేధస్సు. సెమి-కండక్టర్స్, అంతరిక్షం, క్వాంటం, టెలికాం వగైరా రంగాల్లో సహకార విస్తరణ ద్వారా బలమైన భవిష్యత్ భాగస్వామ్యం నిర్మిస్తున్నాం. మైక్రాన్, గూగుల్, అప్లైడ్ మెటీరియల్స్ వంటి అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించడమే దీనికి నిదర్శనం.

టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్‌ లో భార‌తీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగం

September 22nd, 11:59 pm

ఈ దృశ్యం, ఇక్క‌డి వాతావ‌ర‌ణం నిజం గా అనూహ్యం. టెక్సాస్ విష‌యానికొస్తే ఇక్క‌డంతా భారీ గా, గొప్ప‌గా ఉండాల్సిందే. టెక్సాస్ స్వ‌భావంలోనే ఇదొక విడ‌దీయ‌లేని భాగం. టెక్సాస్ స్పూర్తి కూడా ఈ రోజు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ హాజరైన భారీ జనసమూహం లెక్కలకు అందనిది. చరిత్రలోనేగాక మానవ సంబంధాల్లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే ప్రక్రియకు మనమిక్కడ సాక్షులమవుతున్నాం. అలాగే భారత-అమెరికాల మధ్య పెరుగుతున్న ఏకీభావానికి ఇప్పుడు ఎన్నార్జీ స్టేడియంలో పొంగిపొర్లుతున్న ఉత్సాహమే రుజువు. అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం; అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లో రిపబ్లికన్ పార్టీ వారు కావచ్చు లేదా డెమెక్రాటిక్ పార్టీ వారు కావచ్చు… ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనడం.. వారు భారతదేశాన్ని, నన్ను కొనియాడటం, అభినందించడం; అలాగే శ్రీ స్టెనీ హోయర్, సెనేటర్ శ్రీ కార్నిన్, సెనేటర్ శ్రీ క్రూజ్, ఇతర మిత్రులు భారతదేశ ప్రగతి ని వివరిస్తూ మమ్మల్ని ప్రశంసించడం… వగైరాలన్నీ మొత్తంగా అమెరికా లోని భారతీయుల సామర్థ్యాల ను, వారు సాధించిన విజయాల ను గౌరవించడం గా మనం పరిగణించాలి.

హ్యూస్టన్ లో జ‌రిగిన భార‌తీయ స‌ముదాయం యొక్క కార్య‌క్ర‌మం ‘హౌడీ మోదీ’ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్రధాన మంత్రి

September 22nd, 11:58 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్ లో గ‌ల ఎన్ఆర్‌జి స్టేడియ‌మ్ లో జ‌రిగిన ‘హౌడీ మోదీ’ కార్య‌క్ర‌మం లో యాభై వేల మంది కి పైగా స‌భికుల ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప్రధాన మంత్రి వెంట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్య‌క్షుడు శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ ఉన్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడిని కలిసిన ప్రధాని మోదీ

June 27th, 12:40 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైట్ హౌస్ వద్ద యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తో సమావేశమయ్యారు. కీలకమైన విభాగాలలో భారత-అమెరికా భాగస్వామ్యాన్ని మెరుగుపర్చడానికి పలువురు సమస్యలను చర్చించారు.

మీకు వైట్ హౌస్లో నిజమైన స్నేహితుడు ఉన్నాడు: ప్రధాని మోదీ తో అధ్యక్షుడు ట్రంప్

June 27th, 03:33 am

నేడు మీడియాతో మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ వైట్ హౌస్లోభారతదేశానికి నిజమైన స్నేహితుడు ఉన్నాడని అన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య నాయకుడిని ఆహ్వానించడం ఎంతో గౌరవమని, ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని, అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రజల సంస్కృతి, వారసత్వం మరియు సాంప్రదాయాలు కూడా ప్రశంసించారు. భారతదేశం మరియు అమెరికా ఎల్లప్పుడూ స్నేహం మరియు గౌరవం లో కలిసి ఉంతాయి, అని అమెరికా అధ్యక్షుడు నొక్కిచెప్పారు.

అమెరికాను ఒక విలువైన భాగస్వామిగా చూస్తాము: ప్రధాని మోదీ

June 27th, 03:22 am

అమెరికా అధ్యక్షునితో కలిసి సంయుక్తంగా ప్రధాని నరేంద్ర మ్న్మోదీ మాట్లాడుతూ, మా ప్రధాన కార్యక్రమాలలో యుఎస్ఎ ఒక విలువైన భాగస్వామిగా ఉంది అన్నారు. వాణిజ్యం,వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ భారత్-అమెరికా సహకారం కీలకమైన ప్రాంతాలుగా వున్నాయని ప్రధాని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిసిన ప్రధాని మోదీ, వైట్ హౌస్లో కీలకమైన చర్చలు జరిపారు

June 27th, 01:23 am

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు అమెరికా అధ్యక్షుడు, డోనాల్డ్ ట్రంప్ ను కలుసుకున్నారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించారు. ప్రధానమంత్రి మోదీ మీడియాకు క్లుప్తమైన వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీ, తనకు ప్రెసిడెంట్ ట్రంప్ మరియు ప్రథమ మహిళ అందించిన సాదరస్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు.