పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో, జి.20 అవినీతి వ్యతిరేక, మంత్రులస్థాయి సమావేశానికి సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో ప్రసంగం.

August 12th, 10:21 am

జి 20, అవినీతి వ్యతిరేక మినిస్టీరియల్ సమావేశం భౌతిక స్థాయిలో తొలిసారిగా జరుగుతున్నందున మీఅందరికీ నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. మీరు నోబుల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నగరమైన కోల్ కతాలో సమావేశమౌతున్నారు. వారు తమ రచనలలో అత్యాశ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు, ఎందుకంటే, అది వాస్తవాన్ని గ్రహించకుండా మనల్ని నిరోధిస్తుంది. ప్రాచీన ఉపనిషత్ లు మా గ్రుథ అని సూచించాయి. అంటే , అత్యాశపనికిరాదని సూచించాయి.

అవినీతి నిరోధంపై జి-20 సచివులస్థాయి భేటీలో ప్రధాని ప్రసంగం

August 12th, 09:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అవినీతి నిరోధంపై కోల్‌కతాలో నిర్వహించిన జి-20 సచివుల స్థాయి సమావేశంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా నోబెల్‌ పురస్కార గ్రహీత అయిన గురుదేవుడు రవీంద్రనాథ్‌ టాగూర్‌ నగరం కోల్‌కతా వచ్చిన ప్రముఖులకు ఆయన స్వాగతం పలికారు. అవినీతి నిరోధంపై జి-20 సచివుల స్థాయి సమావేశం ప్రత్యక్షంగా నిర్వహించడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఠాగూర్ రచనలను ప్రస్తావిస్తూ- ఎవరికైనా దురాశ తగదని, అది సత్యాన్వేషణకు అడ్డుగోడగా నిలుస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ‘మా గృథా’.. అంటే- దురాశకు తావుండరాదు’ అన్న ప్రాచీన భారతీయ ఉపనిషత్తు ఉద్బోధను ప్రధాని ఉటంకించారు.