ఈ ఆపత్కాలంలో మనమంతా కేరళ ప్రజలకు అండగా నిలుద్దాం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

August 10th, 10:58 pm

కేరళ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం కొనసాగిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హామీ ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస సందేశాలు పంపారు...

Our prayers are with those affected by the landslide in Wayanad: PM Modi

August 10th, 07:40 pm

Prime Minister Narendra Modi visited Wayanad, Kerala, to assess the damage caused by a landslide. He assured that the Central Government is committed to providing full support for relief efforts and stands by the State Government and the affected people. During his visit, he met with injured patients, interacted with residents in relief camps, and attended a review meeting to discuss further assistance.

వాయ‌నాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విపత్తులో బాధితుల క్షేమం కోసం మేం ప్రార్థిస్తున్నాం: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 10th, 07:36 pm

వాయ‌నాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, సహాయ-పునరావాస కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా అండదండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి శనివారం నాడు కేరళలోని వాయనాడ్ ప్రాంతాన్ని విమానం నుంచి పరిశీలించారు. అనంతరం కొండచరియల పతనం వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు వెళ్లి, ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

కేరళ లోని వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి సంతాపం

July 30th, 10:30 am

కేరళ వాయనాడ్ లోని కొన్ని ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డ కారణంగా పలువురు ప్రాణాలను కోల్పోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ తో కూడా మాట్లాడారు. అక్కడ తలెత్తిన స్థితి ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సాద్యమై అన్ని రకాల సహాయాన్నీ అందిస్తామంటూ ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.