ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ , ఉత్తర ప్రదేశ్ పర్యటన

February 21st, 11:41 am

ఫిబ్రవరి 22న ఉదయం 10:45 గంటలకు అహ్మదాబాద్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మహేసన చేరుకుని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు, దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహేసనలోని తారాభ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని రూ.8,350 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:15 గంటలకు నవ్సారికి చేరుకుని, అక్కడ రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల జాతికి అంకితం చేసి, శంకుస్థాపన, సుమారు రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన, పనుల ప్రారంభం చేస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ప్రధాన మంత్రి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ను సందర్శిస్తారు. అక్కడ రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను (పిహెచ్ డబ్ల్యుఆర్) జాతికి అంకితం చేస్తారు.

దేశీయ అణు పరిశ్రమ రూపాంతరం చెందడానికి ప్రోత్సాహం

May 17th, 06:28 pm

దేశీయ పరమాణు ఇంధ‌న కార్య‌క్ర‌మం శీఘ్రంగా ప్ర‌గ‌తి సాధించ‌డానికి వీలుగా కేంద్రం ఒక ముఖ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంది. త‌ద్వారా దేశ పరమాణు ప‌రిశ్ర‌మ‌కు మ‌రింత ప్రోత్సాహం ల‌భించిన‌ట్ట‌యింది. ఒత్తిడితో కూడిన 10 భార‌జ‌ల రియాక్ట‌ర్లను ( ప్రెజ‌రైజ్డ్ హెవీ వాట‌ర్ రియాక్ట‌ర్స్.. పిహెచ్ డ‌బ్ల్యు ఆర్‌) దేశీయంగా నిర్మాణం చేసుకునేందుకు వీలుగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అద్య‌క్ష‌త‌న స‌మావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రారంభించ‌బోయే ప్లాంటుల ద్వారా ఉత్ప‌త్తి అయ్యే విద్యుత్తు 7000 మెగావాట్లు. 10 పిహెచ్ డ‌బ్ల్యు ఆర్ ప్రాజెక్టు వ‌ల్ల దేశంలోని పరమాణు ఇంధ‌న ఉత్పత్తి సామ‌ర్థ్యం గ‌ణ‌నీయంగా పెరుగుతుంది.